BigTV English

Challa Sreenivasulu as SBI New Chairman: ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Challa Sreenivasulu as SBI New Chairman: ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

Challa Sreenivasulu as SBI New Chairman(TS news updates): దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – SBI నూతన చైర్మన్‌గా తెలంగాణ వ్యక్తి నియామకమయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ స్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ), ఎస్‌బీఐ కొత్త చైర్మన్ గా తెలంగాణకు చెందిన వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును సిఫార్సు చేసింది. చల్లా శ్రీనివాసులు శెట్టిని బ్యాంక్ వర్గాలు సీఎస్ శెట్టి అని పిలుస్తాయి.


చల్లా శ్రీనివాసులు ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పదవిలో ఉన్నారు. నాలుగున్నరేళ్ల క్రితం, 2020 జనవరిలో ఎస్‌బీఐ ఎండీగా నియమితులయ్యారు. అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్లు, టెక్నాలజీ విభాగాల బాధ్యతలను ఆయన ప్రస్తుతం నిర్వర్తిస్తున్నారు.

అయితే, స్టేట్ బ్యాంక్ ప్రస్తుత చైర్మన్ దినేష్ ఖరా వయస్సు 63 సంవత్సరాలు. ఈ ఏడాది ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో.. బ్యాంక్ కొత్త చైర్మన్ గా చల్లాను నియమించింది.


దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల సీనియర్ అధికారుల నియామకానికి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్ బ్యూరో బాధ్యత వహిస్తది. ఈ పదవి కోసం ముగ్గురిని ఇంటర్వ్యూ  చేసిన ఎఫ్ఎస్ఐబీ.. చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును సిఫార్సు చేసింది. ఎస్‌బీఐ ప్రస్తుత చైర్మన్ ఖరా పదవీ కాలం ముగియకముందే, బ్యాంక్ కొత్త చైర్మన్ నియామకం కోసం సీఎస్ శెట్టి పేరును సూచించింది.

రిటైల్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ బ్యాంకింగ్ తోపాటు బ్యాడ్ లోన్ రికవరీలో చల్లా శ్రీనివాసులుకు మంచి అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో చల్లా.. ఎస్‌బీఐ చైర్మన్ అయిన తరువాత ప్రధానంగా బ్యాంక్ బ్యాడ్ లోన్ రికవరీపై దృష్టి పెట్టవచ్చు.

అయితే.. శ్రీనివాసులు నియామకం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన శ్రీనివాసులు ప్రతిష్టాత్మకమైన ఎస్‌బీఐ చైర్మన్ పదవిని అధిరోహించడం ఒక మహత్తర సందర్భమంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుకు నూతనంగా నియమితులైన చైర్మన్ కు తెలంగాణ రాష్ట్రం తరఫున అభినందనలు తెలియజేశారు. శ్రీనివాసులు తన కొత్త పాత్రలో అనేక విజయాలు మరియు ప్రశంసలతోపాటు పదవీకాలం కొనసాగాలంటూ సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read: కరీంనగర్, వరంగల్ ప్రజలకు శుభవార్త.. సీఎం రేవంత్​ రెడ్డి చొరవతో స్పందించిన కేంద్రం

చల్లా శ్రీనివాసులు ఎవరు..?

ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న చల్లా.. 36 సంవత్సరాలకు పైగా బ్యాంక్ సర్వీస్ లో ఉన్నారు. 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్ గా ఎస్‌బీఐలోకి అడుగుపెట్టారు. నిజానికి ఆయన బ్యాంకర్ కావాలని అనుకోలేదట. ఐఏఎస్ కావాలన్నది ఆయన టార్గెటంటా. అయితే, తోటి వాళ్లు బ్యాంక్ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తుంటే.. చల్లా కూడా పరీక్ష రాసి ఎంపికయ్యారంటా. అలా స్టేట్ బ్యాంక్ ఉద్యోగ పర్వంలోకి ప్రవేశించారు. సమాజానికి సేవ చేసే అవకాశం బ్యాంక్ లోనూ ఉందని గ్రహించి, ఐఏఎస్ కలను వదిలేసి, అందులో స్థిరపడిపోయారు. ప్రొబేషనరీ ఆఫీసర్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి, ప్రస్తుతం చైర్మన్ అయ్యారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×