BigTV English

RCB Goodluck Donation: ఆర్సీబీ కోసం రూ.10 డొనేట్ చేయండి.. ఐపిల్ కప్ కొట్టాలని ప్లీజ్ ప్రార్థించండి

RCB Goodluck Donation: ఆర్సీబీ కోసం రూ.10 డొనేట్ చేయండి.. ఐపిల్ కప్ కొట్టాలని ప్లీజ్ ప్రార్థించండి

RCB Goodluck Donation| ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL- ఐపిఎల్) అంటే కేవలం ఒక క్రికెట్ టోర్నమెంట్ మాత్రమే కాదు. అది ఇండియాలో ఒక క్రీడా సంస్కృతిగా మారిపోయింది. ప్రతీ సంవత్సరం కొత్త సీజన్ రాగానే ఐపిఎల్ ఫ్యాన్స్ గోల మామూలుగా ఉండదు. తమ ఫేవరెట్ టీమ్స్‌కు ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్‌గా నిలుస్తారు.


ఐపిఎల్ ఫ్రాంచైజీలన్నింటిల్లో కల్లా బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్సీబీ) టీమ్ కు బలమైన ఫ్యాన్ బేస్ ఉంది అనేది ఎవరూ కాదనలేని నిజం. అయితే ఈ టీమ్ లో పెద్ద సెలబ్రిటీలు ఉన్నప్పటికీ ఐపిఎల్ చరిత్రలో ఇంతవరకూ బెంగళూరు ఒక్కసారి కూడా కప్ గెలుచుకోకపోవడం దురదృష్టకరం. అందుకే ఆర్సీబీ ఈ సారి ఐపిఎల్ కప్ కొట్టాలని ఫ్యాన్స్ భారీగా హంగామా చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక అభిమాని చేసిన కృషి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

బెంగుళూరు టీమ్ డై హార్డ్ ఫ్యాన్ అయిన సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ సార్థక్ సచ్‌దేవా బెంగుళూరులో ఒక సోషల్ ఎక్స్‌పరిమెంట్ చేశాడు. ఆర్సీబీ ఈ సారి ఐపిఎల్ కప్ గెలవాలని కోరుకునే వారు టీమ్ కు గుడ్ లక్ కోసం రూ.10 దానం చేయాలని పోస్టర్లు ప్రింట్ చేయించాడు. ఆ పోస్టర్లన్నీ నగరమంతా బహిరంగ ప్రదేశాల్లో అంటించాడు. ఆ పోస్టర్లపై క్యూఆర్ కోడ్, కోహ్లి ఫొటో ఉంది. కింద “డొనేట్ రూ.10 ఫర్ ఆర్సీబీ గుడ్ లక్” అని క్యాప్షన్ పెట్టాడు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో సార్థక్ కూడా ఒక వీడియో ఇంటర్నెట్ లో పోస్ట్ చేశాడు.


ఇప్పుడు సార్థక్ పెట్టిన పోస్టర్లు చూసి చాలా మంది రెస్పాండ్ అవుతున్నారు. ఒక్క రోజులోనే అతనికి రూ.1200 వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా సార్థక్ వీడియోకి 35 లక్షల వ్యూస్ లభించాయి. ఇదంతా చూసి నెటిజెన్లు భలే కామెంట్లు చేస్తున్నారు.

Also Read: ఐపిఎల్‌లో ప్లే ఆఫ్ చాన్సులు..ఏ టీమ్‌ ఏ స్థాయిలో ఉందంటే..

ఒకరైతే.. “నయా బిజినెస్ ఐడియా గురూ” అని రాస్తే.. మరో అమ్మాయి “ఇంత చేశాక.. ఈసారి కూడా ఆర్సీబీ గెలవకపోతే నేను ఏడ్చేస్తాను” అని కామెంట్ పెట్టింది.

ఇక ఐపిఎల్ పాయింట్ల పట్టిక చూస్తే.. ప్రస్తుతం బెంగుళూరు టీమ్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఆడిన 10 మ్యాచ్ లలో 7 గెలుచుకుంది. విచిత్రమేమిటంటే విజయం సాధించిన మ్యాచ్ లన్నీ ఇతర నగరాల్లో ఆడినవి. సొంత హోం గ్రౌండ్ లో ఆడిన మూడు మ్యాచ్ లు ఆర్సీబీ ఓడిపోయింది. దీంతో ఇక టోర్నమెంట్ చివరి దశకు రాగానే అభిమానులు ఆందోళన చెందుతున్నారు. లీగ్ మ్యాచ్ లు ఇంకా నాలుగు మిగిలి ఉన్నాయి. వాటిలో మూడు చిన్న స్వామి స్టేడియంలోనే జరుగనున్నాయి. హోం గ్రౌండ్ లో కూడా కోహ్లి టీమ్ రాణించాలని ఇప్పుడు ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు.

Tags

Related News

IND vs BAN: పసికూన బంగ్లాదేశ్ పై పంజా…ఆసియా కప్ ఫైనల్స్ కు టీమిండియా..ఇంటికి శ్రీలంక

IND vs BAN: త‌డ‌బ‌డిన టీమిండియా…బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే ?

Abhishek Sharma: అభిషేక్ కొంప‌ముంచిన సూర్య‌.. క‌ష్టాల్లో టీమిండియా, సంజూకు బ్యాటింగ్ ఇవ్వ‌క‌పోవ‌డంపై ట్రోలింగ్‌

India vs Bangladesh: టాస్ గెలిచిన బంగ్లాదేశ్‌…బ్యాటింగ్ ఎవ‌రిదంటే

Vaibhav Suryavanshi : 41 సిక్సుల‌తో చెల‌రేగిన వైభ‌వ్‌..ఆస్ట్రేలియా దారుణ ఓట‌మి

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Big Stories

×