Big Stories

Hanuman Jayanthi 2024: హనుమాన్‌ని భజరంగ భళి అని ఎందుకు పిలుస్తారు..?

Hanuman Jayanthi 2024 Special Story: హనుమంతుడు జన్మించిన రోజున హనుమాన్ జయంతి జరుపుకుంటారు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ 23 వ తేదీన అంటే మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. హిందూ పురాణాల ప్రకారం హనుమంతుడిని స్మరిస్తే దైర్యం, శక్తి, కీర్తి వంటివి లభిస్తాయని పండితులు చెబుతుంటారు. అంతేకాదు హనుమంతుడిని పూజించడం వల్ల భయం పోయి, మానసిక ఆందోళన నుంచి భయటపడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే ఈ హనుమాన్ జయంతి సందర్భంగా అసలు హనుమంతుడిని భజరంగ భళి అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం.

- Advertisement -

భజరంగ భళి అనే పేరు ఎలా వచ్చింది..

- Advertisement -

రామాయణ మహాగాథ ప్రకారం ఓ రోజు సీతమ్మ నుదుటన కుంకుమ పెట్టుకునే సమయంలో సీతమ్మను హనుమంతుడు అమ్మా నుదుటన కుంకుమ ఎందుకు పెట్టుకుంటారు అని అడిగాడు. దానికి సీతమ్మ సమాధానమిస్తూ.. హనుమా.. నా భర్త శ్రీ రాముడు సుదీర్ఘకాలం జీవించాలని కోరుకుంటూ కుంకుమను నుదుటన బొట్టుగా పెట్టుకుంటారు అని చెప్పిందట.

Also Read: Hanuman Jayanthi 2024: హనుమాన్‌ జయంతి రోజు ఏం చేయాలి..?

దీంతో హనుమంతుడు నేను కుంకుమను శరీరం మొత్తం పూసుకుంటే శ్రీరాముడు తనతోనే జీవిత కాలం ఉంటాడని అని హనుమంతుడు అంటాడు. అనంతరం హనుమంతుడు కుంకుమను శరీరం అంతా పూసుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. అయితే కుంకుమను భజరంగ్ అని పిలుస్తారు. అందువల్ల హనుమంతుడిని భజరంగ్ భళి అని పేరు వచ్చింది. అందువల్ల ఆంజనేయస్వామిని కుంకుమతో పూజిస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News