Big Stories

Hanuman Jayanthi 2024: హనుమాన్‌ జయంతి రోజు ఏం చేయాలి..?

Hanuman Jayanthi 2024: హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీన మంగళవారం నాడు రానున్న విషయం తెలిసిందే. హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో హనుమాన్ జయంతి ఒకటి. పురాణాల ప్రకారం హనుమానం జయంతిని.. హనుమంతుడు పుట్టిన రోజుగా వర్ణిస్తూ జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం రావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడికి శుభప్రదమైన రోజుగా భావించే రోజే హనుమాన్ జయంతి రావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

అయితే హిందూ క్యాలెండర్ ప్రకారం హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. చైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి రోజున, మరొకటి వైశాఖ దశమి రోజున హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తారు. అయితే హనుమాన్ జయంతి రోజు హనుమంతుడిని భక్తులు భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. ఈ తరుణంలో ఆలయాలన్నీ కిటకిటలాడుతుంటాయి. ఆంజనేయ స్వామికి ఇష్టమైన నైవేద్యాలు చేసి పెడుతుంటారు. అయితే అసలు హనుమాన్ జయంతి రోజు చేయాల్సిన పనులు, పూజలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: ఏప్రిల్ 22 నుండి 28 వరకు జాతక చక్రం.. ఈ రాశుల కెరీర్‌లో అద్భుతం!

తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేయాలి. అనంతరం ఆంజనేయ స్వామికి ఇష్టమైన నారింజ రంగు దుస్తులను ధరించి దగ్గరలోని ఆంజనేయస్వామి గుడికి వెళ్లాలి. స్వామి వారికి సువాసనతో నిండిన నూనె, సింధూరాన్ని సమర్పించాలి. అనంతరం హనుమాన్ చాలీస చదివి హనుమంతుడిని పూజించాలి. ఒకవేళ గుడికి వెళ్లే సమయం లేనివారు అయితే ఇంట్లోని పూజ గదిలో కూడా హనుమంతుడిని పూజించవచ్చు.

హనుమాన్ జయంతి రోజు స్వామి వారికి ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం కలుగుతుంది. నేలపై నిద్రించి మానసికంగా దేవుడిని ప్రార్థిస్తూ పూజించడం వల్ల హనుమంతుడు అనుగ్రహిస్తాడని భక్తులు నమ్ముతారు. హనుమాన్ జయంతి నాడు అన్నదానం లేదా వస్త్ర దానం చేయడం చాలా మంచిది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News