BigTV English

Lunar Eclipse 2024 on Holi: హోలీ రోజున చంద్రగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం

Lunar Eclipse 2024 on Holi: హోలీ రోజున చంద్రగ్రహణం.. ఈ రాశులపై తీవ్ర ప్రభావం
Lunar Eclipse 2024
Lunar Eclipse 2024

Lunar Eclipse 2024 Date: వేద పంచాంగం ప్రకారం 2024లో తొలి చంద్రగ్రహణం మార్చి 25న ఏర్పడుతుంది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. కానీ ఇది అన్ని రాశులపై మాత్రం ప్రభావం చూపిస్తుంది. చంద్రగ్రహణం సమయంలో పాటించాల్సిన అనేక రకాల నియమాలు తెలుసుకుందాం.


మార్చి 25న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 03. 02 వరకు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.  చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా సూతక కాలం కూడా ఉండదు. కానీ చంద్ర గ్రహణం మొత్తం 12 రాశులను వివిధ మార్గాల్లో ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

రాశులపై చంద్రగ్రహణం ప్రభావం..


మేషం.. చంద్రగ్రహణం మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే అనేక రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

Also Read: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి గురుడు ప్రవేశం.. ఈ రాశులకు వారి గుడ్ న్యూస్..

వృషభం.. వృషభ రాశి వారు చంద్రగ్రహణం వల్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో సమస్యలు తలెత్తవచ్చు. అన్నదానం చేస్తే మంచి జరుగుతుంది.

మిథునరాశి.. మిథున రాశి వారు చంద్రగ్రహణం వల్ల ప్రయోజనం పొందవచ్చు. ఈ కాలంలో ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల సమస్యలు పరిష్కారమవుతాయి. గోవుకు మేత దానం చేస్తే మంచిది.

కర్కాటకం.. కర్కాటక రాశి వారికి ఈ గ్రహణం మిశ్రమంగా ఉంటుంది. ఈ సమయంలో మనస్సు ఆందోళన చెందుతుంది. కానీ ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. చంద్ర భగవానుడి బీజ మంత్రాలను జపించడం మంచిది.

Also Read: Guru Gochar 2024: 12 ఏళ్ల తర్వాత వృషభ రాశిలోకి గురుడు ప్రవేశం.. ఈ రాశులకు వారి గుడ్ న్యూస్!

సింహం.. సింహ రాశి వారిపై చంద్రగ్రహణం మిశ్రమ ప్రభావాలను చూపుతుంది. ఈ కాలంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. పాత జబ్బు మళ్లీ తిరగబెట్టే ప్రమాదం ఉంది. సూర్య భగవానుడి బీజ మంత్రాన్ని జపించడం మంచిది.

వృశ్చికం.. వృశ్చిక రాశి వారికి చంద్రగ్రహణం అనుకూలంగా ఉండబోతోంది. ఈ కాలంలో కార్యాలయంలో మార్పులు చేయవచ్చు. ఇది ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఉదయం పూట హనుమాన్ చాలీసా పఠించడం మంచిది.

ధనుస్సు.. ఈ చంద్రగ్రహణం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. అలాగే కుటుంబ జీవితంలో సమస్యలు తలెత్తవచ్చు. ఈ రోజ ఆవుకి ఆహారం పెట్టడం మంచిది.

Also Read: Lunar Eclipse 2024: 100 ఏళ్ల తర్వాత హోలీ రోజున చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారు బీ కేర్‌ఫుల్..!

మకరం.. మకర రాశి వారు చంద్రగ్రహణం సమయంలో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఇది ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. చంద్రుడి బీజ మంత్రాన్ని జపించడం మంచిది.

కుంభం.. కుంభ రాశి వారు చంద్రగ్రహణం సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని నియంత్రించండి. అవసరమైన వ్యక్తికి బూట్లు లేదా చెప్పులు దానం చేయడం మంచిది.

మీనం.. మీన రాశి వారికి చంద్రగ్రహణం సాధారణంగా ఉంటుంది. ఈ కాలంలో సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కానీ తల్లితండ్రుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆవుకు ఆహారం తినిపించండి.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×