BigTV English

BJP MP Candidates Fourth List: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. విరుధునగర్ నుంచి రాధికా శరత్ కుమార్‌ పోటీ!

BJP MP Candidates Fourth List: బీజేపీ నాలుగో జాబితా విడుదల.. విరుధునగర్ నుంచి రాధికా శరత్ కుమార్‌ పోటీ!

BJP Fourth List


BJP Candidates Fourth List: భారతీయ జనతా పార్టీ 15 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేసింది. పుదుచ్చేరిలోని ఒక స్థానానికి, తమిళనాడులోని 14 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

విరుధునగర్ నియోజకవర్గం నుంచి ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌కు బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇటీవలే రాధిక భర్త శరత్ కుమార్ తన అఖిల భారత సమతువ మక్కల్ కట్చి (AISMK) పార్టీని రెండు వారాల క్రితం బీజేపీలో విలీనం చేసిన తర్వాత రాధికా శరత్ కుమార్‌కు అవకాశం కల్పించడం విశేషం.


డీఎండీకే అధినేత విజయకాంత్ తనయుడు షణ్ముగ పాండియన్ విరుదునగర్ జిల్లా నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు జోరుగా సాగుతున్న తరుణంలో రాధిక శరత్ కుమార్‌కు బీజేపీ అవకాశం కల్పించడం గమనార్హం.

బీజేపీ నాల్గవ అభ్యర్థుల జాబితా

పుదుచ్చేరి – ఏ నమశ్శివాయం
తిరువళ్లూరు (SC) – బాలగణపతి
చెన్నై నార్త్ – పాల్ కనగరాజ్
తిరువణ్ణామలై – అశ్వథామన్
నమక్కల్ – కేపీ రామలింగం

Also Read: బీజేపీ మూడో జాబితా విడుదల.. చెన్నై సౌత్ నుంచి తమిళిసై పోటీ..

తిరుప్పూర్ – ఏపీ మురుగానందం
పొల్లాచ్చి – వసంతరాజన్
కరూర్ – వీవీ సెంథిల్నాథన్
చిదంబరం (SC)- కార్తీయాయినీ
నాగపట్నం (SC) – SGM రమేష్
తంజావూరు – మురుగానందం
శివగంగ – దేవనాథన్ యాదవ్
విరుధునగర్ – రాధికా శరత్‌కుమార్
మధురై – రామ శ్రీనివాసన్
తెన్కాసి – జాన్ పాండియన్

బీజేపీ మార్చి 2, 13 తేదీల్లో విడుదల చేసిన రెండు జాబితాలలో 267 మంది అభ్యర్థులను ప్రకటించింది. 195 మంది పేర్లతో కూడిన తొలి జాబితాలో పీఎం నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కిరెన్ రిజిజు, తపిర్ గావ్ వంటి ప్రముఖులు ఉన్నారు. రాజీవ్ చంద్రశేఖర్, శివరాజ్ సింగ్ చౌహాన్, అర్జున్ రామ్ మేఘ్వాల్, బండి సంజయ్ కుమార్, అజయ్ మిశ్రా తేని, సాధ్వి నిరంజన్ జ్యోతి, నిసిత్ ప్రమాణిక్ తదితరులు ఉన్నారు.

కాగా మార్చి 21న 9 మంది అభ్యర్ధులతో బీజేపీ మూడవ జాబితా ప్రకటించింది. శుక్రవారం మరో 15 మంది అభ్యర్థులతో నాలుగో జాబితా విడుదల చేసింది. మూడో జాబితాలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు చోటు కల్పించగా.. నాలుగో జాబితాలో సినీ నటి రాధికా శరత్ కుమార్‌కు అవకాశం కల్పించింది బీజేపీ.

Related News

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Discount Scheme: వాహనదారులకు ప్రభుత్వం కొత్త స్కీమ్.. ఏ మాత్రం ఆలస్యం వద్దు

PM Modi: రంగంలోకి సుదర్శన చక్ర.. ఇక శత్రువులకు చుక్కలే!

India Warning: పాక్‌కు వార్నింగ్ ఇచ్చిన ఇండియా.. ఈసారి వారి మంచి కోసమే, వాళ్లంతా సేఫ్!

CISF Women Commando: పురుషుల ఆధిపత్యానికి ఫుల్‌స్టాప్…. మహిళా కమాండోలు ఎంట్రీ!

Big Stories

×