BigTV English

Lunar Eclipse 2024: మార్చి 25న చంద్రగ్రహణం.. హోలీపై ప్రభావం ఉంటుందా..?

Lunar Eclipse 2024: మార్చి 25న చంద్రగ్రహణం.. హోలీపై ప్రభావం ఉంటుందా..?

 


Lunar Eclipse

Lunar Eclipse 2024: 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25న హోలీ రోజున ఏర్పడుతుంది. ఖగోళ శాస్త్ర ఘటన ఈ సంవత్సరం హోలీ వేడుకలను ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకుందాం.


సాధారణంగా మూడు రకాల చంద్రగ్రహణాలు ఉంటాయి. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం, పెనుంబ్రల్ గ్రహణం. 2024 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 25 ఏర్పడుతుంది. అదే రోజు భారతదేశంలో హోలీ పండుగ జరుపుకోనున్నారు. రంగుల వేడుక దేశంలోని అతిపెద్ద పండుగల్లో ఒకటి. సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీ రోజునే వస్తుంది .

భూమి నీడలోకి వెళ్లినప్పుడు చంద్రుడు చీకటిగా మారడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు, సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుని ఉపరితలంపై పడుతుంది. అప్పుడు చంద్రుడు మసకబారతాడు. కొన్ని గంటల వ్యవధిలో చంద్రుని ఉపరితలం ఎరుపు రంగులోకి మారుతుంది. ప్రతి చంద్రగ్రహణం భూమి సగం నుంచి కనిపిస్తుందని నాసా పేర్కొంది.
చంద్రగ్రహణం పౌర్ణమి రోజు ఏర్పడుతుంది.

Read More: మహా శివరాత్రి రోజున ఉపవాసం చేస్తున్నారా ?ఈ నియమాలు తెలుసుకోండి..

మార్చి 25 ఏర్పడేది పెనుంబ్రల్ చంద్రగ్రహణం. చంద్రుడు భూమి పెనుంబ్రా లేదా దాని నీడ మందమైన బయటి భాగం గుండా ప్రయాణిస్తాడు. చంద్రుడు కొద్దిగా మాత్రమే మసకబారతాడు. 2024 మొదటి చంద్రగ్రహణం మార్చి 25న ఏర్పడుతుంది. ఆరోజు ఉదయం 10:23 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:02 గంటలకు ముగుస్తుంది.

చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈసారి సూతక్ కాలం వర్తించదు. ఐర్లాండ్, బెల్జియం, స్పెయిన్, ఇంగ్లాండ్, దక్షిణ నార్వే, ఇటలీ, పోర్చుగల్, రష్యా, జర్మనీ, అమెరికా, జపాన్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్ దేశాల్లో చంద్రగ్రహణం కనిపిస్తుంది.

భారతీయ సంప్రదాయం ప్రకారం చంద్రగ్రహణానికి ముందు తొమ్మిది గంటల వ్యవధిని సూతక్ కాలం అంటారు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయని నమ్ముతారు. ఈ కాలంలో శుభకార్యాలు సాధారణంగా చేయరు. కాబట్టి ఈ సంవత్సరం హోలీ వేడుకలపై సూతక్ కాలం ప్రభావం చూపుతుందా? అంటే లేదనే చెప్పాలి. మార్చి 25 నాటి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతక్ కాలం చెల్లదు. అందువల్ల హోలీ పూజ , వేడుకలు యథావిధిగా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవచ్చు.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.

Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×