BigTV English

Barkha Madan : కోట్ల ప్రాపర్టీని వదిలి సన్యాసిగా మారిన నటి

Barkha Madan : కోట్ల ప్రాపర్టీని వదిలి సన్యాసిగా మారిన నటి

Barkha Madan is an actress who left her Kotla property and became a monk


Barkha Madan is an actress became a monk : కోట్లను వదిలి సన్యాసిగా మారింది పంజాబ్ రాష్ట్రానికి చెందిన హీరోయిన్‌ బర్ఖా మదన్. తన కెరీర్‌ మొదట్లో ఆమె మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. 1994లో మిస్ ఇండియా ఫైనల్‌లో మొదటి రన్నరప్‌గా నిలిచి అందరి మన్ననలను పొందింది. ఆ తర్వాత మిస్ టూరిజం వరల్డ్ వైడ్ రన్నరప్‌గా, మలేషియాలో జరిగిన మిస్ టూరిజం ఇంటర్నేషనల్‌లో మూడో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించి పాపులర్‌ అయింది. ఓ వైపు మూవీస్, మరోవైపు సీరియల్స్‌లో నటిస్తూ బిజీబిజీగా గడిపేది. ఉన్నట్టుండి ఏమైందో ఏమో కానీ.. కొన్ని దినాలకు అకాస్మాత్తుగా సన్యాసిగా మారి అందరికీ షాక్ ఇచ్చారు.

చాలామంది హీరోయిన్‌గా మంచి పాపులర్టీని సొంతం చేసుకోగానే ఏం చేస్తారు.. కోట్ల రూపాయలు సంపాదించి విలాసవంతమైన లైఫ్‌ని అనుభవిస్తుంటారు. అయితే ఇక్కడ కనిపిస్తున్న బర్ఖ మదన్ అనే హీరోయిన్ మాత్రం సన్యాసిగా మారడంతో చాలామంది షాక్‌కి గురయ్యారు. ఆమె 1996లో హిందీలో ఖిలాడీ కా ఖిలాడీ మూవీతో హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. 2012 వరకు పలు సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించి చాలామంది ప్రశంసలు అందుకుంది.


Read More: ఇటలీ బీచ్‌లో నటితో డార్లింగ్ ప్రభాస్ రొమాన్స్‌

సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ దర్శకత్వంలో భూత్ మూవీలోనూ నటించి పలువురి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ మూవీలో తనతో పాటు నటులు అజయ్ దేవగన్‌, ఊర్మిళ మటోండ్కర్, నానా పటేకర్, ఫర్దీన్‌ ఖాన్‌, రేఖ వంటి ప్రముఖ స్టార్లతో కలిసి వర్క్‌ చేసింది. జీ టీవీ షో సాఫ్ ఫెరే సలోని కా సఫర్లో కూడా యాక్ట్ చేసింది.

గోల్డెన్‌ గేట్, ఎల్‌ ఎల్సీ నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై రెండు సినిమాలు నిర్మించింది. 2012లో బౌద్దమతాన్ని స్వీకరించాలనే నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. తర్వాత కొన్ని కారణాల మూలంగా మూడు సంవత్సరాల విరామం తీసుకుంది.

Read More:అంబానీ పార్టీపై కంగనా ఫైర్‌, డబ్బుకోసం నేను ఇలా చేయనంటూ..

బౌద్దమతాన్ని తీసుకున్న తర్వాత తన పేరును గ్యాల్టెన్‌ సామ్టెన్‌గా మార్చుకుంది. పర్వతాలు. ఆశ్రమాల్లో సాధువుల మధ్య తిరుగుతోంది. ఇది తెలిసిన ఆమె అభిమానులు ఈమెకు ఏమైనా పిచ్చా.. అంత మంచి సినీ లైఫ్‌ని పెట్టుకొని.. కార్లలో, బంగ్లాలో ఉండాల్సిన వ్యక్తి ఇలా ఉండడం ఏంటని భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Tags

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×