BigTV English

Kolhapur Mahalakshmi Temple: వైకుంఠం వీడి కొల్హాపుర్​లో వెలసిన శ్రీ మహాలక్ష్మి.. ఒక్కసారి దర్శిస్తే పాపాలన్నీ పటాపంచల్​!

Kolhapur Mahalakshmi Temple: వైకుంఠం వీడి కొల్హాపుర్​లో వెలసిన శ్రీ మహాలక్ష్మి.. ఒక్కసారి దర్శిస్తే పాపాలన్నీ పటాపంచల్​!

Kolhapur Mahalakshmi Temple: నాడు వైకుంఠం వీడిన లక్ష్మీ దేవి నేరుగా ఎక్కడికి వచ్చి స్థిరపడింది? తిరుమలకూ ఈ ఆలయానికీ ఉన్న సంబంధ బాంధవ్యమేంటి? కరవీర పురమన్న పేరున్న ఆలయం ఏది? కాశీ చూసినంత పుణ్య ఫలం లభించాలంటే దర్శించాల్సిన క్షేత్రమేదీ? సమస్త దరిద్ర బాధలు తీరి అష్ట ఐశ్వర్యాలు సిద్ధించాలంటే ఏ క్షేత్ర దర్శనం చేయాలి? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం.. కొల్హాపుర్ లక్ష్మీ దేవి ఆలయం. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఎలా చేరాలి? ఆ వివరాలేంటి? ఇప్పుడు చూద్దాం.


లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం.. శ్రీరంగ థామేశ్వరీం..

ప్రైవేట్ బస్ ఛార్జెస్ రూ. 900 నుంచి రూ. 1200లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం.. శ్రీరంగ థామేశ్వరీం.. అంటూ శ్రీ మహాలక్ష్మీ దేవిని కొలుస్తుంటారు. అలాంటి లక్ష్మీ దేవి.. వైకుంఠపురం వదిలి నేరుగా వచ్చి కొలువైన క్షేత్రమే కొల్హాపురి క్షేత్రం.


1359వ సంవత్సరం వరకు శివాజీ పూర్వికుల పాలన

18 శక్తి పీఠాలలో అత్యంత ప్రధానమైన ఈ ఆలయంలోని అమ్మవారిని అంబాబాయి అని ప్రేమగా పిలుస్తారు భక్తులు. ఏడవ శతాబ్దిలో చాళుక్య వంశ రాజైన కరణ్‌ దేవ్ ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చెబుతుంది ఆలయ చరిత్ర. తర్వాత 8వ శతాబ్దిలో హేమండ్ పతి శైలిలో.. యాదవ వంశీయులు ఈ ఆలయాన్ని విస్తరించినట్టు తెలుస్తోంది. కొల్హాపూర్ క్షేత్రాన్ని 1359వ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వికులు పాలించగా, 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్థమానమైందని తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ప్రత్యేకత ఏంటంటే.. ఇక్కడి అమ్మవారు ఉత్తర, తూర్పు దిక్కులో కాకుండా.. పడమటి దిక్కును చూస్తుంటారు. అంతేనా జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలు.. నవంబర్ 9, 10, 11 తారీఖుల్లో .. సూర్య కిరణాలు అమ్మవారి పాదాలపై పడతాయి. దీంతో ఇక్కడ సూర్య కిరణోత్సవం జరుపుతారు.

నీట మునిగిన పురాన్ని తన కరములతో రక్షించిన మహా లక్ష్మీదేవి

ఇక్కడ సూర్య గ్రహణం రోజున స్నానం చేస్తే సమస్త పాపాలు నశిస్తాయని ప్రతీతి. ఎందుకంటే ప్రళయకాలంలో శివుడు తన త్రిశూలంతో కాశీ నగరాన్ని రక్షించగా.. నీటిలో మునిగిన ఈ పురాన్ని మహా లక్ష్మీ దేవి.. తన కరములతో పైకెత్తారట. అందువల్లే ఈ క్షేత్రానికి కరవీర పురమన్న పేరొచ్చిందట. ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకత ఏంటంటే.. శివుడు జలంగా, విష్ణువు శిలగా, మహర్షులు ఇసుకగా, ఇతర దేవతలు వృక్షాలుగా కొలువై ఉన్నారట. ఒక్క సూర్య గ్రహణం రోజున మూడున్నర కోట్ల తీర్ధాలు ఇక్కడ నిక్షిప్తమై ఉంటాయని అంటారు. అందుకే సూర్య గ్రహణం రోజున ఇక్కడి మహాలక్ష్మీ దేవిని దర్శించి.. స్నానం చేస్తే పంచ మహా పాతకాలు సైతం ప్రక్షాళన జరుగుతాయని చెబుతుంది దేవీ భాగవతం.

కొల్హాపురిలో మహా లక్ష్మి కొన్నేళ్ల పాటు కఠోర తపస్సు

మన ఇతిహాసాల ప్రకారం.. భృగువు మహా విష్ణువును ఘోరంగా అవమానించిన కారణంగా.. అలిగిన మహాలక్ష్మిదేవి వైకుంఠాన్ని విడిచి పెట్టి నేరుగా వచ్చి కొలువైన ప్రాంతం కొల్హాపురిగా చెబుతారు. భువికి వచ్చి శ్రీ వేంకటేశ్వరుడిగా కొలువైన మహా విష్ణువు పద్మావతీ అమ్మవారిని పెళ్లాడిన వార్త తెలిసిన మహా లక్ష్మీ.. కొల్హాపురిలో కొన్నేళ్ల పాటు ఘోర తపస్సు చేసినట్టుగా చెబుతాయి మన పురాణాలు.

5 వేల ఏళ్ల నాటి పురాతన విగ్రహం

కొల్హాపురి అంబాబాయి విగ్రహం సుమారు ఐదు వేల ఏళ్లనాటి పురాతనమైనదని అంటారు. కిరీటంపై నాగ పడగ గల ఈ అమ్మవారి విగ్రహ దర్శనం చేసిన వారికి సమస్త దరిద్రాలు తీరిపోతాయని అంటారు. ఎందుకంటే ఇక్కడికి తానొచ్చి కొలువుదీరినపుడు.. స్థానికులు తనను ఎంతో గొప్పగా ఆదరించారనీ.. అందమైన శిలలతో శిల్పాలు చెక్కి తన ఆలయాన్ని సుందరంగా తీర్చి దిద్దారనీ.. అందుకే కొల్హాపురి ప్రజలకు అష్ట ఐశ్వర్య సిద్ధి ప్రసాదించారని చెబుతుంది స్థల పురాణం.

లోయలో వెలసిన పురమే కొల్హాపురి

కొల్లా అంటే లోయ. లోయలో వెలసిన పురమే కొల్హాపురి అంటారు. కోల్ గిరి, కొలదిగిగిరి పట్టణ్ అని కూడా పిలిచే ఈ పట్టణంలో కొలువైన మహా లక్ష్మీదేవి ఆలయం.. మరో ప్రత్యేకత ఏంటంటే.. అగస్త్య మహాముని శివుడి కోసం తపస్సు చేసి.. కాశీ క్షేత్రంతో సమానమైన పుణ్య ఫలం లభించే క్షేత్రం ఏదైనా ఉంటే చెప్పమని కోరాడట. దీంతో ఆ పరమేశ్వరుడు తనతో సమానమైన అధిదేవత శ్రీ మహాలక్ష్మీ దేవి, ఆమె కొలువైన క్షేత్రం కొల్హాపురి. కాబట్టి ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే.. కాశీ క్షేత్ర సందర్శన ఫలం లభిస్తుందని చెప్పారట. దీంతో ఆయన ఇక్కడి మహాలక్ష్మీదేవిని, అతిబలేశ్వరుడ్ని సందర్శించి పునీతమైనట్టు చెబుతుంది స్థల చరిత్ర.

ఆలయంలో నవగ్రహ, సూర్య, మహిళాసుర మర్ధిని, విఠల్ రఖ్ మయీ

కొల్హాపుర్ ఆలయ పరిసరాల్లో నవగ్రహాలు, సూర్య, మహిషాసుర మర్ధిని, విఠల్ రఖ్ మయీ, శివ, వైష్ణవ, తుల్జా భవాని వంటి ఇతర విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటిలో కొన్ని 11వ శతాబ్ది కన్నా ముందు కాలానివి కాగా.. మరి కొన్ని కొత్తగా ప్రతిష్టించినట్టు భావిస్తారు. ఆలయం దగ్గర మణికర్ణికా కుండం అనే కొలను ఉంది. ఈ కొలను ఒడ్డున విశ్వేశ్వర మహదేవ్ విగ్రహం ఉంది. భక్తులు వీటన్నిటిని దర్శించి ఆయా దేవీ దేవతల కృపాకటాక్షాలు కూడా పొందవచ్చని అంటారు పండితులు.

అమ్మవారికి రోజూ ఐదు సార్లు అర్చన

అమ్మవారికి రోజూ ఐదు సార్లు అర్చన జరుగుతుంది. ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో మొదలు. కాకడ హారతి ఇస్తారు. ఉదయం 8 గంటలకు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. మధ్యాహ్నం, సాయంత్రాలలో పూజ, శేజ్ హారతి జరుపుతారు. అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవరాత్రలపుడు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు విశేష ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున అమ్మవారి ఉత్సవమూర్తిని నగరానికి తూర్పుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అమ్మవారి ఆలయం దగ్గరికి ఊరేగింపుగా తీసుకొని వెళ్తారు. ఇదిగాక చైత్ర పూర్ణిమ రోజున జరిగే ఉత్సవంలో అమ్మవారిని నగరమంతా ఊరేగిస్తారు. ప్రతి శుక్రవారం సాయంకాలం, పౌర్ణమి నాడు కూడా.. అమ్మవారిని ఊరేగిస్తారు.

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా- కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా అంటూ శక్తిపీఠాల్లో ఒకటిగా ఈ ఆలయాన్ని ప్రస్తుతిస్తారు. అష్టాదశ శక్తిపీఠాల్లో ఏడవ శక్తి పీఠమైన కొల్హాపురి, జమ్మూలోని శారదా పీఠం ఎంతో ప్రత్యేకమైనవి. మిగిలిన పీఠాలన్నీ దాదాపు పార్వతీ మాతకు సంబంధించిన ఆలయాలు కాగా.. త్రిశక్తులలోని లక్ష్మీ, సరస్వతులకు చెందిన పీఠాలు ఈ రెండే. కాబట్టి ఇక్కడి అమ్మవారి సందర్శనం ఇటు అష్ట ఐశ్వర్య కరంతో పాటు.. అనితర సాధ్యమైన శక్తి సామర్ధ్యాలను సైతం ఈ అమ్మవారు ప్రసాదిస్తారని విశ్వసిస్తారు.

అమ్మవారి దర్శన మాత్రం చేత శక్తి సామర్ధ్య వృద్ధి

కారణం శివుడితో సమానంగా.. ఒక పురాన్ని తన ఒంటిచేత్తో ఎత్తి కాపాడిన దేవత కాబట్టి.. ఈ అమ్మవారి సందర్శనం చేత.. శక్తి సామర్ధ్యాలు సైతం విశేషంగా వృద్ధి చెందుతాయని ప్రతీతి. అంతే కాదు.. తాను తన పతిని వీడి ఇక్కడికి వచ్చినపుడు ఆమె అలకలో ఉన్నారు. అలాంటి దేవతామూర్తిని ఎవరైతే సందర్శిస్తారో.. అలాంటి వారిని అది పనిగా గుర్తించి మరీ ఆ మహాలక్ష్మీ దేవి.. ఐశ్వర్య సిద్ధి ప్రసాదిస్తారని అంటారు కొందరు భక్తులు.

1790 అడుగుల ఎత్తులో గల కొల్హాపురి

కొల్హాపూర్ మహారాష్ట్ర నైరుతి భాగంలో.. కృష్ణానది ఉప నది అయిన పంచగంగా నది ఒడ్డున సముద్ర మట్టానికి 1790 అడుగుల ఎత్తులో కొలువుదీరి ఉంది. ముంబై నుంచి 373 కిలోమీటర్లు, పూణే నుంచి 230 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ క్షేత్రం. గోవా నుంచి కొల్హాపురానికి సులభంగా చేరుకోవచ్చు. గోవా నుంచి సుమారు 220 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ పురాతన పట్టణం.

కొల్హాపురికి 9 కి.మీ. దూరంలో ఉజ్జైవాడి ఎయిర్ పోర్టు

కొల్హాపురికి 9 కిలోమీటర్ల దూరంలో ఉజ్జైవాడిలో ఎయిర్ పోర్టు ఉంది. ముంబై, తిరుపతి, హైదరాబాద్, బెల్గాం, బెంగళూరు నుంచి విమానాలు నడుస్తాయి. ఇక విదేశాల నుంచి వచ్చే భక్తులు నేరుగా గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగి.. అక్కడి నుంచి క్యాబ్ ద్వారా కొల్హాపూర్ చేరుకోవచ్చు. ఇక కొల్హాపూర్ లో చత్రపతి సాహూ మహరాజ్ టెర్మినల్ కి సహ్యాద్రి ఎక్స్ ప్రెస్, కొయ్నా ఎక్స్ ప్రెస్, ఫాస్ట్ మహాలక్ష్మీ ఎక్స్ ప్రెస్.. ఇలా ముంబై, హైదరాబాద్, బెంగళూరు, షోలాపూర్, తిరుపతి వంటి నగరాల నుంచి పెద్ద ఎత్తున రైలు సౌకర్యముంది.

ముంబై, హైదరాబాద్, బెంగళూరు, షోలాపూర్, తిరుపతి ట్రైన్లు

మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. ముంబై, పూణే, గోవా, బెల్గాం, బెంగళూరు వంటి పట్టణాల నుంచి బస్సులను నడుపుతోంది. కొందరు ముంబై లేదా పుణే నుంచి కొల్హాపూర్ కారులో ప్రయాణించడాన్ని ఆస్వాదిస్తారు.

ట్రైన్ టికెట్ ధర రూ. 350 నుంచి రూ. 1350

హైదరాబాద్ నుంచి రూ. 4 వేల రూపాయలు ఫ్లైట్ చార్జెస్ ఉంటాయి. ఇక రైలు టికెట్టు ధరలు 350 నుంచి 1350 వరకూ ఉంటాయి. ప్రైవేటు బస్సు ఛార్జీలు 900 రూపాయల నుంచి 1200 వరకూ ఉంటాయి.

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×