Maha Shivratri 2024: మహాదేవుని దయతో ఒక వ్యక్తి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. శివుడిని సంతోష పెట్టడానికి మహాశివరాత్రి రోజు అత్యంత ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. మహాశివరాత్రి ఫాల్గుణ మాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం మహాశివరాత్రి ఉపవాసం 2024 మార్చి 8 శుక్రవారం నాడు పాటిస్తారు. ఈ రోజున పరమశివునికి పూజలు చేసి జలాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహిస్తారు.
మత విశ్వాసాల ప్రకారం శివుడు, పార్వతి ఈ రోజు వివాహం చేసుకున్నారు. అందుకే మహాశివరాత్రిని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ప్రజలు దేవాలయాలు, ఇళ్లలో శివుని పూజిస్తారు. అయితే శివలింగాన్ని ఇంట్లో ఉంచాలా వద్దా అనే విషయంలో చాలా సందేహాలున్నాయి. అసలు ఎన్ని రకాల శివలింగాలు ఉన్నాయి? ఇంట్లో ఏ శివలింగాన్ని ఉంచడం శుభప్రదంగా పరిగణిస్తారో తెలుసుకుందాం?
శివలింగం ఎన్ని రకాలు?
శివలింగం రకాలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. శివలింగంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి వెండి శివలింగం. మరొకటి పాదరసం శివలింగం. కొంతమంది శివలింగాలు 5 రకాలని నమ్ముతారు. మరికొంత మంది శివలింగాలు 6 రకాలుగా ఉన్నాయంటారు . 5 రకాల శివలింగాల గురించి తెలుసుకుందాం.
Read More: శివరాత్రి ఎలా ప్రత్యేకమైందంటే..
శైలజా శివలింగం : ఇది రాతితో చేసిన శివలింగం
రత్నజ శివలింగం: రత్నంతో చేసిన శివలింగాన్ని రత్న శివలింగం అంటారు.
ధాతుజా శివలింగం: లోహంతో చేసిన శివలింగాన్ని ధాతుజ శివలింగం అంటారు.
మృత్తిక శివలింగం: మట్టితో చేసిన శివలింగాన్ని మృత్తిక శివలింగం అంటారు.
దరుజా శివలింగం: చెక్కతో చేసిన శివలింగాన్ని దరుజా శివలింగం అంటారు.
ఇంట్లో ఏ శివలింగాన్ని ఉంచాలి?
వెండి, పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంట్లో ఎల్లప్పుడూ ఉంచాలి. దీన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇంట్లో శివలింగాన్ని ప్రతిష్టించినట్లయితే దానిని తూర్పు ముఖంగా ప్రతిష్టించాలి. పూజ చేసేటప్పుడు శివలింగం బలిపీఠం ఎల్లప్పుడూ ఉత్తరం వైపు ఉండాలి.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం సామాజిక, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. bigtvlive.com దీనిని ధృవీకరించలేదు. దీని కోసం నిపుణుల సలహా తీసుకోండి.