CM Revanth Reddy Latest News: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధపెట్టారు. హైదరాబాద్-రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముకుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అల్వాల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.
భాగ్యనగరానికి ప్రపంచస్థాయి గుర్తింపును కాంగ్రెస్ పార్టీనే తెచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలనలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. అందువల్ల హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. బీఆర్ఎస్ పాలనపైనా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. కేసీఆర్ హయాంలో నగరంలో ఎక్కడా అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కానీ రాష్ట్ర రాజధానిలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు. పబ్బులు పుట్టుకొచ్చాయని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను తీర్చలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము మాత్రం హైదరాబాద్ అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్ పెట్టామని తెలిపారు. మెట్రో రైలు విస్తరణ చేపడుతున్నామన్నారు. రెండో దశలో 75 కిలోమీటర్లు మెట్రో విస్తరణ చేస్తామని చెప్పారు.
Read More: మల్లారెడ్డి అల్లుడు కబ్జాల దందా.. అక్రమ కట్టడాలు కూల్చివేత..
కేంద్రంతో ఘర్షణ వైఖరితో ఉండబోమని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలనే దృష్టి పెట్టుకుంటామని తెలిపారు. తాను ఎంపీగా ఉన్న సమయంలో రాజీవ్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని వెల్లడించారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్రంతో వివాదం కారణంగానే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదన్నారు.
హైదరాబాద్ అభివృద్ధిపై బీఆర్ఎస్ కు నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టాలని కోరారు. అందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకారం అందిస్తుందని సెటైర్లు వేశారు.