Delhi-Kashmir Train Service: యావత్ కాశ్మీర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న న్యూఢిల్లీ- శ్రీనగర్ వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే అందుబాటులోకి రానున్నట్లు అందరూ ఊహించారు. ఇప్పటి వరకు శ్రీనగర్ వెళ్లేందుకు నేరుగా రైలు సౌకర్యం లేకపోవడం ఆ రాష్ట్ర ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ పనులను కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన కొనసాగించింది. రీసెంట్ గా ఈ రైల్వే లైన్ నిర్మాణం పూర్తయ్యింది. ఇప్పటికే ట్రాక్ టెస్ట్ కూడా కంప్లీట్ అయ్యింది. త్వరలోనే ఈ రూట్లో రైల్వే సేవలు ప్రారంభం కానున్నట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రకటనతో జమ్మూకాశ్మీర్ ప్రజలు ఫుల్ ఖుషీ అయ్యారు.
న్యూఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్ కు రైల్వే సర్వీస్ ఉండదా?
ఇన్ని రోజులు న్యూఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్ కు రైలు సర్వీస్ ఉంటుందని అందరూ భావించారు. కానీ, తాజాగా రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. న్యూఢిల్లీలో బయల్దేరే రైలు కత్రా లేదంటే జమ్మూ వరకే వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అక్కడి నుంచి రైలు మారి శ్రీనగర్ కు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తున్నది. “ఇంతకాలం ఢిల్లీ నుంచి నేరుగా శ్రీనగర్ కు నేరుగా రైల్వే సౌకర్యం ఉంటుందని అందరూ భావించారు. కానీ, ఢిల్లీలో బయల్దేరే రైలు కత్రా లేదంటే జమ్మూ వరకే వస్తుంది. ఎక్కడ వరకు అనేది త్వరలో నిర్ణయించబడుతుంది. ప్రయాణీకులు అక్కడ దిగి శ్రీనగర్ వరకు వెళ్లేందుకు మరో రైలు మారాల్సి ఉంటుంది” అని రైల్వే అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ నుంచి బయల్దేరే ప్రయాణీకులు సైతం దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలనుకునే వాళ్లు ఇదే జమ్మూ లేదంటే కత్రాలో దిగి మరో రైలు మారాల్సి ఉంటుందని తెలిపారు.
భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం
భద్రతా కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. ఢిల్లీలో రైలు ఎక్కే వారిని రైల్వే స్టేషన్ లో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. వీరంతా జమ్మూ లేదంటే కత్రాలో దిగాల్సి ఉంటుంది. అక్కడ మరోసారి పూర్తి స్థాయి ప్రయాణీకులను చెక్ చేస్తారు. వారి లగేజీని బోర్డింగ్ సమయంలో స్క్రీనింగ్ చేస్తారు. ఆ తర్వాత మరో రైల్లోకి ఎక్కాల్సి ఉంటుంది. భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని రైల్వే అధికారులు చెప్తున్నారు. “ప్రయాణీకులను, వారి లగేజీని తనిఖీ చేయడం ప్రతి స్టేషన్‌లో సాధ్యం కాదు. ఈ కారణంగా, ప్రయాణీకులు జమ్మూ లేదంటే కత్రా రైల్వే స్టేషన్‌లో దిగాల్సి ఉంటుంది. అక్కడ పూర్తి స్థాయిలో చెకింగ్ తర్వాత మరో రైల్లోకి ఎక్కాల్సి ఉంటుంది” అన్నారు.
పగటిపూత మాత్రమే రైళ్ల రాకపోకలు
ఇక కాశ్మీర్ మార్గంలో పగటిపూట మాత్రమే రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భద్రతా సంస్థలు సాయంత్రం తర్వాత హైవేలు, లోయలోని ఇతర ప్రదేశాలలో భద్రతా మోహరింపును ఉపసంహరించుకున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
Read Also: దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్లు ఇవే, రోజూ ఎన్ని లక్షల మంది ప్రయాణిస్తారో తెలుసా?