Los Angeles wildfire Expensive Mansion| అమెరికాలోని కాలిఫోర్నియా అడవిలో గత కొన్ని రోజులుగా రుగులుతున్న కార్చిచ్చు ఆర్పడంలో అక్కడి అగ్ని మాపక సిబ్బంది తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతోంది. అయినా ఎగిసే పడే భారీ అగ్ని జ్వాలలపై పూర్తిస్థాయిలో నియంత్రణ సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా క్యాలిఫోర్నియాలోని ప్రముఖ నగరం లాస్ ఏంజిలిస్ లో ఖరీదైన భవానాలన్నీ కాలి బూడిదైపోయాయి. నగరానికి వ్యాపించిన కార్చిచ్చు వల్ల ఇప్పటికే లక్షల కోట్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ నష్టం ఇంకా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
డైలీ మెయిల్ మీడియా కథనం ప్రకారం.. లుమినార్ టెక్నాలజీస్ సంస్థ సిఈఓ అయిన ఆస్టిన్ రస్సెల్ కు చెందిన ఈ ఇంద్ర భవనం విలువ 125 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.10,770 కోట్లు). ఇందులో 18 విశాలమైన బెడ్రూమ్స్ ఉండేవి. ఈ భవనంలో ఇంకా నోబు డిజైన కిచెన్, 20 మంది కెపాసిటీ థియేటర్, ఒక విలాసవంతమైన వైన్ సెల్లార్, ఒక ఫోల్లింగ్ స్టార్ గేజింగ్ రూఫ్, రెండు ప్యానిక్ రూమ్స్, గ్యాలరీ, బాల్ రూమ్, స్పా, స్విమ్మింగ్ పూల్ ఇలా ఎంతో ఎంతో అందంగా విలాసవంతంగా ఈ భవనాన్ని నిర్మించారు.
Also Read: నిద్రపోతూ వేయి జాబ్స్ అప్లై చేసిన యువకుడు.. ఫలితంగా ఏం జరిగిందంటే..
ఈ భవాన్ని ఆయన షూటింగ్ల కోసం అద్దెకు ఇచ్చేవారు. దీని అద్దె ఒక నెలకు రూ.3 కోట్ల 74 లక్షలు. ఒక హెబిఓ సిరీస్ లో ఈ ఇంటిని వినియోగించారు కూడా. అయితే ఇప్పడు లాస్ ఏంజిల్స్ కు వ్యాపించిన కార్చిచ్చు వల్ల ఈ భవనం పూర్తి నాశనమైంది. ప్రమాద సమయంలో భద్రత కోసం ఇంట్లో ఉన్న రెండు ప్యానిక్ రూమ్స్ కూడా పూర్తిగా కాలిపోయాయి.
మరోవైపు ఇంతటి భారీ నష్టానికి కారణాలను పర్యవేక్షిస్తున్నప్పుడు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రభుత్వంపైనే నిందలు వేస్తున్నారు. తమ విభాగానికి భారీ బడ్జెట్ తగ్గించడం వల్లే ప్రమాద సమయంలో తమ వద్ద నిప్పును ఆర్పేందుకు నష్ట నివారణకు సరైన వనరులు లేవని అన్నారు. దీనిపై నగర మేయర్ కారెన్ బాస్ స్పందించారు. మునుపటి బడ్జెట్ కంటే ఈ సారి ఫైర్ విభాగానికి 17 మిలియన్ డాలర్లు తగ్గించిన విషయం నిజమేనని.. నిధుల కొరత వల్ల అలా చేయాల్సి వచ్చిందన్నారు.
అయితే నిప్పులు ఆర్పేందుకు సరిపడ నీరు, హైడ్రంట్స్ లేకపోవడంతో క్యాలిఫోర్నియా గవర్నర్ లాస్ ఏంజిలెస్ వాటర్ డిపార్ట్ మెంట్ మరిన్ని హైడ్రెంట్స్ తరలించాలని లేఖ రాశారు. లాస్ ఏంజిలెస్ రిజర్వాయర్ లో నుంచి తగినన్ని నీళ్లు రావడం లేదని త్వరగా విడుదల చేయకపోతే నష్టం భారీగా ఉండే ప్రమాదముందని ఆయన హెచ్చరించారు. కానీ నిజానికి నీటి కొరతకు లాస్ ఏంజిలెస్ లో నివసించే సెలెబ్రిటీలే కారణం.
నీటిని దుర్వినియోగం చేసిన హాలీవుడ్ స్టార్‌లు
హాలీవుడ్ స్టార్‌లు లాస్‌ఏంజెలెస్‌లో నీటిని ఇష్టారాజ్యంగా ఉపయోగించడంతో, ఇప్పుడు వేల ఇళ్లను అగ్నిప్రమాదం నుంచి కాపాడేందుకు నీటి కొరత తలెత్తింది. ఈ స్టార్‌లు తమకు కేటాయించిన నీటి కంటే చాలా ఎక్కువ నీరు వాడి తమ గార్డెన్లను పెంచుకుంటున్నట్లు డెయిలీ మెయిల్ కథనంలో పేర్కొంది. 2022 నుండి లాస్‌ఏంజెలెస్‌లో నీటి వినియోగంపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. ఇప్పుడు, వారు తమ తోటలకు నీరు ఇవ్వాలంటే, వారానికి రెండు సార్లు, ఒక్కోసారి 8 నిమిషాలు మాత్రమే నీరు వాడుకోవాల్సి ఉంటుంది.
నటి కిమ్ కర్దాషియన్ తన 60 మిలియన్ డాలర్ల విలువైన ఇంటి చుట్టూ గార్డెన్‌ను పెంచేందుకు తనకు కేటాయించిన నీటిని మించి 2,32,000 గ్యాలెన్లను అదనంగా వాడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే కండల వీరుడు సిల్వస్టెర్ స్టాలోన్, ప్రముఖ నటుడు కెవిన్ హార్ట్ వంటి వారు కూడా అదనంగా నీరు వాడి జరిమానాలు చెల్లించారు. కార్చిచ్చు మొదలైన ప్రదేశానికి దగ్గరగా కిమ్ కర్దాషియన్ ఇల్లు ఉంది. ఆమె ప్రస్తుతం ఆ ఇంటిని ఖాళీ చేసి మరో ప్రాంతానికి వెళ్లిపోయింది.
కొంతమంది హాలీవుడ్ స్టార్లు గంటకు 2,000 డాలర్ల చెల్లించి ప్రైవేట్ ఫైర్‌ఫైటర్లను నియమించుకున్నారు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ నగరంలో సుమారు 57 వేల ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని అంచనాలు వ్యక్తమయ్యాయి.
పసిఫిక్ పాలిసేడ్స్‌లో అన్ని హైడ్రెంట్లు పనిచేస్తున్నాయని వాటర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. అయితే, 20 శాతం హైడ్రెంట్లలో నీటి ప్రెజర్ తక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. కొన్ని ప్రదేశాలలో, నీటిని ట్యాంకర్ల ద్వారా తరలిస్తున్నట్లు చెప్పారు.
Pacific Palisades' most expensive home that starred in Succession ravaged by wildfires
The $125m, 18-bedroom mega-mansion is reduced to rubble and ash as fires continue to rip through celebrity hotspots pic.twitter.com/w4uuYZR8Xm
— RT (@RT_com) January 11, 2025