BigTV English

OTT Movie : ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోకి దూరితే దూల తీరాల్సిందే… క్రేజీ రివేంజ్ థ్రిల్లర్

OTT Movie : ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలోకి దూరితే దూల తీరాల్సిందే… క్రేజీ రివేంజ్ థ్రిల్లర్

OTT Movie : కొన్ని సినిమాలు చూడడానికి రియలిస్టిక్ గా ఉండడంతో పాటు, మంచి సినిమాకి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇలాంటి జానర్లో రివెంజ్ సినిమాలు వస్తే ఆ కిక్కే వేరప్పా అనిపిస్తుంది ఒక్కోసారి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే మూవీ కూడా అలాంటిదే. ఇద్దరు ఫ్రెండ్స్ జీవితాల చుట్టూ తిరిగే ఒక స్టోరీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది? ఈ మూవీ పేరేమిటి? కథ ఏంటి? అనే విషయాలపై ఒక లుక్కేద్దాం పదండి.


ఆహా (aha) లో స్ట్రీమింగ్

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన మూడు నెలల తర్వాత ఓటిటిలో అడుగు పెట్టింది. ఓటిటి ఇంటర్ లేట్ అయినప్పటికీ ఈ మూవీ ఖచ్చితంగా మూవీ లవర్స్ ని నిరాశపరచదు. ఈ సినిమాలో వంశీరాం పెండ్యాల, స్వాతి భీమిరెడ్డి, అజయ్, ఏపూరి హరి ప్రధాన పాత్రలో నటించారు. సంహిత్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్, పారుపల్లి ప్రొడక్షన్స్ పై నిర్మాత మురళి గింజుపల్లి, నవీన్ పారుమల్లి నిర్మించారు. ఈ సినిమాకు హరినాథ్ పులి దర్శకత్వం వహించారు. 2024 ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ దొరికింది. ఇక ఇప్పుడు మూడు నెలల తర్వాత ఓటిటిలో అడుగుపెట్టింది ఈ సినిమా. ఈ మూవీ పేరు ” రేవు” (Revu). ప్రస్తుతం ఈ సినిమా ఆహా (aha) ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.


కథలోకి వెళ్తే…

కోస్తా ప్రాంతంలో పాలరేవు అనే ఒక గ్రామం ఉంటుంది. అందులో గంగయ్య, అంకులు అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఈ బాల్య స్నేహితులు కలిసి పెరగడమే కాదు, పెళ్లిళ్లు చేసుకున్నాక కూడా పక్కపక్క ఇళ్లలోనే ఉంటూ తమ స్నేహాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. ఇక వృత్తిరీత్యా వీళ్ళిద్దరూ చేపలు పడతారు. కానీ ఈ పోటీలో భాగంగా వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతాయి. అయినప్పటికీ ఆ గొడవలు పక్కనపెట్టి, నాటు పడవలతో రోజంతా వేట సాగిస్తూ సంతోషంగా గడుపుతారు. ఈ నేపథ్యంలోనే నాగేషు అనే ఓ డబ్బున్న వ్యక్తి ఒక పెద్ద బోటును కొని చేపలు పట్టడం మొదలు పెడతాడు. దీంతో అప్పటినుంచి  ఈ ఫ్రెండ్స్ ఇద్దరికీ సమస్యలు మొదలవుతాయి. పైగా అతనితో శత్రుత్వం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే నాగేష్ తమ్ముడు కొడుకు అంకులు, గంగయ్య కు హెల్ప్ చేస్తాడు. ఇది నచ్చని నాగేషు అతన్ని చంపేస్తాడు. దీంతో అంకులు, గంగయ్య ఇద్దరు కలిసి నాగేష్ ను లేపేస్తారు. దీంతో నాగేష్ కు పుట్టిన సైకో కొడుకులు ఇద్దరు పగ తీర్చుకోవడానికి రంగంలోకి దిగుతారు. మరి వారిద్దరూ ఈ ఫ్రెండ్స్ ని ఏం చేశారు? వాళ్ల నుంచి అంకులు, గంగయ్య ఎలా తప్పించుకోగలిగారు? చివరికి అంకులు, గంగయ్య చేపలు పడుతూ ఆనందంగా ఉంటారా? అనే విషయాలు తెలియాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా (aha) లో స్ట్రీమింగ్ అవుతున్న ” రేవు” (Revu) అనే ఈ సినిమాను తప్పకుండా చూడండి.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×