E-Paper
Advertisement

Marigold flowers : పూజకు పనికి రాని బంతి పువ్వు ఎందుకంటే….

Marigold flowers : పూజకు పనికి రాని బంతి పువ్వు ఎందుకంటే….

Marigold flowers : పువ్వుల్లో కాస్త భిన్నంగా కనిపించే పువ్వు బంతి . మల్లెపువ్వు, మందార పుష్పం, విరజాజులు, చామంతి ఇలాంటివన్నీ పూజలో వినియోగిస్తుంటాం. మరి బంతి పువ్వు ఏ పాపం చేసింది….? ముద్ద బంతి పువ్వులను ప్రధాన ద్వార ముందు, అందంగా అలకరించడానికే వినియోగిస్తుంటాం. విగ్రహారాధనకు వాడటం లేదు. బంతి పువ్వు భారీగా ఉంటుంది. ఇంట్లో ఉంటే విగ్రహం బొటన వేలుకు మించకూడదు. అలాంటి విగ్రహం మీద బంతి పువ్వు పెడితే విగ్రహం పడిపోతుంది. అలాగే పడిపోతే మనలో సందేహాలు మొదలవుతాయి. విగ్రహం ఎందుకు పడిపోయిందన్న అనుమానాలు వస్తాయి. భగవంతుడ్ని భయ పెట్టే విధంగా పూజలు చేయకూడదు కనుక వేదికను, గుమ్మాలను అలంకరించడానికి మాత్రమే బంతి పూలను వాడుకోవాలనేది ప్రమాణం. ఏయే పూలతో ఏయే దేవుడ్ని ఆరాధించాలనే విషయాలు గ్రంధాల్లో చెప్పారు. పూర్వ అగ్నిహోత్రుడ్ని అర్చించే క్రమంలో అశ్వనీదేవతలు అనేక పుష్పాలతో పూజిస్తూ ఉండగా…. బంతిపువ్వులు కూడా ఉంచారు. బంతి పువ్వులను వినియోగించడం వల్ల అగ్నిహోత్రుడు కాసేపు శాంతించాల్సి వచ్చింది. దాంతో అగ్రహించిన అగ్నిహోత్రుడు కోపంతో బంతి పూలను పూజలకు పునస్కారాలకు వాడకూడదని శపించాడట. అందుకే దేవతరాధనలో ఎక్కడా బంతి పూల వినియోగం ఉండదు.

Tags

Related News

రథాన్ని విరగ్గొట్టిన లక్ష్మీదేవి! పూరీ జగన్నాథ క్షేత్రంలో.. నేటికీ జరిగే అద్భుతమైన ఆచారం

చార్ ధామ్ యాత్ర.. ఎటు చూసినా భక్తులు, 8 కిలోమీటర్లు ట్రాఫిక్ జామ్

ఆ దేవుడికి చేతులు కాళ్ళు ఎందుకు ఉండవు ?..అసలు రహస్యం ఇదే

Black Thread: ఈ రాశుల వారు కాలికి నల్ల దారం కట్టుకుంటే శని చెడు ప్రభావం తగ్గుతుంది

Anger: కోపాన్ని తగ్గించే రత్నం.. సోమవారంనాడు ధరిస్తే మీ జీవితమే మారిపోతుంది

ప్రసాదంగా లడ్డూ కాదు.. సాక్షాత్తూ ‘డబ్బులే’ ఇస్తారు! ఈ వింత ఆలయం గురించి మీకు తెలుసా?

రావి చెట్టు ఇంట్లో ఉండకూడదని ఎందుకు అంటారు? అసలు నిజం తెలిస్తే షాక్ అవుతారు

Vastu tips: ఇలాంటి సీలింగ్ ఫ్యాన్ ఇంట్లోకి పేదరికాన్ని తెస్తుంది.. ఈ 5 తప్పులు చేయకండి

Big Stories

×