Big Stories

Phone Tapping Case Update: కిడ్నాప్ చేసి కంపెనీ కొట్టేసిన పుష్ప నిర్మాత..!

Producer Naveen Yerneni in Phone Tapping Case: తెలంగాణను గజగజలాడిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో నిజం బయటపడుతుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వలన సినిమా వాళ్ల బండారం కూడా బయటపడుతుంది. ఇక ఇప్పటికే సమంత – నాగ చైతన్య విడాకులకు కారణం ఏంటి అనేది ఫోన్ ట్యాపింగ్ ద్వారా బయటపడింది. ఇప్పుడ మైత్రీ మూవీ మేకర్స్ అధినేత మరో కోణం బయటపడింది. నవీన్ యెర్నేని.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు.

- Advertisement -

టాలీవుడ్ లో టాప్ ప్రొడక్షన్ హౌస్ అధినేతలో ఒకరిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. గతేడాది నుంచి ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. ఇక పుష్ప 2 కూడా ఈ బ్యానర్ నుంచే రాబోతుంది. ఇప్పటికే చాలా వివాదాల్లో నవీన్ పేరు బయటపడింది. ఇక ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు లో ఆయన పేరు కూడా ఉందని పోలీసులు తేల్చిచెప్పారు. క్రియా హెల్త్ కేర్ యాజమాన్యం మార్పిడి వివాదం కేసులో ఉన్న నలుగురు డైరెక్టర్లలో నవీన్ ఒకడు అని పోలీసులు బయటపెట్టారు.

- Advertisement -

అసలు దీని కథ ఏంటి అంటే.. పాత సినిమాలు చూస్తే కనుక.. సొంత కష్టంతో ఒక వ్యక్తి ఒక కంపెనీని పైకి తీసుకొస్తాడు. దాన్ని ఎలాంటి కష్టం లేకుండా కేవలం అతనిని కిడ్నాప్ చేసి బెదిరించి, భయపెట్టి.. ఆ కంపెనీని వారిపేరు మీద రాయించుకుంటారు విలన్స్. ఇక్కడ కూడా సేమ్ జరిగింది. క్రియా కంపెనీ అధినేత చెన్నుపాటి వేణుమాధవ్.. కొన్నిరోజుల క్రితం పోలీసులకు తనను కిడ్నాప్ చేసి తన కంపెనీ లాక్కోవాలని చూశారని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

Also Read: Summer Effect on RTC: గ్రేటర్ ఆర్టీసీపై సమ్మర్ ఎఫెక్ట్.. సర్వీసులు కుదింపు

ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న అతను.. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడడంతో తాను కూడా బాధితుడినేనని.. ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులుగా ఉన్నారు తనను కూడా మోసం చేసారని చెప్పుకొచ్చాడు. అందులో నవీన్ కూడా ఉన్నాడని చెప్పాడు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో నవీన్ ను కూడా నిందితుడని తెలిపారు. నలుగురు డైరెక్టర్లుగా ఉన్న నవీన్ యెర్నేని, గోపాల్ కృష్ణ, వీరమాచినేని పూర్ణచంద్ర రావు, రవి కుమార్ మందలపు లకు నోటీసులు పంపి విచారణకు హాజరుకావాల్సిందిగా పోలీసులు తెలిపినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదం నుంచి నవీన్ ఎలా బయటపడతాడు అనేది చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News