Mercury Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, నిర్దిష్ట సమయం తర్వాత గ్రహాల స్థానం మారుతూ ఉంటుంది. ఇది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. నవంబరు నెలాఖరులోగా అలాంటి మార్పులు అనేకం జరగనున్నాయి.నవంబర్ 30 బుధుడు వృశ్చికరాశిలో అస్తమించబోతున్నాడు. దీని ప్రభావం డిసెంబర్ 2 నుంచి అధికంగా రాశులపై ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రాశులలో గ్రహాల స్థానం నిర్దిష్ట సమయం తర్వాత మారుతూ ఉంటుంది. దీంతో శుభ, అశుభ యోగాలు ఏర్పడతాయి. కొన్ని గ్రహాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉంటాయి. అంతే కాకుండా మరి కొన్ని గ్రహాలు ఒకదానికొకటి అనుకూలంగా ఉండవు. అలాంటి పరిస్థితి రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని గ్రహాలు సూర్యుడికి చాలా దగ్గరగా వచ్చినప్పుడు అస్తమిస్తాయి. అంటే ఆ గ్రహాల ప్రభావం కొంత కాలానికి తగ్గుతుంది.
నవంబర్ 30న కూడా అలాంటిదే జరుగబోతుంది. మెర్క్యురీ సూర్యుడికి చాలా దగ్గరగా ఉండటం వల్ల అస్తమిస్తుంది. నవంబర్ 30 న, సూర్యుని ప్రభావంతో బుధుడు యొక్క ప్రకాశం తగ్గుతుంది. అందువల్ల 12 రాశులపై శుభ , అశుభ ప్రభావాలు ఉంటాయి. కానీ బధుడి వల్ల ముఖ్యంగా 3 రాశులై ప్రభావం ఉంటుంది. మరి ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
తులా రాశి:
ఈ రాశి వారికి బుధుడు అస్తమించడం శుభసూచకం. డిసెంబర్ 2 నుంచి మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం కూడా కలగుతుంది.గత కొన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులను కూడా పూర్తి చేయనున్నారు. మీరు వ్యాపారంలో ఆశించిన విజయాన్ని పొందుతారు. మీరు శుక్రునికి సంబంధించిన పనిలో మంచి విజయాన్ని పొందుతారు. మీరు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు ఇది మంచి సమయం. మత పరమైన కార్యక్రమాల్లో పాల్లొనే అవకాశాలు కూడా ఉన్నాయి.
మకర రాశి:
ఈ రాశి వారికి బుధుని స్థానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రాశిచక్రం యొక్క ఆదాయ గృహంలో బుధుడు ఉంటాడు. ఇది మీపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. మీరు డబ్బును పొందుతారు . అంతే కాకుండా మీ పనిలో విజయం కూడా సాధిస్తారు. ఆశించిన పని తక్కువ శ్రమతో నెరవేరుతుంది. మీ నాయకత్వ లక్షణాలను చూసి మీరు ప్రయోజనం పొందుతారు. మీరు పెట్టుబడి గురించి ఆలోచిస్తుంటే, ఇది మీకు మంచిది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రతగా ఉండటం చాలా మంచిది.
Also Read: 2025లో వీరు పట్టిందల్లా బంగారమే !
కుంభ రాశి :
ఈ రాశి వారికి బుధుని స్థానం ఆర్థికంగా చాలా లాభిస్తుంది. కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇది దోహదపడుతుంది. ఆఫీసుల్లో మీ అభిప్రాయం గౌరవించబడుతుంది. అంతేకాకుండా, పని పరిధి కూడా వేగంగా తగ్గుతుంది. మీరు పూర్వీకుల ఆస్తి నుండి మంచి లాభాలను పొందుతారు. మీరు పెట్టిన పెట్టుబడి మంచి రాబడిని ఇస్తుంది. నిపుణుల సలహాతో పెట్టుబడులు పెట్టాలి. పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తి చేస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటారు.
(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనిని ధృవీకరించదు.)