Road Accident: నేషనల్ హైవే 161 పై బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డిజిల్లా ఆందోల్ మండలం కన్సంపల్లి వద్ద.. శుక్రవారం ఉదయం 10-11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 60 మంది బస్సులో ఉన్నట్లు తెలుస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆందోల్ మండలం కన్సంపల్లి నేషనల్ హైవే 161 పై ప్రమాదవ శాత్తు బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Also Read: ఆ భూముల సేకరణ నిలిపివేయండి.. సీఎం రేవంత్ ఆదేశం.. రైతుల ఆనందం
ఈ ప్రమాదానికి గల కారణం డ్రైవర్ నిర్లక్ష్యమా లేక సాంకేతిక లోపం వల్ల ప్రమాదం జరిగిందా అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాదం నుంచి నుంచి సురిక్షితంగా బయటపడిన ప్రయాణికులను వేరే బస్సులో వారి గమ్య స్థానానాలకు తరలించారు.