BigTV English

Senagapappu Recipes: టేస్టీ శెనగపప్పు ఆమ్లెట్ కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుని తిని చూడండి, రెసిపీ అదుర్స్

Senagapappu Recipes: టేస్టీ శెనగపప్పు ఆమ్లెట్ కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుని తిని చూడండి, రెసిపీ అదుర్స్

కొత్త కూరల రెసిపీల కోసం వెతుకుతుంటే మీకోసం ఇక్కడ మేము శెనగపప్పు ఆమ్లెట్ కర్రీ రెసిపీ ఇచ్చాము. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. రోజువారీ కూరలు తిని బోర్ కొట్టిన వారు ఇలా కొత్తగా ఈ కూరను ప్రయత్నించి చూడండి. మీకు కచ్చితంగా ఈ కూర నచ్చుతుంది. దీనికోసం ముందుగానే మీరు ఆమ్లెట్ వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఈ శనగపప్పు ఆమ్లెట్ కర్రీ పిల్లలకు కూడా నచ్చుతుంది. ఇక రెసిపీ ఎలాగో చూడండి.


శెనగపప్పు ఆమ్లెట్ కర్రీ రెసిపీకి కావలసిన పదార్థాలు
పచ్చిశనగపప్పు – ఒక కప్పు
ఆమ్లెట్ ముక్కలు – పది
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
గరం మసాలా – అర స్పూను
టమోటోలు – రెండు
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
మిరియాల పొడి – అర స్పూను
కారం – ఒక స్పూను
జీలకర్ర పొడి – అర స్పూన్
పసుపు – పావు స్పూను
ధనియాల పొడి – అర స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూన్
పచ్చిమిర్చి – మూడు
ఉల్లిపాయలు – రెండు
జీలకర్ర – ఒక స్పూన్
లవంగాలు – రెండు
యాలకులు – రెండు
బిర్యానీ ఆకు – ఒకటి
దాల్చిన చెక్క – చిన్న ముక్క
నీళ్లు – తగినన్ని
ఉప్పు – రుచికి సరిపడా

శెనగపప్పు ఆమ్లెట్ కర్రీ రెసిపీ
1. ముందుగానే ఆమ్లెట్లను వేసుకొని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి.
2. శెనగపప్పును కూడా నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టి నూనె వేయాలి.
4. నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, జీలకర్ర, లవంగాలు వేసి వేయించాలి.
5. ఆ తర్వాత ఉల్లిపాయల తరుగును వేసి అవి రంగు మారేవరకు వేయించుకోవాలి.
6. ఉల్లిపాయలు వేగాక పచ్చిమిర్చి, టమోటాలు తరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి.
7. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి.
8. టమోటోలు మెత్తగా ఇగురులాగా అయ్యేవరకు ఉడికించుకోవాలి.
9. టమాటో ఇగురులాగా మెత్తబడ్డాక ఉప్పు, ధనియాల పొడి, పసుపు,  కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి.
10. ఇప్పుడు నానబెట్టిన శెనగపప్పును కూడా ఇందులో వేసుకొని బాగా కలపాలి.
11. రెండు నిమిషాలు ఉడికించాక ఒక కప్పు నీళ్లు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టేయాలి.
12. ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించుకోవాలి.
13. తర్వాత కుక్కర్ ఆవిరి పోయాక మూత తీయాలి.
14. మళ్లీ స్టవ్ వెలిగించి చిన్న మంట మీద ఉడికించాలి.
15. ఆమ్లెట్ ముక్కలను అందులో వేసి కలుపుకోవాలి.
16. పైన కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే టేస్టీ శెనగపప్పు ఆమ్లెట్ కర్రీ రెడీ అయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచిగా ఉంటుంది.


Also Read: భోజనాన్ని వంటగదిలో నేలపై కూర్చుని తింటేనే ఆరోగ్యమట, ఎలానో తెలుసుకోండి

శెనగపప్పు, ఆమ్లెట్ ఈ రెండూ కూడా ఆరోగ్యానికి మంచివే. వీటిని కలిపి తింటే రుచి కూడా అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ మీకు కచ్చితంగా నచ్చుతుంది. చపాతీ, రోటీలతో కూడా ఈ ఇగురు కర్రీ తినవచ్చు. ఒక్కసారి దీన్ని చేసుకొని చూడండి దీని రుచి మీకే తెలుస్తుంది.

Related News

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Weight Loss: ఈ యోగాసనాలతో.. 10 రోజుల్లోనే వెయిట్ లాస్

Sugar: చక్కెర తినడం 30 రోజులు ఆపేస్తే.. ఏం జరుగుతుందో తెలుసా ?

Big Stories

×