E-Paper
Advertisement

Naga panchami 2024: నేడు నాగ పంచమి..శుభ ముహూర్తం ఎప్పుడంటే?

Naga panchami 2024: నేడు నాగ పంచమి..శుభ ముహూర్తం ఎప్పుడంటే?
Advertisement

Naga panchami 2024: నాగ పంచమి పండుగను హిందూవులు  అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు. నాగ పంచమి రోజు శివుడితోపాటు నాగదేవతను పూజించే సంప్రదాయం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఏడాది శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదో రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. అయితే ఈ ఏడాది నాగ పంచమి ఆగస్టు 9న శుక్రవారం రావడం విశేషం. దీంతో సధ్య, సిద్ధ యోగాలు ప్రాధాన్యతను మరింత పెంచుతున్నాయి.

నాగ పంచమి శుక్రవారం ఉదయం 12:36 నిమిషాలకు ప్రారంభమై ఆగస్టు 03:13 నిమిషాలకు ముగుస్తుంది.  నాగ పంచమి పూజను నిర్వహించడానికి అనువైన సమయం ఉదయం 05:47 నుంచి 2:40 నిమిషాల వరకు ఉందని అంటున్నారు. అయితే ఆధ్యాత్మిక ప్రయోజనాలను పెంపొందించుకోవడానికి భక్తులు తమ ఆచారాలను ఈ పవిత్రమైన సమయ పరిధిలో నిర్వహించాలని పురోహితులు చెబుతున్నారు.

Advertisement

జ్యోతిష్య శాస్త్రంలో సధ్య, సిద్ధ యోగాలను చాలా పవిత్రంగా భావిస్తారు. మత విశ్వాసం ప్రకారం..సధ్య యోగంలో చేసిన ఏ పని అయినా ఆటంకాలు లేకుండా పూర్తి కావడంతోపాటు విజయం పొందుతారు. సిద్ధ యోగాన్ని సర్వార్థ సిద్ధి యోగం అని పిలుస్తుంటారు. కొత్త పనిని ప్రారంభించడానికి ఈ సమయం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ యోగం జీవితంలో ఆనందం, సంతోషం, శ్రేయస్సు, సంపదను పెంచుతుంది.

Also Read: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది!

Advertisement

నాగ పంచమి రోజు సర్పదేవుడిని పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. ముఖ్యంగా పితృదోషం, కాలసర్పదోషం నుంచి విముక్తి కలుగుతుందని నమ్మకం. అనంత్, వాసుకి, పద్మ, మహా పద్మ, తక్షక్, కులీర్, కర్కత్, శంఖ వంటి ఎనిమిది సర్పాలను పూజిస్తారు. నాగదేవతను పూజించడంతో భవిష్యత్ లో పాము కాటుకు గురికాకుండా ఉంటారని పండితుతు సూచిస్తున్నారు. అలాగే శ్రీ సర్ప సూక్తం పఠించడంతో మేలు జరుగుతుందని నమ్ముతారు.

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×