Horoscope November 8th: వేద జ్యోతిష్యశాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి వివరించబడింది. ప్రతి రాశి ఒక గ్రహంచే పాలించబడుతుంది. గ్రహాలు, నక్షత్రాల కదలిక ఆధారంగా జాతకాన్ని అంచనా వేస్తారు. నవంబర్ 8 తేదీన కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మరికొందరు జీవితంలో చిన్న సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. నవంబర్ 8, 2024న ఏ రాశుల వారికి లాభం చేకూరుతుందో ఏయే రాశుల వారు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. అవసరానికి దన సహాయం అందుతుంది. వ్యాపారాల పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఎదురైన సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. ఈ రాశి వారు ఇవాళ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. విపరీతమయిన నొప్పితో బాధపడే అవకాశమున్నది.
వృషభ రాశి: వృషభ రాశి నిరుద్యోగులకు ఇవాళ నూతన అవకాశాలు అందే సూచనలు ఉన్నాయి. వస్తు వాహన లాభాలున్నాయి. చిన్ననాటి మిత్రుతలో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసికి ప్రశాంతత ఏర్పడుతుంది. మీ వేగవంతమైన స్వభావమే మిమ్మల్ని లక్ష్యం వైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే కాలంతో పాటు, మీ ఆలోచనలను మార్చుకోండి.
మిథున రాశి: ఇవాళ మిథున రాశి వారు చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. రుణ ఒత్తిడి పెరగడంతో.. మానసిక ఒత్తిడికి గురవుతారు. అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అన్ని రకాలుగా కొత్త సమస్యలు ఏదురుకోవాల్సి వస్తుంది. వ్యాపారాలలో నష్టాలు చూడాల్సి వస్తుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో చికాకులు తప్పవు. బంధువుల దగ్గర చేసిన అప్పులు తీర్చవలసిన అవసరం ఏర్పడుతుంది. అయితే కొత్త అప్పులు ఇవ్వడానికి స్నేహితులు ముందుకు వస్తారు. జీవిత భాగస్వామితో గొడవలు జరిగే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి ఈరోజు సన్నిహితులతో గొడవలు ఏర్పడే ప్రమాదం ఉంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వస్తాయి. వ్యాపార విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో స్వల్ప ఇబ్బందులు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు మార్పులు వచ్చే అవకావం ఉంది. మీ జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి.
సింహ రాశి: ఈ రాశి వారికి ఈరోజు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు చాలా సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు చేయడానికి కుటుంబ సభ్యుల నుంచి పెట్టుబడులు అందుతాయి. పిల్లల విద్యా, ఉద్యోగ విషయాలలో శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగాలలో ఆశించిన పదవులు స్థాన చలనాలు ఉంటాయి. పాత మిత్రులను కలిసి సరదాగా గడుపుతారు. పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇవాళ అనువైన రోజు
కన్య రాశి: ఈ రాశి వారికి ఈ రోజు అన్ని రకాలుగా లాభదాయకంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖుల పరిచయాలు ఏర్పడతాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధు, మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. నూతన గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగుకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో ప్రేమగా మసులకోవడానికి ప్రయత్నించండి.
తులా రాశి: ఈ రాశి వారికి ఈరోజు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది. ఆదాయానికి మించిన ఖర్చులు చేయాల్సి వస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడి లేటుగా పూర్తి చేయాల్సి వస్తుంది. కుటుంబంలో ఏర్పడ్డ చిన్న గొడవలు మానసిక ప్రశాంతతకు భంగం కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అనుకున్న పనులు చేయలేక ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తులకు పై అదికారులను నుంచి ఒత్తిడి పెరుగుతుంది.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఈరోజంతా గందరగోళంగా ఉంటుంది. కీలక వ్యవహారాలలో తొందరపాటు పనికిరాదు. ఒకటి రెండు సార్లు ఆలోచించి ఏ నిర్ణయం అయినా తీసుకోవాలి. స్నేహితుల నుంచి రుణ బాధలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో కొంత ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార విషయంలో భాగస్వాములతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఇవాళ మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామితో గొడవ జరిగే అవకాశం ఉంది.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి ఈరోజు అవసరానికి కుటుంబ సభ్యులు సహాయం చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. బంధు, మిత్రుల నుంచి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారంలో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది. ఈ రాశి మహిలలు ఇవాళ ఖర్చును అదుపు చేసుకోవాలి. ఎప్పుడో తెలియకుండా చేసిన తప్పులకు ఇవాళ శిక్ష పడే చాన్స్ ఉంది.
మకర రాశి: ఈ రాశి వారికి ఈరోజు కష్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితం తక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు ట్రాన్స్ ఫర్ అయ్యే చాన్స్ ఉంది. అప్పులు ఇచ్చిన వారు ఇవాళ అప్పులు తీర్చమని ఒత్తిడి చేస్తారు.
కుంభ రాశి: ఈ రాశి వారు ఈరోజు మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒకటి దానం చేయండి. అనుకోకుండా పెట్టిన పెట్టుబడుల ఈరోజు లాభాలు తెచ్చే అవకాశం ఉంది. నూతన కార్యక్రమాలను ప్రారంభించి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్ర అభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ది కలుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి.
మీన రాశి: ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు ఎంతో కష్టపడితేనే పూర్తి అవుతాయి. బంధవులతో విభేదాలు తప్పవు. ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు