BigTV English

Pushpa2 : పుష్ప గాడి దెబ్బకు మరో బాలీవుడ్ మూవీ అవుట్..?

Pushpa2 : పుష్ప గాడి దెబ్బకు మరో బాలీవుడ్ మూవీ అవుట్..?

Pushpa2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ పుష్ప 2. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ గత కొద్ది నెలలుగా కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయిట్ చేస్తున్నారు.. ఒకసారి వాయిదా పడి ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా విడుదలకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. ఈ సినిమా పై అందరిలోనూ అంచనాలు భారీగా ఉన్నాయి..  ఇక ఈ మూవీ ఓవర్సీస్ ప్రీ-సేల్స్‌లో ఇప్పటికే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీ లో కూడా ‘పుష్ప 2’పై విపరీతమైన క్రేజ్ నెలకొంది. పుష్ప సీక్వెల్ కావడం డైరెక్టర్ సుకుమార్ వేరే లెవెల్ లో చేయడం, అల్లు అర్జున్ నటనపై భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఒక్కో అప్డేట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తూ హైప్ ను క్రియేట్ చేస్తున్నారు..


ఇక పుష్ప గాడి క్రేజ్ దెబ్బకు డిసెంబర్ లో విడుదల కావాల్సిన సినిమాలు పోస్ట్ పోన్ చేసుకుంటున్నాయి. తాజాగా మరో బాలీవుడ్ మూవీ డిసెంబర్ రేసు నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో తెరకేక్కిన ఛావా అనే సినిమా కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛావా’ సినిమా డిసెంబర్ 6న థియేటర్లలోకి రానుంది. మరాఠా చక్రవర్తి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకేకుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు.. సినిమా మొదలైనప్పటి నుంచి మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ మూవీ క్రేజ్ దృష్ట్యా ‘ఛావా’ చిత్ర టీమ్ తమ సినిమా విడుదల తేదీపై మరోసారి ఆలోచిస్తున్నట్లు ఓ వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. పుష్ప గాడి దెబ్బకు తోక ముడిచారు అంటూ ఓ వార్త షికారు చేస్తుంది.

మొన్నటివరకు అంతా సిద్ధం అంటూ రిలీజ్ కు రెడీ అయిన తర్వాత పుష్ప 2 కు నార్త్ లో మంచి రెస్పాన్స్ రావడంతో ‘ఛావా’ చిత్ర నిర్మాతలు తమ సినిమా విడుదలను వాయిదా వేయాలా? అనే సందిగ్ధంలో ఉన్నట్లు సమాచారం.. ఇక ఈ మూవీ కి నేపథ్య సంగీతం దేవి శ్రీప్రసాద్ కాకుండా థమన్ అందిస్తున్నారు. తాజాగా ఈ వార్త పై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. దేవి శ్రీప్రసాద్ లాంటి టాప్ సంగీత దర్శకుడు ఉన్నపుడు కూడా అతని ప్లేస్ లో మరొకరిని ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏంటో ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు.. అయితే ఈ మూవీకి ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్.. ఇక పుష్ప 2 నుంచి ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేసింది.. ముఖ్యంగా సాంగ్స్ ఏ మాత్రం ట్రెండ్ అయ్యాయో చూస్తున్నాం. ఇప్పటికి కూడా సాంగ్స్ వినిపిస్తూనే ఉన్నాయి.. డిసెంబర్ 5న రాబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటుగా పాన్ ఇండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి.


Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×