BigTV English

Numerology : ఒకటో తేదీన పుట్టారా..? న్యూమరాలజీ ప్రకారం మీ జీవితంలో జరగబోయే అద్బుతాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Numerology : ఒకటో తేదీన పుట్టారా..? న్యూమరాలజీ ప్రకారం మీ జీవితంలో జరగబోయే అద్బుతాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

Numerology : మీరు ఒకటో తేదీన పుట్టారా..? మీ భవిష్య్తత్తు ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలని ఉందా..? మీరు జీవితంలో అనుకున్న లక్ష్యాలను ఎప్పుడు రీచ్‌ అవుతారో తెలుసా..? ఒకటో నెంబర్‌లో పుడితే నెంబర్‌వన్‌ లక్షణాలు కచ్చితంగా ఉంటాయా..? జీవితంలో నెంబర్‌వన్‌ పొజిషన్‌కు గ్యారంటీగా వెళ్తారా..? మీ లైఫ్‌ టర్నింగ్‌ పాయింట్‌ ఎప్పుడు వస్తుందో తెలుసా..? మీ ప్రేమ, పెళ్లి లాంటి విషయాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలనుందా..? అయితే ఈ స్టోరీలో తెలుసుకోండి.


న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా ఒకటో తారీఖున పుట్టినవాళ్లు సూర్య జాతకులు అవుతారు. ఒకటో నెంబర్‌ సూర్యుడికి  చెందిన సంఖ్య కావడంతో ఈ నెంబర్‌లో పుట్టిన వారి జీవితం కూడా సూర్యుడిలా స్వయం ప్రకాషంలా వెలిగిపోతుందట. వీళ్లకు చేతిలో రవి స్థానం బలంగా ఉంటే జీవితంలో వీరికి తిరుగు ఉండదట. ముఖ్యంగా ఒకటో తేదీన మధ్యాహ్నం టైంలో పుట్టిన వాళ్లకు రవి బలం అధికంగా ఉంటుందట.  ఈ జాతకులకు ఏ విషయంలోనైనా కుశాగ్రబుద్ధి, ధైర్యం, సాహసం, పట్టుదల, ఆత్మస్థయిర్యం ఎక్కువగా ఉంటుందట. ఈ జాతకులు స్వయం కృషితో జీవితంలో అభివృద్ది సాధిస్తారట. వీళ్లు దృడ సంకల్పంతో పనులు మొదలు పెడితే ఆ పనుల్లో అఖండ విజయం సాధిస్తారట. ఇక ఈ నెంబర్ జాతకులు అనేక భాషలు నేర్చుకుంటారు.

 


ALSO READ: నాగసాధువులు, అఘోరీలు ఒక్కటి కాదా? కళ్ళు బైర్లు కమ్మే నిజాలు

 

ఒకటో నెంబర్‌ వ్యక్తులు సహజంగానే రాజ లక్షణాలు కలిగి ఉంటారు. అయితే వీళ్లకు 28 నుంచి 33 సంవత్సరాల మధ్యలో తిరిగి 40, 56వ సంవత్సరాల్లో గండాలు ఉంటాయట. ఈ నెంబర్‌ జాతకులు తరచుగా ఏదో ఒక అస్వస్థతకు గువుతారట. వీరికి తండ్రి తరపున ఆస్థి కలిసి వస్తుందట. సొంతంగా భోగభాగ్యాలు సంపాదించుకునే నేర్పరులు వీరు. ప్రభుత్వ ఉద్యోగం లేదా.. రాజకీయాలలో ఈ నెంబర్‌ జాతకులు గొప్పగా రాణిస్తారట. సూర్య సంఖ్య జాతకులకు 25 సంవత్సరాల తర్వాత గానీ జీవితంలో మార్పు కలుగదు. 37 సంవత్సరాల వరకు జీవితంలో ఎలాంటి అభివృద్ది ఉండక కష్టపడుతూనే ఉంటారట. అయితే 41 సంవత్సరాల నుంచి వీరికి బాగా యోగిస్తుందట. పలుకుబడి, భోగ భాగ్యములు, వాహన యోగం కలుగుతుందట.

ఈ జాతకులకు 1, 4, 10, 13, 19, 22, 28, 31 తేదీలు అన్ని పనులకు అనుకూలమైనవి. అలాగే 6, 8, 15, 17, 24, 26 తేదీలలో ఏ పని చేయకూడాదు. వీరికి ఇవి శత్రు నెంబర్లు అవుతాయట. ఇక 3, 4, 7 తేదీలు సామాన్య ఫలితాలనిస్తాయట. గోల్డెన్‌ కలర్‌, వైట్‌ కలర్‌ ఈ జాతకులు అదృష్టమైన రంగులు. వీళ్లు హార్ట్‌, బ్లడ్‌, తల, ముఖము, కళ్లకు సంబంధిన వ్యాధులతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అందుకే ఆ విషయంలో ఈ జాతకులు జాగ్రత్తగా ఉండాలి.   ఇక ఒకటవ తేదీలో పుట్టిని స్త్రీలు ఆకర్షణీయమైన ముఖ వర్చస్సు కలిగి ఉంటారు. విలాసవంతమైన లైఫ్‌ ఎంజాయ్‌ చేయడానికి ఇష్టపడతారు. వీరిలో ఎక్కువగా నిరంకువ ధోరణి ఉంటుంది. పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తారు. లాటరీలు, గుర్రపు పందేలు లాంటి వాటిపై వీరు ఎక్కువ ఇంట్రెస్ట్‌ గా ఉంటారు. వర్తకం, వడ్డీ వ్యాపారం, ఇంజనీరింగ్, రాజకీయం, జర్నలిజం లాంటి రంగాలలో ఒకటో తేదీన పుట్టిన స్త్రీలు రాణిస్తారు.   ఈ నెంబర్ లో పుట్టిన కొంత మంది స్త్రీలకు  దాంపత్య  జీవితంలో చాలా కష్టాలు ఉంటాయట. అయితే కొందరికి మాత్రం వివాహ జీవితం చాలా సంతోషకరంగా ఉంటుందట.

 

ALSO READ: జన్మజన్మల్లో వెంటాడే కర్మలు అవేనట – మీరు ఏ కర్మలు చేశారో తెలుసా..?

 

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×