Indian Railways: తక్కువ ధరలో ఆహ్లాదకరంగా ప్రయాణం చేయడానికి రైలు బెస్ట్ ఆప్షన్. అందుకే, చాలా మంది కారు, బస్సు ప్రయాణాల కంటే రైలు ప్రయాణానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. ప్రకృతి అందాల నడుమ రైలు ముందుకు సాగుతుంటే ఎంతో ఆనందం కలుగుతుంది. ట్రైన్ జర్నీలో బోర్ అనేది ఉండదు. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో సాధారణం చిరుతిళ్లు ఇష్టపడతారు. అదే సమయంలో వాటర్ బాటిళ్లు కొనుగోలు చేసి నీళ్లు తాగుతుంటారు. ఆ వాటర్ బాటళ్లను సాధారణం రైళ్లలోని డస్ట్ బిన్ లలో వేయాలి. కానీ, చాలా మంది వాటిని కిటికీల్లోకి బయటకు విసిరేస్తుంటారు. కానీ, ఇలా చేయడం చాలా ప్రమాదకరం అంటున్నారు రైల్వే అధికారులు. అంతేకాదు, వాటర్ బాటిళ్లను బయటపడేయడం వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ఓ వీడియోను రూపొందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఏం ఉందో మీరూ తెలుసుకోండి..
ప్రయాణీకులను ఆలోచింపజేస్తున్న వీడియో
నిజానికి చాలా మందిరైల్వే ప్రయాణం చేస్తున్న సమయంలో ఆహార పొట్లాలు, నీళ్ల సీసాలు వెంట తెచ్చుకుంటారు. భోజనం చేసిన తర్వాత సదరు ప్యాకెట్లను, వాటర్ తాగిన తర్వాత సదరు బాటిళ్లను బయటపడేస్తారు. రైల్లో డస్ట్ బిన్ లు ఉన్నప్పటికీ వీటిని బయటపడేస్తుంటారు. కానీ, అలా చేయడం వల్ల పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చూపిస్తూ ఓ వీడియోను చిత్రీకరించారు. ప్రయాణీకులు చేసే పొరపాట్లు ఎంతో మంది ప్రయాణాలకే ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఇందులో చూపించారు.
ट्रेन से पानी की बोतल फेंकना आसान है लेकिन उसका दुष्प्रभाव भी देखिए।
Worth Sharing. @AshwiniVaishnaw Ji pic.twitter.com/9jfhip2R2E
— Ashwani Dubey (@ashwani_dube) February 4, 2025
ఇక సదరు వీడియోలో రైలు ముందుకు వెళ్తుంది. రైల్లోని ఓ ప్యాసింజర్ తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్ లోని నీళ్లు తాగి, దాన్ని కిటికీలో నుంచి బయటపడేస్తాడు. అది నేరుగా పట్టాల మీద పడుతుంది. పట్టాల మధ్యలో ఇరుక్కుంటుంది. ఆ తర్వాత స్టేషన్ మాస్టర్ కు అదే ట్రాక్ మీద వస్తున్న ట్రైన్ లోకో పైలెట్ నుంచి ఓ ఫోన్ కాల్ వస్తుంది. తాను ఆ ట్రాక్ మీదికి రావచ్చా? అని అడుగుతాడు. స్టేషన్ మాస్టర్ రావచ్చు అని చెప్తాడు. అదే సమయంలో అక్కడ పట్టాల మధ్య ఏదో సమస్య ఉన్నట్లు అలర్ట్ వస్తుంది.
వెంటనే ట్రాక్ సిబ్బందికి కాల్ చేసి, అక్కడ ఏమైందో చూడాలని చెప్తాడు. ఆ ఉద్యోగులు అక్కడికి వెళ్లి చెక్ చేయగా, పట్టాల మధ్య వాటర్ బాటిల్ ఇరక్కుపోయినట్లు గుర్తించారు. వెంటనే వాళ్లు ఆ బాటిల్ ను తొలగించి స్టేషన్ మాస్టర్ కు ఫోన్ చేస్తారు. ఇప్పుడు సిగ్నల్ ఎలా ఉందో పరిశీలించాని చెప్తారు. స్టేషన్ మాస్టర్ ఇప్పుడు అంతా కరెక్ట్ గానే ఉందని చెప్తారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందని అడుగుతాడు. పట్టాల మధ్య లో వాటర్ బాటిల్ ఇరుక్కుపోయిందని చెప్తారు. ఒకవేళ స్టేషన్ మాస్టర్ పొరపాటును గమనించకపోతే రైలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండేది. అందుకే, ప్రయాణీకులు ఎట్టి పరిస్థితుల్లోనూ రైలు పట్టాల మీదకి వాటర్ బాటిళ్లు వేయకూడదంటున్నారు.
Read Also: డైలీ విమానంలో మలేషియా వెళ్లి పనిచేస్తున్న భారత మహిళ.. 5 రోజులు అక్కడ, 2 రోజులు ఇక్కడ!