Pak Govt on Temple: ఒక్క గుడి పాకిస్థాన్ ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులను మిగిల్చింది. కంటి మీద కునుకు లేకుండా చేసింది. చివరికి ఆ ఆలయ బ్రహ్మోత్సవాలను కూడా ఆపలేకపోతుంది పాక్ ప్రభుత్వం. ఇక ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసిన పాక్ సైనికులు మాత్రం ఆ ఆలయాన్ని టచ్ చేయాలంటేనే వణికిపోతారు.
ఇండియా, పాకిస్తాన్ పార్టీషన్ తర్వాత పాకిస్తాన్‌లో మతకల్లోలాలు జరిగాయి. లక్షలాది మంది హిదువులు పాకిస్తాన్ నుంచి తరిమి వేయబడ్డారు. తమ ప్రాణాలను అరచేతుల్లో పట్టుకుని బార్డర్ దాటారు. అప్పటికే జిన్నా నేతృత్వంలోని పాకిస్తాన్ పాలకులు హిందువు అనే వ్యక్తి తమ దేశంలో కనిపించకూడదన్నంత క్రూరత్వంతో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థిర, చరాస్థులను వదిలేసి ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ ఇండియా వైపు పరుగులు పెట్టారు. అలా కొద్ది రోజుల మారణహొమం తర్వాత పాకిస్తాన్ పాలకుల చూపులు ఆ దేశంలోని హిందూ ఆలయాల మీద పడ్డాయి. ప్లాన్ ప్రకారం ఆలయాలను ఒక్కొక్కటిగా నేలమట్టం చేస్తూ వచ్చారు. లేదంటే గుడులను మసీదులుగా మార్చుకున్నారు. చివరికి పాకిస్తాన్ లో భూతద్దంలో వెతికినా గుడి కనిపించనంతగా అక్కడి పరిస్థితి దిగజారిపోయింది.
అయితే ఒక్క గుడిని మాత్రం అక్కడి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. ఆ దేశ సైనికులు ఆ గుడిని టచ్ చేయాలంటేనే వణికిపోయేవారు. చివరకు ఆ గుడి దగ్గర జరిగే జాతరను కూడా పాక్ పాలకులు ఆపలేకపోయారు. అలాంటి గుడి చరిత్రను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పాకిస్తాన్‌లోని బెలుచిస్తాన్ ప్రావిన్సులోని లాస్‌బెలా జిల్లా నుంచి అరేబియా సముద్రాన్ని తాకుతూ మక్రాన్ ఏడారి విస్తరించి ఉంటుంది. అక్కడే హిగల్ నది వెళ్తుంది. ఆ నది పక్కనే అభయారణ్యాలు వ్యాపించి ఉంటాయి. ఆ అభయారణ్యాల మధ్యలోంచే ‘జై మాతా ది’ అనే నినాదాలు పెద్ద ఎత్తున వినిపిస్తుంటాయి. అక్కడే హింగ్లాజ్ మాత ఆలయం ఉంటుంది. ఇది పాకిస్తాన్ లోని ఏకైక శక్తిపీఠం. ప్రపంచంలోని 51 శక్తి పీఠాలలో ఈ ఆలయం ఒకటి. సతీ దేవి తల భాగం పడిన ప్రాంతమే హింగ్లాజ్ శక్తి పీఠం.
అలాగే మన దేశంలోని రాజ్ పుత్ ల కులదేవతగా హిగ్లాజ్ మాత గౌరవించబడుతుంది. దాదాపు 2 లక్షల సంవత్సరాల నాటి ఈ ఆలయంలో అమ్మ దర్శనం తో పూర్వజన్మల పాపాలు కూడా నశిస్తాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయం ఒక చిన్న సహజంగా ఏర్పడ్డ గుహలో నిర్మితమైంది. హింగ్లాజ్ మాత ప్రతిరూపంగా ఒక చిన్న రాయిని పూజిస్తారు. ఈ శిలను సంస్కృతంలో హింగులా అని పిలుస్తారు. అందుకే ఇక్కడి దేవతకు హిగ్లాజ్ మాతగా పేరొచ్చిందంటారు.
అయితే పాకిస్తాన్ పాలకులు, అక్కడి మిలటరీ వాళ్లు ఈ గుడిని ఎన్నో సార్లు ధ్వంసం చేయాలని చూశారట. అయితే వాళ్లు ఎన్నిసార్లు ప్రయత్నించినా సక్సెస్ కాలేదని అదంతా అమ్మవారి మహిమేనని అక్కడి హిందూ భక్తులు చెప్తుంటారు. ఇప్పటికీ ఆ గుడికి హాని చేయాలని ఎవరైనా ప్రయత్నించినా వారికి ఏదైనా సమస్య వస్తుందట. దేవీ నవరాత్రుల సమయంలో ఇక్కడ 3 కి.మీ మేర జాతర జరుగుతుంది. ఈ జాతరకు ప్రతిరోజు పది వేల నుంచి 25 వేల మంది భక్తులు వస్తుంటారు. దర్శనానికి వచ్చిన మహిళలు గర్బా నృత్యం చేస్తారు. ఇక్కడ జరిగే జాతరకు స్థానిక ముస్లీంలు కూడా వస్తుంటారు. అమ్మవారిని భక్తి శ్రద్దలతో పూజిస్తారు.
స్థానిక ముస్లింలు హింగ్లాజ్ ఆలయాన్ని నాని బీబీ హజ్ లేదా పీర్గాగా భావిస్తారు. ఈ పీర్గాకు ఆఫ్ఘనిస్తాన్, ఈజిప్ట్, ఇరాన్ వంటి దేశాల నుండి భక్తులు వస్తుంటారు.
ALSO READ: ఫస్ట్ టైం అరుణాచలం వెళ్తున్నారా..?అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?