Telangana farmers: కేంద్రం ఇచ్చే పథకాలు రైతులకు రావడం లేదా? ఇప్పటివరకు ఇచ్చినవి అందలేదా? ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టేందుకు శ్రీకారం చుట్టింది కేంద్రప్రభుత్వం. ప్రస్తుతం ఈ కార్యక్రమం తెలంగాణ సోమవారం( మే 5 నుంచి) మొదలైంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైతన్నలు తక్షణమే కార్డు పొందవచ్చు. ఇంతకీ ఐడీ కార్డు పొందాలంటే ఏంటి? ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తారు? అనేది ఓసారి తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. ఆధార్ మాదిరిగా రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. దీనికి సంబంధించి ప్రక్రియ ఇవాళ్టి నుంచి తెలంగాణలో మొదలైంది. మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్డుల కోసం వివరాలు నమోదుకు పట్టాదారు పాసు పుస్తకం రైతులు కేవలం ఆధార్‌కార్డుతో అగ్రికల్చర్ ఆఫీసుకు వెళ్లాలి.
భూముల వివరాలు ఇవ్వాలి?
రైతుల మొబైల్ నెంబర్‌కు ఆధార్ లింక్ చేయాలి. లేకుంటే కాస్త డిలే అవుతుంది. ఒకవేళ ఆధార్ లింక్ లేకపోతే ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా పూర్తి చేయనున్నారు. ఆధార్ నంబర్‌తో అనుసంధానమైన పట్టాదారు పాసు పుస్తకంలోని భూయాజమాన్య వివరాల నమోదు నమోదు చేస్తారు. భూమి వివరాలు, సాగు చేసిన పంటల సమాచారం ఇవ్వాలి.
వాటిని ఎంటర్ చేసిన తర్వాత రైతు ఫోన్‌కు ఓటీపీ నెంబర్ వస్తుంది. దాన్ని యాప్‌లో నమోదు చేయగానే రైతులకు 11 అంకెల ఫార్మర్ ఐడీ జనరేట్ అవుతుంది. ఆధార్ మాదిరిగా 11 అంకెలతో విశిష్ట గుర్తింపు కార్డును రైతులకు ఇవ్వనున్నారు. తొలుత వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో నమోదు చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ సేవ కేంద్రాల్లోనూ నమోదు చేసుకోవచ్చన్నది అధికారుల మాట.
ALSO READ: ఆర్టీసీ సమ్మెపై వెనక్కి? మంత్రితో ఆర్టీసీ సంఘాల భేటీ
దేశంలో వ్యవసాయ శాఖకు సంబంధించిన వివరాలు లేకపోవడం సమస్యగా మారింది. వీటికి పరిష్కారంగా ప్రతీ రైతుకు విశిష్ట గుర్తింపు సంఖ్యతో ప్రత్యేక కార్డులు జారీచేయాలని నిర్ణయించింది. ఇప్పటికే 19 రాష్ట్రాలు కేంద్రంతో ఒప్పందం చేసుకున్నాయి. నమోదు ప్రక్రియను పూర్తి చేశాయి కూడా.
తెలంగాణలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు
తెలంగాణలో ఆ కార్యక్రమం వాయిదా పడింది. సోమవారం నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రైతుల కోసం పీఎం కిసాన్, పంటల బీమా, మౌలిక సదుపాయాల కల్పన వంటి పథకాలు అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించి సరైన లెక్కలు, ధ్రువీకరణలు, నమోదు వివరాలు లేవు. సకాలంలో పథకాలు అందలేదని కేంద్రం గుర్తించింది.
ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లోని భూములు, పంటల వివరాలు మాత్రమే అందుతున్నాయి. రైతుల వారీగా పంటల వివరాలు సమాచారం లేదు. రైతులు నమోదు చేసుకున్న యూనిక్ ఐడీ కార్డును కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్ పథకానికి నిధుల విడుదలకు దీనినే ప్రామాణికంగా తీసుకుంటామని ఇప్పటికే మార్గదర్శకాలు జారీచేసింది కేంద్రం.
కేవలం పథకాలు మాత్రమే కాకుండా ప్రకృతి విపత్తుల సమయంలో ఐడీ నెంబర్ ఎంటర్ చేస్తే రైతు సాగు వివరాలు తెలుస్తాయి. ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా ఐడీతో అన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. వ్యవసాయాలపై తీసుకొచ్చే పాలసీలకు ఈ డిజిటల్ డేటా ప్రభుత్వానికి ఉపయోపడనుంది. దీనిద్వారా వ్యవసాయ సెక్టార్‌లో డిజిటల్ విప్లవం రానుందని అధికారుల మాట.