కాలాతీతమైన భారతీయ ఇతిహాసాలలో భగవద్గీత ఒకటి. ఇది హిందువులకు అత్యంత ముఖ్యమైన గ్రంథం. ప్రతి ఒక్కరూ తప్పక చదవవలసిన అద్భుతమైన పుస్తకం ఇది. భగవద్గీత కేవలం గ్రంథం మాత్రమే కాదు… భూమిపై జీవిస్తున్న ప్రతి మనిషికి అత్యవసరమైన జ్ఞానాన్ని ఇచ్చే అద్భుతమైన ఇతిహాసం.
భగవద్గీత అనేది కుటుంబం, ప్రేమ, ధర్మం, పని… ఇలా ఎన్నో విషయాల గురించి పాఠాలు చెప్పే ఒక అద్భుతమైన గ్రంథం. దేవుడే దీనిద్వారా స్వయంగా మనుషులకు సలహాలు ఇస్తాడు. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో ఆ అర్జునుడికి స్వయానా శ్రీకృష్ణుడు చెప్పిన మాటలే భగవద్గీత రూపంలో మారాయి. ఆధునిక జీవితంలో మీకు అనేక సమస్యలు ఎదుర్కోవచ్చు. వాటిని పరిష్కరించేందుకు మీరు ఎంతో ప్రయత్నించవచ్చు. ఆ పరిష్కారానికి సహాయపడే శ్లోకాలు ఇక్కడ ఉన్నాయి. వీటిని మీరు అవలోకనం చేసుకుంటే ఆ సమస్యల నుంచి త్వరగా బయటపడతారు.
యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ
సిద్ధ్యసిద్ధ్యోః సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే
ఇది భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఒక పాఠం. దీని ప్రకారం ఆధునిక జీవితంలో… పనిచేయడానికి ముందు వచ్చే ఫలితం గురించే ఆందోళన చెందుతాము. కానీ అలా ఆందోళన చెందవద్దని శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా చెప్పాడు. ఫలితం మీ చేతిలో లేదని అర్థం చేసుకోండి. ప్రయత్నం చేయడం వరకే మీ పని… దాని ఫలితం ఎలా ఉంటుందో ముందే ఊహించుకొని ఆందోళన చెందకండి అని శ్రీకృష్ణుడు చెప్పాడు.
మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాన్ నమస్కురు
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియసి మే
ఈ శ్లోకం భక్తి ప్రాముఖ్యత గురించి చెప్పేది. తాము నమ్మిన దేవుడు గురించి ఆలోచిస్తూ అంకితభావంతో ఉండడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని శ్రీకృష్ణుడు వివరిస్తున్నాడు. దేవుడిని పూజిస్తూ ప్రతిరోజు నమస్కరిస్తూ ఉంటే ప్రశాంతమైన జీవితం దక్కుతుందని చెబుతున్నాడు. ఒక దేవుడి పట్ల విశ్వాసాన్ని ఉంచుకోవడం, అతని ఉన్నత శక్తికి లొంగిపోవడం అనేది మానసిక ప్రశాంతతకు కారణం అవుతుంది. దేవుడితో చివరికి ఒకటి కావాలన్నదే ప్రతి భక్తుడి కోరిక. మానసిక భారాన్ని మోస్తూ ఎక్కువగా ఆలోచించే బదులు ఆ దేవుడినీ నమ్ముకుంటూ ముందుకు అడుగు వేస్తే అతడే మిమ్మల్ని నడిపిస్తాడని గుర్తుపెట్టుకోండి.
న హి జ్ఞానేన సదృశం పవిత్రమిః విద్యతే
తత్స్వయం యోగసంసిద్ధః కాలేనాత్మని విన్దతి
ఈ శ్లోకం జ్ఞానం ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. అన్నిటికంటే పరిశుద్ధమైనది జ్ఞానం మాత్రమే. ఆ జ్ఞానం మనలోనే ఉంటుంది. ఆ జ్ఞానాన్ని ఎవరు తస్కరించలేరు. ఇది ఆధునిక జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. నిజమైన జ్ఞానవంతుడు తక్కువగా మాట్లాడతాడు. నేర్చుకోవడం పైనే దృష్టి పెడతాడు. ఎదుటి వారిని గమనించడం మీకు ప్రయత్నిస్తాడు. తనలో అంతర్గత జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటాడు.
మాత్రాస్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణసుఖదుఃఖదాః
ఆగమపాయినోద్యనిత్ యాస్తాంస్తితిక్షస్వ భారత
జీవిత సారాన్ని బోధించే మరొక అందమైన శ్లోకం ఇది. ప్రజల జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలు శాశ్వతం కాదని అవి క్షణాల్లాగే కనుమరుగైపోతాయని చెప్పడమే ఈ శ్లోకం ఉద్దేశం. చలి, వేడి, సుఖదుఃఖాలు, భావోద్వేగాలు వచ్చిపోతున్నట్లే జీవితంలోని కష్టసుఖాలు కూడా వచ్చిపోతూ ఉంటాయి. ఏవీ శాశ్వతం కాదు. కష్టాన్ని ధైర్యంగా భరించాలి. కఠినంగా ఉండాలి. అప్పుడే దాని వెనుక వచ్చే సుఖాన్ని నువ్వు అనుభవించగలవు అని చెప్పడమే ఈ గీత సారాంశం.