White Hair Tips: ప్రస్తుతం కాలంలో యువతీ, యువకులు ప్రధానంగా ఎదుర్కుంటున్న సమస్య తెల్లజుట్టు. నిండా 25 ఏళ్లు నిండకుండానే.. ప్రతి ఒక్కరికి తెల్లజుట్టు రావడం కామన్ అయిపోయింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, సరైనా పోషకాహారం తినకపోవడం, బయట కాలుష్యం మొదలైనవి. కొంత మందికి అతి చిన్న వయసులోనే వంశపార్యపరంగా వస్తుంటాయి. వాటిని బాలనెరుపు అంటారు. ఇక తెల్లజుట్టును కవర్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఆ కొద్దిసేపు మాత్రమే పనిచేస్తాయి. మళ్లీ యదావిథిగా వైట్ హెయిర్ కనిపిస్తుంటుంది. కాబట్టి తెల్లజుట్టుకు శాశ్వత పరిష్కారం కావాలంటే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి. తప్పనిసరిగా మంచి రిజల్ట్ మీకు కనిపిస్తాయి. మరి లేట్ చెయ్యకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బిల్లగన్నేరు, నిమ్మరసం, కొబ్బరి నూనె హెయిర్ మాస్క్
ముందుగా బిల్లగన్నేరు ఆకులను.. నీటితో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటిని మిక్సీ జార్‌లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ రూపంలో లేదా రసం లాగా కాని ప్రిపేర్ చేసుకోవాలి. వాటిని చిన్న గిన్నెలోకి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసుకుని అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.. శాశ్వతంగా తెల్లజుట్టు నల్లగా మారుతుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
జామ ఆకులు, కలబంద హెయిర్ మాస్క్
తెల్లజుట్టును నివారించేందుకు ఈ రెండు పదార్ధాలు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు జుట్టును ఒత్తుగా, ఆరోగ్యవంతంగా ఉండేలా సహాయపడతాయి. జామ ఆకుల్లో జుట్టుకు సంబంధించిన అనేక పోషకాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా వెంట్రుకలు బలహీనపడటం, హెయిర్ గ్రోత్ ఆగిపోవడం అలాగే.. చిన్న వయసులో ఏర్పడే తెల్లజుట్టు నివారించడానికి కూడా చక్కగా పనిచేస్తుంది. సాధారణంగా శరీరంలో విటమిన్ ఇ లోపించడం వల్లన తెల్లజుట్టు సమస్యలు వస్తుంటాయి. అలోవెరాలో సమృద్ధిగా లభించే విటమిన్ ఇ.. తెల్లజుట్టును నివారించడంతో పాటు.. ఒత్తైన ఆరోగ్యవంతమైన నల్లటి కురులు పెరిగి రీగ్రోత్ చేయడంలో సహాయపడుతుంది.
తయారీ విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని.. అందులో జామ ఆకులు, ఫ్రెష్ కలబంద ముక్కలు, కప్పు వాటర్ తీసుకుని 10 నిమిషాల పాటు మరిగించండి. ఇప్పటు స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి వడకట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా కొబ్బరి నూనె కలిపి జుట్టు కుదుళ్లకు అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చెయ్యండి. ఇలా వారానికి ఒకసారి చేస్తే సరిపోతుంది. ఇలా క్రమం తప్పకుండా పాటిస్తే.. శాశ్వతంగా తెల్లజుట్టును నివారించవచ్చు. ఈ హెయిర్ మాస్క్ వల్ల జుట్టు కూడా ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది కూడా.
Also Read: ఈ ఫేస్ ప్యాక్స్ ఒక్కసారి ట్రై చేయండి.. అందమైన మోము మీ సొంతం
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.