Shrifal Significance: కొబ్బరికాయను సంస్కృతంలో ‘శ్రీఫల’ అని పిలుస్తారు. దీనిని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీదేవి పూజ లేకుండా ఏ పూజ అయినా పూర్తి కానట్లే.. కొబ్బరికాయ లేకుండా ఏ పూజా పూర్తి కాదు. అందుకే అన్ని శుభ కార్యాలలో కొబ్బరికాయను ఉపయోగిస్తారు. తద్వారా ఆ శుభ కార్యంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా, పని పూర్తి అవుతుందని నమ్ముతారు. పూజలో కలశం కోసం అయినా, వివాహ వేడుక అయినా, కొత్త కారు పూజ అయినా, కొబ్బరికాయ ఖచ్చితంగా సమర్పిస్తారు.
కొబ్బరికాయను శ్రీఫల అని ఎందుకు పిలుస్తారు ?
మత్స్యపురాణం ప్రకారం.. విష్ణువు, లక్ష్మీ దేవి భూమిపైకి వచ్చినప్పుడు వారు కలిసి నాటిన మొదటి చెట్టు కొబ్బరి చెట్టు అని చెబుతారు. అలాగే.. లక్ష్మీ దేవిని ‘శ్రీ’ అని పిలుస్తారు. ఆమెకు కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం. అందుకే కొబ్బరికాయను శ్రీఫల అని పిలుస్తారు.
కొబ్బరికాయ యొక్క మతపరమైన ప్రాముఖ్యత ఏమిటి ?
హిందూ మతంలో కొబ్బరికాయను పవిత్రమైనదిగా భావిస్తారు. కొబ్బరికాయ నైవేద్యం దేవతలకు చాలా ప్రియమైనది. అందుకే పూజలో కొబ్బరికాయను సమర్పించే సంప్రదాయం పురాతన కాలం నుండి ఉంది. పురాణాల ప్రకారం.. విష్ణువు భూమిపైకి దిగివచ్చినప్పుడు, తనతో పాటు లక్ష్మీదేవి, కొబ్బరి చెట్టు, కామధేను ఆవును తీసుకువచ్చాడట. ఈ కారణంగా కొబ్బరి చెట్టును కల్పవృక్షం అని కూడా పిలుస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు దేవుళ్ళు కొబ్బరికాయలో నివసిస్తారని నమ్ముతారు. అందుకే పూజా సమయాల్లో కొబ్బరి కాయను సమర్పిస్తారు.
కొబ్బరికాయకు సంబంధించిన మరో నమ్మకం ఏమిటంటే.. కొబ్బరికాయను విశ్వామిత్రుడు సృష్టించాడని కూడా నమ్ముతారు. ఒకసారి విశ్వామిత్రుడు ఇంద్రుడిపై కోపంగా ఉండి మరొక స్వర్గాన్ని సృష్టించడం ప్రారంభించాడుట. రెండవ ప్రపంచాన్ని సృష్టిస్తూ, అతను మానవ రూపంలోని ఒక కొబ్బరికాయను సృష్టించాడు. ఈ కారణంగా, కొబ్బరి చిప్ప బయటి వైపు రెండు కళ్ళు, ఒక నోరు ఉంటాయని అంటారు.
‘శ్రీఫల’ను ఏ రోజున పూజించాలి?
మీరు ‘శ్రీఫల’ను పూజించాలనుకుంటే.. మంగళవారం, శుక్రవారం పూజకు అత్యంత పవిత్రమైన రోజులుగా భావిస్తారు. ఈ రోజున శ్రీఫల్ ని పూజించడం ద్వారా.. ఒక వ్యక్తి యొక్క అన్ని కోరికలు నెరవేరతాయి . అంతే కాకుండా జాతకంలోని గ్రహ దోషాల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది.
కొబ్బరి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు :
కొబ్బరికాయలోని నీటిని చాలా పవిత్రంగా భావిస్తారు. వీటి ద్వారా ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.
కొబ్బరికాయ గణపతి, శంకరుడికి ఇష్టమైన పండు.
కొబ్బరికాయను మానవ శరీరానికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని కొట్టడం అంటే మీ అహాన్ని బద్దలు కొట్టడం.
కొబ్బరికాయపై ఉండే గుర్తులు శివుని కళ్ళుగా పరిగణించబడతాయి.
Also Read: అరుదైన రాజయోగం.. ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు
నమ్మకాల ప్రకారం.. కొబ్బరికాయ శరీర బలహీనతను తొలగిస్తుంది. అంతే కాకుండా దేవతలకు కొబ్బరి కాయను సమర్పించడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. కొబ్బరికాయ లోపల ఉన్న నీరు చాలా పవిత్రమైనది. మనం కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు, దాని నీరు చుట్టూ చెల్లాచెదురుగా పడుతుంది. దీనివల్ల అన్ని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుంది. దీంతో పాటు.. ప్రత్యేక కోరికలు నెరవేరడానికి ఆలయంలో కొబ్బరికాయను కూడా కొడతారు.