BigTV English

Ajith: మరోసారి యాక్సిడెంట్ కి గురైన అజిత్.. టెన్షన్లో అభిమానులు..!

Ajith: మరోసారి యాక్సిడెంట్ కి గురైన అజిత్.. టెన్షన్లో అభిమానులు..!

Ajith: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) మరోసారి యాక్సిడెంట్ కి గురయ్యారు. ఈ విషయం అభిమానులను పూర్తిస్థాయిలో ఆందోళనకు గురిచేస్తోంది. నిజానికి అజిత్ వరుసగా ప్రమాదాలకు గురవుతున్న విషయం తెలిసిందే. రేసింగ్ లో ఆయన కారు పలుమార్లు ప్రమాదానికి గురైంది. ఇప్పుడు మరొకసారి ఆయన కారుకు ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో అజిత్ కి గాయాలు కాలేదని సమాచారం. దీంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రేసింగ్ లో అజిత్ కారు ట్రాక్ నుంచి పక్కకు వెళ్లడంతో ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగానే బయటపడ్డారని సమాచారం. అయితే ఈ ప్రమాదంలో కారు ముందు భాగం మాత్రం భారీగా డామేజ్ అయిందట.


వరుస ప్రమాదాలకు గురవుతున్న అజిత్..

ఇదిలా వుండగా 2025 ఫిబ్రవరి 23న కూడా స్పెయిన్ లో జరిగిన ఒక రేసింగ్ ఈవెంట్ లో అజిత్ కారు ఇలా తీవ్ర ప్రమాదానికి గురైంది. అంతలోనే మళ్లీ కార్ యాక్సిడెంట్ అవ్వడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ విషయంపై స్పందించిన అజిత్ రేసింగ్ టీమ్ ఇంస్టాగ్రామ్ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ.. ఆయన క్షేమంగా ఉన్నారు. కార్ ప్రమాదానికి కారణం ఇతర కార్లే అంటూ కూడా తెలిపారు. ఇకపోతే వివిధ పోటీలలో పలుమార్లు ఆయన యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే.కానీ దేవుడి దయతో సురక్షితంగానే బయటపడుతున్నారు. ఇది చూసిన అభిమానులు కూడా అజిత్ గట్టి పిండమే అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కూడా..

దీనికి తోడు ఇదే సంవత్సరం జనవరిలో కూడా దుబాయ్ గ్రాండ్ ప్రీ రేస్ కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండగా.. అప్పుడు కూడా అజిత్ గారు ప్రమాదానికి గురైంది. కారు ట్రాక్ సమీపంలోని గోడను ఢీకొని ముందు భాగం దెబ్బతింది. అయితే ఈ ప్రమాదంలో కూడా అజిత్ గాయాలు లేకుండా బయటపడ్డారు. ఇక 2025 ఫిబ్రవరి 10న పోర్చుగల్ లో జరిగిన కార్ రేస్ పోటీలో కూడా అజిత్ కారు స్వల్ప ప్రమాదానికి గురైంది. ఇక ఇలా పలుమార్లు అజిత్ కారు ప్రమాదానికి గురవుతుండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అజిత్ సినిమాలు..

ఇక అజిత్ సినిమాల విషయానికే వస్తే.. ప్రస్తుతం అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. వినోద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇంకా ఇప్పుడే రూ.200 కోట్ల మార్కు క్రాస్ చేసిన ఈ సినిమా తో భారీ విజయాన్ని అందుకున్నారు. ఇక ఇప్పుడిప్పుడే సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగా మళ్లీ ఇలా ప్రమాదానికి గురవడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

Bollywood: బ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలకు సారీ చెప్పిన డైరెక్టర్… ఇంతకీ అది సారీ చెప్పినట్టేనా..?

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×