Anurag Kashyap: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఇక దీనికి తోడు నిన్న ఏకంగా ఒక వర్గం” బ్రాహ్మణులపై మూత్రం పోస్తాను.. నీకేమైనా అభ్యంతరమా”? అంటూ చేసిన పోస్టు ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. ఇక దీంతో చాలామంది అనురాగ్ కశ్యప్ పై విమర్శలు గుప్పించారు. పైగా చర్చలు కొనసాగుతున్న వేళ ఎట్టకేలకు దిగివచ్చిన అనురాగ్ కశ్యప్ క్షమాపణలు చెప్పారు. కానీ షరతులతో కూడిన క్షమాపణలు చెప్పేసరికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎందుకు ఇలాంటి షరతులతో కూడిన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెట్టే చిత్రాలు ఎన్నో ఆగిపోయాయి – అనురాగ్..
ఇక అసలు విషయంలోకెళితే.. ఇటీవల అనురాగ్ దర్శకత్వం వహించిన ‘పూలే’ మూవీ ఈనెల 25వ తేదీన విడుదల కాబోతోంది. వాస్తవానికి ఈనెల 11న విడుదల కావాల్సి ఉండగా.. సెన్సార్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ క్రమంలోనే అటు గతంలో కూడా విడుదలకు నోచుకోని.. ‘పంజాబ్ 95’, ‘తడక్ 2’ చిత్రాలను ప్రస్తావిస్తూ సెన్సార్ బోర్డ్, కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఈయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ముఖ్యంగా సెన్సార్ బోర్డు ఆగ్రహానికి గురై.. తన సినిమాలు విడుదల కాలేదని దీనికి తోడు కుల, ప్రాంత, జాతి వివక్ష చూపించే ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెట్టే ఇలాంటి సినిమాలు ఎన్ని నిషేధించబడ్డాయో తెలియదు అని, అందుకే తన ఈ పోరాటం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోస్ట్ చేశారు అనురాగ్ కశ్యప్. అంతేకాదు సొంత ముఖం చూసుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారని, వాళ్లకు ఇబ్బంది కలిగించే సినిమా గురించి, బహిరంగంగా మాట్లాడలేనంత పిరికివాళ్ళు ఉన్నారు అని.. అలాంటి వారికే నా ఈ పోస్ట్ అంటూ విమర్శించారు.
బ్రాహ్మణులకు షరతులతో కూడిన క్షమాపణలు చెప్పిన అనురాగ్..
దీనికి తోడు తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ హత్య బెదిరింపులకు పాల్పడుతున్న..ఒక వర్గం బ్రాహ్మణులపై ఇలాంటి కామెంట్లు చేశారు. ఇప్పుడు ఆ విమర్శలు వస్తున్న వేళ వాటికి ప్రతిస్పందనగా బహిరంగ క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా తన ఉద్దేశం తప్పుగా అర్థం చేసుకున్నారని మనువాదులు, సంస్కారహీన బ్రాహ్మణులకు మాత్రమే క్షమాపణ చెబుతున్నాను అంటూ కూడా ఆయన షరతులు విధించారు.. నా కుమార్తెను, నా కుటుంబం, స్నేహితులు సహోద్యోగులకు, మనువాద నాయకుల నుండీ లైంగిక వేధింపులు, హత్యా బెదిరింపులు వస్తున్నాయి. కాబట్టి నేను అన్న మాటను వెనక్కి తీసుకోను. కానీ మీరు నన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు. ఎందుకంటే నా కుటుంబం ఏమీ అనలేదు..అనదు కూడా.. మీకు నా నుండి క్షమాపణ కావాలి అంటే ఓ బ్రాహ్మణులారా… స్త్రీలను అనడం వదిలేయండి. అది మన ధర్మం కాదు కదా.. మీరు అసలైన బ్రాహ్మణులను నిరూపించుకుంటే.. నేను అన్న మిగతా మాటలకు కూడా క్షమాపణ చెబుతాను అంటూ షరతులతో కూడిన క్షమాపణ చెప్పారు అనురాగ్ కశ్యప్. దీంతో ఈ విషయం మళ్ళీ వైరల్ గా మారడంతో ఇక ఈయన ఇచ్చిన వివరణకు నెటిజన్లు కూడా కొంతమంది అనురాగ్ కి మద్దతు పలుకుతున్నారు. ఏదైనా ఉంటే వ్యక్తులు చూసుకోవాలి కానీ ఇంట్లో స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Shine Tom Chacho: ఎట్టకేలకు విచారణకు హాజరైన దేవర నటుడు.. పోలీసులు విచారించే ప్రశ్నలివే..?