BigTV English

Shani Gochar 2024: పూర్వ భాద్రపద నక్షత్రంలోకి శని ప్రవేశం.. ఈ 3 రాశుల వారికి 12 గంటల తర్వాత అదృష్టం కలుగుతుంది..

Shani Gochar 2024: పూర్వ భాద్రపద నక్షత్రంలోకి శని ప్రవేశం.. ఈ 3 రాశుల వారికి 12 గంటల తర్వాత అదృష్టం కలుగుతుంది..

Shani Gochar 2024: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శనిదేవుడు కర్మ, న్యాయాలకు ప్రతీకగా ఉంటాడు. ఒకటిన్నర సంవత్సరానికి ఒక రాశి నుంచి మరొక రాశికి శని సంచారం జరుగుతుంది. కానీ.. ఈ ఏడాది శని సంచారం చాలా త్వరగా మారుతోంది. 12 గంటల తర్వాత శని పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై పడనుంది. కానీ.. ప్రత్యేకంగా 3 రాశులవారికి అదృష్టం కలిసి రాబోతోంది.


పూర్వ భాద్రపదలోకి శని సంచారంతో అదృష్టవంతులు కాబోతున్న రాశులు

వృషభ రాశి


శని పూర్వ భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించడం.. ఈ రాశివారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. వ్యాపారంలో విజయం సాధిస్తారు. నిపుణులు, వ్యాపారవేత్తలు.. తక్కువ కష్టంతో ఎక్కువ సంపాదిస్తారు. ఉద్యోగులు ఉద్యోగం మారేందుకు ఇదే మంచి సమయం. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగ ప్రదేశంలో మీ ప్రతిష్టలు పెరుగుతాయి. తండ్రితో అనుబంధం బలపడుతుంది.

మిథున రాశి

శని నక్షత్ర మార్పు ఈ రాశివారికి ప్రయోజనాలను చేకూరుస్తుంది. శని ఈ రాశివారి గోచర కుండలిలోని 9వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. మతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారవేత్తలకు డీల్ జరగవచ్చు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు.

కుంభ రాశి

శని నక్షత్ర మార్పు ఈ రాశివారికి లాభాలను ఇస్తుంది. జన్మలగ్నంలోకి శని రానుండటం శష రాజయోగాన్ని ఇస్తుంది. పరపతి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మానసిక స్థైర్యం పెరుగుతుంది. ఏ పనినైనా సులభంగా పూర్తి చేస్తారు. పార్టర్న్ షిప్ వ్యాపారం చేసేందుకు మంచికాలం. వివాహితులకు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారికి వివాహం జరగవచ్చు.

(గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించినది. bigtvlive.com దీనికి ఎలాంటి బాధ్యత వహించదు.)

Related News

Navratri Day-4: నవరాత్రి నాల్గవ రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: ఐదో రోజు అట్ల బతుకమ్మ.. అట్లు నైవేద్యంగా పెట్టడం వెనక ఉన్న కారణం ఏంటి ?

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Big Stories

×