BigTV English

Indian Railway: టికెట్ కొనకుండా రైలెక్కడం చూసి ఉంటాం.. కొని కూడా ఎక్కరు వీరు.. ఎందుకిలా? చివరికి ఏమైంది?

Indian Railway: టికెట్ కొనకుండా రైలెక్కడం చూసి ఉంటాం.. కొని కూడా ఎక్కరు వీరు.. ఎందుకిలా? చివరికి ఏమైంది?

Indian Railway: వారందరికీ రైలు ఎక్కాలని అమిత ఇష్టం. కానీ రైలు టికెట్ మాత్రం కొంటారు.. రైలు మాత్రం ఎక్కరంటే ఎక్కరు. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే సూపర్ ప్లాన్ అనేస్తారు. ఇలా రైలు టికెట్ కొని రైలెక్కని గ్రామం ఎక్కడో ఉందని అనుకుంటే పొరపాటే. ఆ గ్రామం పేరే నెక్కొండ. పేరు వెరైటీగా ఉంది.. ఇదెక్కడో అనుకునేరు.. మన తెలంగాణలోని ఓ చిన్న గ్రామమిది. అసలు ఆ గ్రామస్థులు అలా ఎందుకు చేశారో తెలుసుకుందాం.


ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో నెక్కొండ అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామానికి రైల్వే స్టేషన్ సదుపాయం ఉంది. గ్రామస్థులకు రైలు ఎక్కాలన్న కోరిక కూడా ఉంది. టికెట్ రైలెక్కని కారణం తెలుసుకుంటే.. గ్రామస్థులను అభినందించాల్సిందే.

ఈ గ్రామస్థులు ప్రతి రోజూ తమ రైల్వే స్టేషన్ లో 60 టికెట్లు కొనుగోలు చేస్తారు. మరి రైలు ఎక్కకుండానే ఆ టికెట్ల కొనుగోలు ఎందుకంటే.. నెక్కొండ రైల్వే స్టేషన్ నర్సంపేట నియోజకవర్గంలో ఉండగా, ఆ నియోజకవర్గ ప్రజలకు ఈ స్టేషన్ ఒక వరమని చెప్పవచ్చు. అటువంటి రైల్వే స్టేషన్ లో కొన్ని రైళ్లు ఆగవు.


అయితే ప్రజల వినతులు స్వీకరించిన రైల్వే అధికారులు , ఎట్టకేలకు సికింద్రాబాద్ – గుంటూరు ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కు తాత్కాలిక హాల్టింగ్ అనుమతులు ఇచ్చారట. కనీసం మూడు నెలలు వచ్చే ఆదాయాన్ని బట్టి , రైల్వే స్టేషన్ వద్ద పూర్తి స్థాయి హాల్టింగ్ సర్వీస్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

Also Read: Woman death kiss coworker: తోటి ఉద్యోగి కిస్ చేయలేదని హత్య.. డాక్టర్‌ను 7 సార్లు కత్తితో పొడిచిన పేషెంట్

ఇక అంతే గ్రామస్తులు ఒక వాట్సాప్ గ్రూప్ ను రైల్వే టికెట్ ఫోరం పేరుతో ఏర్పాటు చేసుకొని నిధులు సమకూర్చుకున్నారు. ప్రతి రోజూ రైల్వే స్టేషన్ వెళ్లడం టికెట్ కొనుగోలు చేయడం, రైల్వేకు ఆదాయాన్ని అందివ్వడం ఆ గ్రామస్థులకు పనిగా మారింది. ఎలాగైనా తమ గ్రామంలో ఆ రైలు నిలుపుదల కోరుతూ గ్రామస్థులు ఏకం కావడంతో రైల్వే అధికారులు సైతం ఆశ్చర్యపోయారట. చివరికి వారు అనుకున్నది సాధించారు. ఇప్పుడు పూర్తి స్థాయి హాళ్టింగ్ సౌకర్యం కల్పించారు రైల్వే అధికారులు. అందుకే అంటారేమో ఐకమత్యమే మహాబలం అని. అందరూ ఒక్కటయ్యారు.. అనుకున్నది సాధించారు.

Related News

Telangana Farmers: అక్టోబర్ తొలి వారంలోనే.. రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ!

TGPSC Group 2: టీజీపీఎస్సీ గ్రూప్-2 అభ్యర్థులకు అలర్ట్.. మరో విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. షెడ్యూల్ ఇదే

Kalvakuntla Kavitha: కేసీఆర్ అడ్డాలో కవిత.. సీఎం , సీఎం అంటూ అరుపులు

Medaram Festival: మేడారం జాతరకు సీఎం రేవంత్.. అధికారులకు మంత్రి సీతక్క కీలక ఆదేశాలు

TG Number Plates: ఇకపై ఆ వాహనాలపై ‘తెలంగాణ పోలీస్’ స్టిక్కర్లు.. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు

Union Bank Manager Fraud: 10 నకిలీ గోల్డ్ లోన్ అకౌంట్స్.. రూ.75 లక్షలు.. బయటపడ్డ యూనియన్ బ్యాంకు మేనేజర్ బాగోతం

Hyderabad News: అడ్డంగా దొరికిపోయిన కేఏ పాల్‌.. పోలీసుల చేతుల్లో ఆయన గుట్టు

Hyderabad: ఘనంగా సెలబ్రిటీ డాండియా నైట్స్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Big Stories

×