BigTV English

Tholi Ekadashi 2025: తొలి ఏకాదశి స్పెషల్.. ఈ రోజు ఆ పని చేస్తే, అదృష్టం మీవెంటే

Tholi Ekadashi 2025: తొలి ఏకాదశి స్పెషల్.. ఈ రోజు ఆ పని చేస్తే, అదృష్టం మీవెంటే

Tholi Ekadashi 2025: హిందూ సంవత్సరంలో ఆషాడ మాసంలో వచ్చేది ‘తొలి ఏకాదశి’. మొదటి ఏకాదశి ప్రాముఖ్యత అంతాఇంతా కాదు. ముఖ్యంగా శుక్ల పక్షంలో వస్తుంది. చాతుర్మాసం ప్రారంభాన్ని సూచిస్తుంది. శ్రీ మహా విష్ణువు నిద్రలోకి వెళ్లే రోజు ఇది. ఈ కాలం  నాలుగు నెలలపాటు ఉంటుంది. పెళ్లిళ్లు, గృహ ప్రవేశం సహా మిగతా శుభ కార్యాలు చేయరు. ఈ పవిత్ర రోజు పొరపాటు చేయకూడని కొన్ని పనులు ఉంటాయి. తెలియక చేసిన పనుల వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటాము. జీవితంలో అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి తొలి ఏకాదశి విశిష్టత, ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


తొలి ఏకాదశిని రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆషాఢ ఏకాదశి, పద్మ ఏకాదశి లేదా హరి శయనీ ఏకాదశి లేంటే దేవశయనీ ఏకాదశి అని అంటారు. ఈ ఏడాది జూలై 6న జరుపుకుంటారు . శ్రీమహా విష్ణువు దివ్య నిద్రలోకి జారుకుంటారు. మళ్లీ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు మేల్కుంటారని భక్తులు నమ్ముతారు. మనుషులకు ఉన్న ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు ఉంటాయి. వాటితో పని చేయించే అంతరేంద్రియం మనసు కలిపితే మొత్తం పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముఖంగా పని చేసే సమయాన్ని ఏకాదశి అని పురాణాల్లో చెబుతారు.

ఏకాదశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు. ఈ మాసంలో బోనాలు, పశు పూజ , శకట ఆరాధనలు చేస్తారు కూడా.  ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటి పూట భోజనం చేసి లక్ష్మీనారాయణని నామస్మరణలో ఉంటే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు. సతీ సక్కుబాయి ఏకాదశి రోజు మోక్ష ప్రాప్తి పొందిందని చెబుతారు.


తొలిఏకాదశి రోజు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేస్తారు. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు. ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు నాశనం అవుతాయన్నది నమ్మకం. రైతులు సైతం ఇదే ఏరువాక కార్యక్రమాన్ని చేస్తారు. అతివృష్టి , అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని మహావిష్ణువుని ప్రార్థిస్తారు. పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని ఏ సమస్య ఎదురు కాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తారు.

ALSO READ: ఈ మొక్కలు మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఉన్నట్లే

ఏకాదశి రోజు ఉదయాన్నినిద్రలేవాలి. ఆలస్యంగా నిద్రపోవడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ఈ రోజు బియ్యం తినకూడదు, వండకూడదు. ముఖ్యంగా మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. అలాగే ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి తీసుకోరు. ఇక యువతీయువకులు గోళ్లు, జుట్టు కత్తిరించడం అశుభంగా భావిస్తారు.

సూర్యోదయానికి ముందు మేల్కొని స్నానం చేయాలి. ఆ తర్వాత సూర్య దేవుడికి నీరు అర్పించాలి. ఆ తర్వాత ఇంటిని ముఖ్యంగా దేవుడి గదిని శుభ్రం చేయాలి. విష్ణువు-లక్ష్మీ దేవిని పూజించండి. పండ్లు, పువ్వులు, స్వీట్లు, పసుపు, గంధం మొదలైనవి దేవుని ముందు పెట్టాలి. విష్ణువుకు తులసి ఆకులు సమర్పించాలి. తొలి ఏకాదశి రోజు తులసి ఆకులు కోయడం అశుభంగా చెబుతారు పండితుడులు.

శ్రీ మహా విష్ణువుకు అవి ప్రీతికరమైనవి కావడంతో పూజకు ఒక రోజు ముందుగానే కోసుకుని పెట్టుకోవాలి. తులసి ఆకులను విష్ణు ప్రియ అని పిలుస్తుంటారు. ఈ రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు ప్రతిజ్ఞ చేయాలి. విష్ణు పురాణం, ఏకాదశి కథను చదివి దాన్ని మననం చేసుకోవాలి. సాయంత్రం విష్ణువు-లక్ష్మీదేవికి ఆరతి ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రసాదం తీసుకోవాలి. పేదలకు, ఆవుకు ఆహారం ఇవ్వాలి. మరుసటి రోజు ఉపవాసాన్ని విరమించాలి.

 

సూచన- అందించిన సమాచారం భక్తుల నమ్మకాలు ఆధారంగా సేకరించినది. దీన్ని పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తి గతం. దీని గురించి ఆధ్యాత్మిక వేత్తలు, జ్యోతిష్యశాస్త్ర పండితుల సలహాలు స్వీకరించండి.

Related News

Vinayaka Chavithi 2025: వినాయక చవితి స్పెషల్.. శంఖుల గణనాథుడు భక్తులను.. తెగ ఆకట్టుకుంటున్నాడు!

Mahabhagya Yoga 2025: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Vastu Tips: ఈ పరిహారాలు చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్ !

Ganesh Chaturthi 2025: వినాయకుడిని ఇలా పూజిస్తే.. సంపద, శ్రేయస్సు !

Khairatabad Ganesh 2025: ఖైరతాబాద్ గణేశుడి లీలలు తెలుసుకుందాం రండి!

Tirumala Special: ఏరువాడ పంచెల రహస్యం ఇదే.. శ్రీవారి భక్తులు తప్పక తెలుసుకోండి!

Big Stories

×