BigTV English

OTT Movie : నలుగురమ్మాయిలు ఉన్న గదిలోకి ఇద్దరు సైకోలు… ఘోరమైన సీన్స్… గుండెల్ని వణికించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : నలుగురమ్మాయిలు ఉన్న గదిలోకి ఇద్దరు సైకోలు… ఘోరమైన సీన్స్… గుండెల్ని వణికించే క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : చిలీలో 1978లో పినోచెట్ నియంత సమయంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. ఓ తండ్రి కొడుకులు అమ్మాయిలపై చేసే దారుణాలు మామూలుగా ఉండవు. ఈ సినిమాలో హింస ఎక్కువగానే ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే


ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ 

ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ట్రామా’ (Trauma). 2017 లో వచ్చిన ఈ సినిమాకి, లూసియో ఎ. రోజస్ దర్శకత్వం వహించారు. ఇందులో కాటాలినా మార్టిన్, మాకరెనా కారెరె, డొమింగా బోఫిల్, మరియు జిమెనా డెల్ సోలార్ నటించారు. ఇది చిలీలోని పినోచెట్ నియంతృత్వం (1973-1990) నేపథ్యంలో రూపొందిన అత్యంత వివాదాస్పదమైన హారర్ చిత్రం. 1 గంట 46 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమా ప్లెక్స్ (Plex) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే 

చిలీలోని ఒక గ్రామీణ ప్రాంతంలో 1978లో పినోచెట్ నియంతృత్వ పరిపాలన సమయంలో,  జరిగిన ఒక భయంకరమైన దృశ్యంతో ఈ స్టోరీ  మొదలవుతుంది. ఇక్కడ ఒక బాలుడు తన తండ్రి, చేసే హింసాత్మక చర్యలకు గురవుతాడు. ఇది అతన్ని భవిష్యత్తులో సైకోపాత్‌గా మారుస్తుంది. ఒక రోజు ఆండ్రియా, కామిలా ,మాగ్డలీనా, జూలియా అనే స్నేహితురాళ్లు చిలీలోని ఒక గ్రామీణ ప్రాంతంలో విహార యాత్రకు వెళతారు. వీళ్ళు ఒక కాబిన్‌లో సరదాగా గడపడానికి ప్లాన్ చేస్తారు. కానీ దారిలో ఒక బార్‌లో ఆగినప్పుడు స్థానికులతో ఘర్షణ జరుగుతుంది. అక్కడ జువాన్ అనే వ్యక్తి ఈ అమ్మాయిలకు సహాయం చేస్తాడు. కానీ అతను చాలా క్రూరమైన మనిషని తొందర్లోనే తెలుస్తుంది. ఆ రోజు రాత్రి జువాన్, అతని కొడుకు మారియో కాబిన్‌కు వచ్చి, నలుగురు అమ్మాయిలపై దారుణమైన దాడి చేస్తారు. ఈ దాడిలో తీవ్రమైన హింస ఉంటుంది. మాటల్లో కూడా ఇలాంటి దారుణాలు చెప్పేలా ఉండవు.

ఇక అక్కడి నుంచి ఎలాగో తప్పించుకుని, స్థానిక గ్రామంలో సహాయం కోసం వెళతారు. కానీ అక్కడి పోలీసులు సహాయం చేయడానికి బదులు, వారు కూడా జువాన్‌తో సంబంధం కలిగి ఉంటారని తెలుస్తుంది. ఈ హింసాకాండం పినోచెట్ నియంతృత్వం సమయంలో జరిగిన దారుణాల నుండి వచ్చిన “వారసత్వం”గా చూపబడుతుంది. జువాన్ ఆ కాలంలో శిక్షణ పొందిన ఒక హంతకుడు. పోలీసుల సహాయంతో జువాన్, మారియోను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తారు, కానీ ఈ క్రమంలో వీళ్ళు మరింత హింసకు గురవుతారు. చివరికి ఈ అమ్మాయిలు అక్కడి నుంచి తప్పించుకుంటారా ? ఆ సైకోలపై రివేంజ్ తీర్చుకుంటారా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్కాకుండా చూడండి.

Read Also : టార్చర్ చేసే మొగుడిని ఇరికించడానికి పక్కా కిక్కిచ్చే ప్లాన్… ఆ అమ్మాయి అరాచకం చూస్తే మైండ్ బ్లాక్

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

Big Stories

×