BigTV English
Advertisement

SSMB 29 OTT Deal: సినీ చరిత్రలో రాజమౌళి మూవీకి అతిపెద్ద డీల్.. కలలో కూడా ఊహించని నంబర్!

SSMB 29 OTT Deal: సినీ చరిత్రలో రాజమౌళి మూవీకి అతిపెద్ద డీల్.. కలలో కూడా ఊహించని నంబర్!

SSMB 29 OTT Deal:’శాంతి నివాసం’ అనే సీరియల్ ఎపిసోడ్ డైరెక్టర్ గా కెరియర్ ఆరంభించారు రాజమౌళి (Rajamouli ). ఆ తర్వాత ఎన్టీఆర్ (NTR) తో ‘సింహాద్రి’, ‘ స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమాలు చేసి భారీ పాపులారిటీ అందుకున్నారు. ఆ తర్వాత ఒక్కో హీరోని ఎంచుకుంటూ తీసిన ప్రతి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, పరాజయం ఎరుగని డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు. ఇక ఎప్పుడైతే ప్రభాస్ (Prabhas ), రానా (Rana) కాంబినేషన్లో మల్టీ స్టారర్ గా ‘ బాహుబలి’ సినిమా చేసి రికార్డులు క్రియేట్ చేశారో.. ఇక అప్పటినుంచి రాజమౌళి సినిమా అంటేనే ఒక బ్రాండ్ అన్నట్టుగా మారిపోయింది. ఇక ఆ తర్వాత మళ్లీ మల్టీ స్టారర్ ప్రయోగంలో భాగంగా ఎన్టీఆర్ , రామ్ చరణ్ (Ram Charan) లతో చేసిన ‘ఆర్ఆర్ఆర్’ ఏకంగా గ్లోబల్ స్థాయిలో గుర్తింపును అందించింది. అంతేకాదు ఆస్కార్ అవార్డులు కూడా సొంతం చేసుకుంది.


ప్రపంచం దృష్టి ఎస్ఎస్ఎంబి 29 మూవీ పైనే..

ఈ క్రమంలోనే రాజమౌళి నుంచి వచ్చే తదుపరి సినిమా కోసం అభిమానులే కాదు యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అందులో భాగంగానే తెలుగు సూపర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న మహేష్ బాబు(Maheshbabu ) తో రాజమౌళి ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 30 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) భాగమయింది. ఈమె కూడా తనవంతుగా సినిమాపై అంచనాలు పెంచేస్తున్న విషయం తెలిసిందే.


సినీ చరిత్రలో అతిపెద్ద ఓటీటీ డీల్..

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ అందరిలో గూస్ బంప్స్ తెప్పిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు, రాజమౌళి కాకాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి – 29 పాన్ వరల్డ్ మూవీకి సంబంధించి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ రికార్డ్ ధరకు కొనుగోలు చేయబోతుందని సమాచారం. అంతేకాదు సినీ చరిత్రలోనే ఇప్పటివరకు ఇదే అతిపెద్ద డీల్ గా కూడా అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా కలలో కూడా ఊహించని నెంబర్ కి ఓటీటీ డీల్ కుదుర్చుకోబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు సమాచారం. ఏది ఏమైనా సినీ చరిత్రలోనే అతిపెద్ద డీల్ ఈ సినిమాకి కుదరబోతోంది అని తెలిసి అది, ఎన్ని వందల కోట్లు ఉంటుందో అంటూ అందరూ తమ ఊహాలకు పని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎస్ ఎస్ ఎం బి 29 సినిమా విశేషాలు..

పాన్ వరల్డ్ మూవీగా రాబోతున్న ఈ సినిమాకి దాదాపుగా రూ.1000 కోట్ల బడ్జెట్ ను కేటాయించారు. దుర్గ ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత కేఎల్ నారాయణ భారీ రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ లో టాప్ టెక్నీషియన్లతో ఈ సినిమాని రూపొందిస్తూ ఉండడం గమనార్హం. ఇక ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

Related News

Baahubali The Epic : బాహుబలి రీ రిలీజ్, మెగాస్టార్ చిరంజీవి పై ట్రోలింగ్

Baahubali : జై మాహిష్మతి అంటూ అభిమానుల్లో ఉత్సాహం నింపిన జక్కన్న, ఇది మరో చరిత్ర

Bahubali: బాహుబలి రీ రిలీజ్ అరాచకం, మాస్ జాతరకు ఇది పెద్ద దెబ్బే

Mahesh Babu: బాహుబలి పనులలో రాజమౌళి.. ఫ్యామిలీతో చిల్ అవుతున్న మహేష్!

The Girl Friend: ది గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ ఛాయిస్ రష్మిక కాదా.. ఆమె రిజెక్ట్ చేస్తేనే ?

Lokesh Kanagaraj: లోకేష్ కి హీరోయిన్ దొరికేసిందోచ్.. రచ్చ రాంబోలే!

Prabhas: ప్రభాస్ కాలికి ఏమైంది.. ఆ సమస్యతో బాధపడుతున్నాడా.. టెన్షన్ లో ఫ్యాన్స్!

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ మూవీలో నటించాలని ఉందా…అయితే ఇలా చేయండి..!

Big Stories

×