BigTV English

Sri Nemaligundla Rang nayaka Swamy : తేడా వస్తే అక్కడే తేనెటీగలే శిక్ష వేస్తాయా….

Sri Nemaligundla Rang nayaka Swamy : తేడా వస్తే అక్కడే తేనెటీగలే శిక్ష వేస్తాయా….
Sri Nemaligundla Rang nayaka Swamy Temple


Sri Nemaligundla Rang nayaka Swamy Temple : నల్లమల దట్టమైన అడవిలో ఉండే నెమలిగండ్ల రంగస్వామి ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. విష్ణుమూర్తి రంగనాయక స్వామిగా భక్తుల్ని కరుణిస్తున్నారు. గర్భగుడిలో స్వామి నిజరూపంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. త్రేతాయుగం కాలం నుంచీ ఈ ఆలయంలో స్వామి పూజలు అందుకుంటున్నట్లు చరిత్ర చెబుతోంది. గుండ్లకమ్మ నది బ్రహ్మెశ్వరం వద్ద జన్మించి నల్లమల కొండల్లో తిరిగి రెండు కొండల మధ్య నుంచి చివరికి నెమలిగుండ్లలోకి చేరుతుంది. నెమలి ముఖ ఆకారంతో ఉన్న మహర్షి నిర్మించడం వల్లే నెమలిగుండం అనే పేరు సార్థకమైంది. ఆంధ్రప్రదేశ్ లో అతిపురాతనమైన ఆలయంగా పేరుంది.

ఎంతో మహత్యం ఉన్న ఈగుడికి వచ్చే భక్తులు నియమ నిబంధనలు పాటించకపోతే శిక్ష పడుతుంది. ఈరోజుకి అది జరగడం స్వామి మహిమే అంటారు భక్తులు. ఈ క్షేత్రంలోకి ప్రవేశించేటప్పుడు శుచి, శుభ్రంగా ఉండాలి. అశుభ్రంగా గుడికి వస్తే మాత్రం తేనెటీగలు దాడి చేస్తాయని విశ్వాసం ఉంది. రంగనాధ స్వామి ఆలయానికి తేనెటీగలే రక్షగా నిలవడం విశేషం. ఈ ప్రదేశాన్ని లక్ష్మణవనంగా కూడా పిలుస్తారు. ప్రతి ఏటా చైత్రమాసంలో బహుళ పాడ్యమి, విదియ, తదియ తిథుల్లో మూడురోజుల పాటు ఉపవాసదీక్ష నిర్వహిస్తారు. సద్ది పండగ తర్వాత రోజు కుటుంబసభ్యులతో, బంధుమిత్రులతో కలిసివచ్చి వనభోజనాలు చేస్తుంటారు.


ఈ ఆలయం శనివారం రోజు మాత్రమే తెరచి ఉంటుంది. ఈ సమయంలో భక్తులు సుదూర ప్రాంతాలనుంచి కూడా తరలి వస్తుంటారు. ఆలయగుండంలో స్నానమాచరించి స్వామివారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారుఆధ్యాత్మికంగానే పర్యాటక పరంగాను భక్తుల్నిఈ క్షేత్రం విశేషంగా ఆకట్టుకుంటుంది. నెమలిగుండాన్ని ‘గుండ్లకమ్మ’ జన్మస్థానం అని అంటారు. ఏడాది పొడవునా ఈ జలపాతం నిత్యం జాలు వారుతూనే కనిపిస్తుంది. ఎత్తైన కొండల మధ్య జాలువారే జలపాతం ప్రకృతి ప్రేమికుల్ని కట్టి పడేస్తుంది.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×