BigTV English

Fire Drones: 200 డిగ్రీల వేడిని తట్టుకోగలిగే ఫైర్ డ్రోన్స్..

Fire Drones: 200 డిగ్రీల వేడిని తట్టుకోగలిగే ఫైర్ డ్రోన్స్..

Fire Drones: ఈరోజుల్లో డిఫెన్స్ రంగంలో మనుషులకు సాయంగా ఎన్నో టెక్నాలజీలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏదో ఒక విధంగా అవి కొంతవరకు మాత్రమే సాయంగా నిలబడగలుగుతున్నాయి. అందుకే ప్రతీ ప్రతికూలతను అధిగమించే విధంగా టెక్నాలజీని తయారు చేయాలని శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే డిఫెన్స్, సెక్యూరిటీ లాంటి రంగాల్లో డ్రోన్స్ అనేవి ఎంతో సాయంగా ఉంటున్నాయి. తాజాగా మరో కొత్త రకం డ్రోన్లు డిఫెన్స్‌లో అందుబాటులోకి రానున్నాయని వారు తెలిపారు.


డ్రోన్స్ అనేవి ఇప్పుడు ఎన్నో విధాలుగా డిఫెన్స్ అధికారులకు సహాయపడుతున్నాయి. శత్రువుల కదలికలను కనిపెట్టే విషయంలో, అధికారులను అప్రమత్తం చేసే విషయంలో డ్రోన్స్ ముందుటున్నాయి. కానీ కొన్ని స్థలాలకు, ప్రాంతాలకు డ్రోన్స్ వెళ్లలేకపోవడం ఒక ప్రతికూలతగా నిలుస్తోంది. ముఖ్యంగా అగ్నిప్రమాదాలు జరిగిన ప్రాంతాలకు డ్రోన్స్ వెళ్లలేవు. ఇకపై అలా జరగకుండా అలాంటి ప్రాంతాలకు కూడా వెళ్లగలిగే డ్రోన్స్‌ను ఇంపీరియర్ కాలేజ్ లండన్ పరిశోధకులు తయారు చేశారు.

10 నిమిషాల వరకు 200 డిగ్రీల వేడిని తట్టుకునే విధంగా వారు ప్రోటోటైప్ డ్రోన్స్‌ను తయారు చేశారు. దీనికి ఫైర్ డ్రోన్ అని పేరు కూడా పెట్టారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు అధికారులు వెంటనే లోపలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. అదే సమయంలో డ్రోన్స్ ముందుగా ఆ చోటికి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితిని, సమాచారాన్ని అధికారులకు అందించే విధంగా ఈ ఫైర్ డ్రోన్స్ తయారయ్యాయి. ఉదాహరణకు ఏ గదిలో మనుషులు చిక్కుకుపోయారు, ఏ గదిలో ఎక్కువగా మంటలు చెలరేగుతున్నాయి.. ఇలాంటి సమచారం ఫైర్ డ్రోన్స్ అధికారులకు అందించగలవు.


కొత్త థెర్మల్ ఏరోజెల్ ఇన్సులేషన్ మెటీరియల్‌తో పాటు ఇంటర్నల్ కూలింగ్ సిస్టమ్‌తో ఈ ఫైర్ డ్రోన్స్‌ను తయారు చేసినట్టు వారు చెప్తున్నారు. అంతే కాకుండా బయట నుండి వీటిని పొలిమేడ్ ఏరోజెల్, గ్లాస్ ఫైబర్స్‌తో తయారు చేసినట్టు తెలిపారు. ఆపై వేడిని తట్టుకోవడం కోసం అల్యూమీనియంతో కోటింగ్ వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే డిఫెన్స్ విభాగంలో ఉపయోగపడడానికి ఎన్నో రకాల డ్రోన్స్ అందుబాటులో ఉండగా.. ఈ ఫైర్ డ్రోన్స్ ప్రత్యేకంగా ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు ఎక్కువగా ఉపయోగపడుతాయని వారు ఆశిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×