BigTV English

Sri Rama Navami 2025: శ్రీరామనవమి ఎప్పుడు ? ఈ ముహూర్తంలో పనులు చేపడితే అన్నీ మంచి ఫలితాలే

Sri Rama Navami 2025: శ్రీరామనవమి ఎప్పుడు ? ఈ ముహూర్తంలో పనులు చేపడితే అన్నీ మంచి ఫలితాలే

Sri Rama Navami 2025: ప్రతి సంవత్సరం చైత్ర మాస శుక్ల పక్షంలో తొమ్మిదవ రోజున శ్రీ రామ నవమిని జరుపుకుంటారు. ఈ రోజును శ్రీరాముని జన్మదినంగా చెబుతారు. అందకే ఈ పర్వదినం రోజున శ్రీరాముడిని ప్రత్యేకంగా పూజిస్తారు. భారతీయ సంస్కృతి , సంప్రదాయంలో రామ నవమి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది శ్రీరాముకి గౌరవం, ధైర్యం , మతం పట్ల  ఉన్న భక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఈ రోజున.. భక్తులు శ్రీరాముడిని పూజిస్తారు. అంతే కాకుండా ఆయన ఆదర్శాలను స్వీకరించడానికి కూడా ప్రయత్నిస్తారు.


రామ నవమి రోజున శ్రీరాముడిని పూజించడం ద్వారా భక్తుల జీవితంలో ఆనందం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని , జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే.. ఈ రోజున దుర్గామాత తొమ్మిదవ అవతారమైన సిద్ధిదాత్రిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఆమె ఆనందం, శ్రేయస్సు, అన్ని అడ్డంకుల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. అందుకే చాలా మంది రామ నవమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగ మతపరంగా చాలా ముఖ్యమైనది. మరి ఈ ఏడాది రామ నవమి సరైన తేదీ, పూజ సమయం, పూజా పద్ధతి, ఏ సమయంలో నూతన కార్యాలను ప్రారంభించాలనే విషయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రామ నవమి తేదీ 2025:
చైత్ర మాస శుక్ల పక్ష నవమి తిథి ప్రారంభం: 05 ఏప్రిల్ 2025, శనివారం రాత్రి 07:26 గంటలకు
చైత్ర మాస శుక్ల పక్షం నవమి తిథి ముగిసే సమయం: 06 ఏప్రిల్ 2025, ఆదివారం రాత్రి 07:22 గంటలకు
ఏప్రిల్ 20న ఉదయ తిథి ప్రకారం.. నవమి 6వ తేదీ ఉదయ తిథిగా జరుపుకుంటారు.


రామ నవమి శుభ ముహూర్తం 2025:
రామ నవమి పూజకు అనుకూలమైన సమయం: 06 ఏప్రిల్ 2025 ఉదయం 11:08 నుండి మధ్యాహ్నం 01:39 వరకు
రామ నవమి మధ్యాహ్న ముహూర్తం – ఉదయం 11:07 నుండి మధ్యాహ్నం 13:39 వరకు

రామ నవమి పూజ విధానం:
రామ నవమి రోజున.. ముందుగా బ్రహ్మ ముహూర్తంలో మేల్కొని స్నానం చేసి పూజాగదిని శుద్ధి చేసుకోండి.

దీని తరువాత.. ఉపవాసం ఉంటానని అనుకుని శ్రీరాముడిని పూజించడానికి మీ మనస్సును నిశ్చయించుకోండి.

ఉపవాసం పాటించేటప్పుడు రోజంతా నిజం మాట్లాడటం, మంచి ప్రవర్తనను కొనసాగించాలని గుర్తుంచుకోండి.

పూజా స్థలాన్ని గంగాజలంతో శుద్ధి చేసి.. అక్కడ ఒక స్టూల్ వేసి దానిపై పసుపు రంగు వస్త్రాన్ని పరచాలి.

తరువాత దానిపై శ్రీరాముడు, సీత ,లక్ష్మణుడు, శ్రీ హనుమంతుడి విగ్రహాలను ప్రతిష్టించండి.

ఇప్పుడు శ్రీరాముడిని ధ్యానించి ఆయనను ప్రార్థించండి.

రాముడిని మీ ఇంటికి ఆహ్వానించి.. ఆయన పాదాలను పూజించండి.

Also Read: ఏ దేవుడికి.. ఏ ప్రసాదం సమర్పించాలో తెలుసా ?

దీని తరువాత పంచోప్చార పూజ చేయండి. దీనిలో పువ్వులు, గంధం, దీపం, నైవేద్యాలు సమర్పించండి.

ఇప్పుడు రామ స్తోత్రం, రామ చాలీసా పఠించండి. రామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా శ్రీరాముని ఆశీస్సులు లభిస్తాయి. రామ్ చాలీసా పారాయణం ముఖ్యంగా బలాన్ని, అదృష్టాన్ని పెంచుతుందని నమ్ముతారు.

పూజ చివర్లో శ్రీరాముడికి హరతి ఇచ్చి, చివరికి ప్రసాదం పంచి ఇంటి సభ్యులందరికీ పంచండి. ఆ విధంగా, పూజా ఆచారాన్ని పూర్తి చేయడం ద్వారా మీ జీవితంలో ఆనందం, శాంతి , శ్రేయస్సు నెలకొంటాయి. శ్రీరామ నవమి రోజు శుభ ముహూర్తంలో నూతన పనులు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×