BigTV English

NTR: ‘సాగర సంగమం’ రీమేక్‌లో ఎన్‌టీఆర్.. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది కొరటాల.!

NTR: ‘సాగర సంగమం’ రీమేక్‌లో ఎన్‌టీఆర్.. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది కొరటాల.!

NTR: చాలావరకు అప్పటి క్లాసిక్ సినిమాలు టచ్ చేయకుండా ఉండడమే మంచిది అని మూవీ లవర్స్ అంటుంటారు. ఆ క్లాసిక్స్‌ను టచ్ చేసి వాటిని రీమేక్ చేయాలని అనుకున్నా, వాటికి సీక్వెల్ తెరకెక్కించాలని అనుకున్నా అవి చాలావరకు వర్కవుట్ అవ్వవు. అలా చేసిన చాలావరకు సినిమాలు ఫ్లాపే అయ్యాయి. అయినా కూడా స్టార్ డైరెక్టర్లు సైతం అదే పనిచేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా కే విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాగర సంగమం’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్‌తో కలిసి జపాన్ టూర్‌లో ఉన్న కొరటాల శివ.. అక్కడ ‘దేవర’ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేశారు.


సెంటిమెంట్ బ్రేక్

కొరటాల శివ (Koratala Siva), ఎన్‌టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘దేవర’. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్‌టీఆర్ హీరోగా నటించిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య ఈ మూవీ విడుదలయ్యింది. యావరేజ్ టాక్‌తో మొదలయినా కూడా కలెక్షన్స్ విషయంలో దూసుకుపోయి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. మామూలుగా రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకు అయినా ఫ్లాప్ ఎదురవ్వాల్సిందే అనే సెంటిమెంట్ ఉండేది. అలాంటి సెంటిమెంట్‌ను ‘దేవర’తో బ్రేక్ చేశాడు ఎన్‌టీఆర్. అలా ఇండియాతో పాటు ఓవర్సీస్‌లో ఈ మూవీ హిట్ ఇవ్వగా తాజాగా జపాన్‌లో కూడా గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. జపాన్ రిలీజ్ కోసం కొరటాల శివ, ఎన్‌టీఆర్ స్వయంగా అక్కడికి వెళ్లారు.


జపాన్‌లో ప్రమోషన్స్

‘ఆర్ఆర్ఆర్’తో జపాన్‌లో ఎన్‌టీఆర్‌కు క్రేజ్ బాగా పెరిగింది. మామూలుగా జపాన్ ప్రేక్షకులు తెలుగు సినిమాలను అమితంగా ఇష్టపడతారు. అలా ‘ఆర్ఆర్ఆర్’ను సూపర్ హిట్ చేశారు. అందుకే ‘దేవర’ కూడా అక్కడ హిట్ అవ్వాలనే ఆలోచనతో ఎన్‌టీఆర్ స్వయంగా రంగంలోకి దిగాడు. అక్కడ ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యాడు. ఇంటర్వ్యూల్లో పాల్గొన్నాడు. తను మాత్రమే కాదు దర్శకుడు కొరటాల శివ కూడా ఈ ప్రమోషన్స్‌లో జాయిన్ అయ్యాడు. ఆ క్రమంలోనే ఒక జపాన్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలుగులో దర్శకుడిగా కే విశ్వనాథ్ గొప్పదనం గురించి, ఆయన తెరకెక్కించిన సినిమాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కొరటాల.

Also Read: ప్రభాస్ ఎవరితో సినిమా చేసినా ఇబ్బందిపడేది మాత్రం అభిమానులే..

ఎన్‌టీఆర్‌కే సాధ్యం

‘‘తెలుగులో కే విశ్వనాథ్ అనే ఒక డైరెక్టర్ ఉన్నారు. ఇండియన్ సినిమాలోనే ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్. ఆయన మా సౌత్‌కు, తెలుగు ఇండస్ట్రీకి చెందినవారు. ఆయన ఇండియన్ కల్చర్‌ను చూపిస్తూ పలు క్లాసిక్స్‌ను తెరకెక్కించారు. ఆయన సాగర సంగమం అనే ఒక సినిమా తీశారు. అది నాకు ఎప్పటికీ ఫేవరెట్. మా తరంలోని ప్రతీ దర్శకుడు సాగర సంగమం చిత్రాన్ని రీమేక్ చేయాలని అనుకుంటారు. అది కూడా ఎన్‌టీఆర్‌తోనే చేయాలని అనుకుంటారు. అలాంటి సినిమా చేస్తే ఎన్‌టీఆరే చేయగలడు అనిపిస్తుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు కొరటాల శివ. ఈ దర్శకుడు చేసిన వ్యాఖ్యలకు ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ సైతం సపోర్ట్ చేస్తున్నారు. నిజంగానే అది ఎన్‌టీఆర్ (NTR) వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×