BigTV English

Sriramanavami Brahmotsavalu : నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు.. 22న కల్యాణం

Sriramanavami Brahmotsavalu : నేటి నుంచి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో బ్రహ్మోత్సవాలు.. 22న కల్యాణం

Vontimitta Kondanda Ramalayam : ఆంధ్రా అయోధ్యగా పేరొందిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నేటి నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రాంగణమంతటినీ శోభాయమానంగా తీర్చిదిద్దింది. విద్యుత్ దీపాలతో అలంకరించింది. ఉదయం ధ్వజారోహణంతో శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 20న హనుమంత వాహనం, 21న గరుడసేవ నిర్వహించనున్నారు.


Also Read : బాలరాముడికి సూర్యతిలకం.. దర్శనమివ్వనున్న మహత్తర దృశ్యం

ఏప్రిల్ 22న.. అనగా చైత్ర పూర్ణిమ నాడు పండు వెన్నెలలో సీతారాములవారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు. ఈ కల్యాణాన్ని కన్నులారా వీక్షించి తరించేందుకు భక్తులు తరలిరానున్నారు. భక్తులు కల్యాణాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక కల్యాణం రోజున ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. 26న నిర్వహించే పుష్పయాగంతో నవమి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. 11వ శతాబ్ధంలో నిర్మించిన ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారామలక్ష్మణుల మూలవిరాట్టులు మాత్రమే గర్భగుడిలో దర్శనమిస్తాయి.


Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×