BigTV English

Subha Drishti Ganapathy: నరదృష్టిని నివారించే శుభదృష్టి గణపతి..

Subha Drishti Ganapathy: నరదృష్టిని నివారించే శుభదృష్టి గణపతి..

Subha Drishti Ganapathy: నరుని కంటి చూపుకు నల్లరాయి కూడా పగులుతుందనేది సామెత. అందుకే కొత్తగా నిర్మించిన దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు.. ఎదురుగా ఒక అద్దంలోంచి స్వామిని చూసి, ఆ తర్వాతే అసలు విగ్రహాన్ని చూసేలా ఏర్పాట్లు చేస్తారు. నర దృష్టి కారణంగా చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోవటం, మనుషుల మధ్య ఈర్ష్య, అసూయా ద్వేషాల వంటి సమస్యలు వస్తాయి. ఈ ప్రతికూల ప్రభావాన్ని నిరోధించి, సత్ఫలితాలు పొందేందుకు శుభదృష్టి గణపతి (కంటి దృష్టి గణపతి) చిత్రం ఎంతో మేలుచేస్తుంది.


మహాగణపతి 33వ రూపమే ఈ శుభ దృష్టి గణపతి. అగస్త్య మహాముని ఈ గణపతి రూపాన్ని సృష్టించాడు. ఈ శుభదృష్టి గణపతి యొక్క రూపం చాలా విచిత్రంగా వుంటుంది. శ్రీ మహావిష్ణువు తర్వాత శంఖు, చక్రాలను ధరించిన ఏకైక దైవశక్తి ఈయనే. శివపార్వతుల ముద్దుబిడ్డ అయిన ఈ గణపయ్య తండ్రివలే.. త్రినేత్రుడు, తల్లిచేతిలోని త్రిశూలాన్ని ధరించి దర్శనమిస్తాడు.

ఇతర దేవతల వలె అనేక ఆయుధాలను ధరించి, సింహమును వాహనంగా చేసుకుని వుంటాడు. మూషికము కూడా ఈయన పాదాల చెంత వుంటుంది. మహా పరాక్రమశాలిగా పూర్ణ వికసిత పద్మంలో విజయోత్సాహం గల వీరుడిలా ఉంటాడు. 9 నాగదేవతలు ఈయన శిరస్సుమీద పడగలు విప్పి కనిపిస్తాయి. 8 భుజాల ఈ గణపతి కుడి 4 చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, చక్రం, అంకుశం ఉంటాయి. ఇక.. ఎడమ 4 చేతుల్లో అగ్ని, గద, శంఖం, పాశం ఉంటాయి.


ఈ గణపతి దివ్యరూపాన్ని ఇంటిలో వుంచుకుని నిత్యం పూజించడం ద్వారా ఇంట్లోని యావన్మంది గృహసభ్యులుపై ప్రసరించే దిష్టి యొక్క దుష్ప్రభావం సూర్యరశ్మి సోకిన మంచులా కరిగిపోతుంది. ఇంటిలో ఈ శుభదృష్టి గణపతి పటాన్ని గోడపై ఉత్తరదిశ చూసేలా తగిలించాలి. పూజాగదిలో కానీ, ఇంటికి వచ్చే అందరి దృష్టి ఆకర్షించే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ శుభదృష్టి గణపతి శత్రువులను సంహరించి, యుద్ధరంగం నుంచి వచ్చిన విజేతలా, విజయలక్ష్మి వరించిన వీరునిగా సమర రూపంతో విజయోత్సాహంతో దర్శనమిస్తాడు.

Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×