Big Stories

Office Vastu Tips: ఆఫీస్​లో వాస్తు నియమాలు పాటిస్తే.. మీ గెలుపుకు తిరుగే లేదు!

Vastu Tips For Office: ప్రస్తుతం ఉన్న కాలంలో కూడా వాస్తును నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో వాస్తు అనేది తప్పక పాటిస్తారు. ఇళ్లు, ఆఫీసు, ఏదైనా స్థలం వంటివి ఏది తీసుకోవాలన్న అక్కడ వాస్తు నియమాలు సరిగ్గా ఉండాలని చూస్తారు. ఏ ఒక్క గదిని వాస్తు ప్రకారం నిర్మించకపోయినా సరే అది వద్దనుకుని వదిలేస్తారు. అయితే ఇవన్నీ పూర్వీకులు పాటించారు.. ఇప్పుడు ఎవరు పాటిస్తారు అని అనుకుంటే పొరపాటే.

- Advertisement -

చాలా మంది రాజకీయ నాయకులు, ఆఫీసర్లు, ఉద్యోగులు వంటి మంచి స్థాయిలో ఉన్న వారు కూడా ప్రస్తుతం వాస్తు నియమాలు లేకుండా ఏ పని చేయడం లేదు. అయితే వాస్తు నియమాలు కేవడం స్థలాలకు మాత్రమే కాదని.. మనం చేసే పనిలో విజయానికి కూడా తోడ్పడతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఆఫీసులో పలు వాస్తు నియమాలు పాటిస్తే చేసే ప్రతీ పనిలో విజయం సాధించే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: హనుమాన్‌ని భజరంగ భళి అని ఎందుకు అంటారు..?

  1. ఆఫీసులో తూర్పు లేదా ఉత్తరం వైపు కూర్చోవాలి
  2.  పిల్లర్ల కింద కాకుండా మంచి స్థలం చూసి కూర్చోవడం వల్ల ఆఫీసులో పాజిటివ్ గా వర్క్ చేసుకోవచ్చు
  3. పని చేసే ప్రదేశం అంతా శుభ్రంగా ఉంచుకోవాలి.
  4. డెస్క్ పైన వస్తువులను నీటిగా సర్దుకుని, క్లీన్ గా ఉంచుకోవాలి
  5. కూర్చునే కుర్చీ వాస్తు ప్రకారం ఎత్తుగా, వెనుక భాగం ధృఢంగా ఉండాలి
  6. డెస్క్ వద్ద మొక్కలను పెంచుకోవాలి
  7. లైటింగ్ ఎక్కువగా, మంచి పాజిటివిటీ క్రియేట్ చేయగలిగే స్థలాన్నే ఎంచుకోవాలి
  8. డెస్క్ పైన మీకు ఇన్స్పీరేషన్ గా ఉండే వ్యక్తి ఫోటోను ఉంచుకోవాలి. అందువల్ల పాజిటివ్ గా వర్క్ చేసుకోవచ్చు.
  9. లాఫింగ్ బుద్ధుడి విగ్రహం పెట్టుకోవడం ద్వారా చూసిన ప్రతీ సారి మైండ్ రిఫ్రెషింగ్ గా ఉంటుంది.
  10. తోటి ఉద్యోగులతో కలిసి సరాదాగా మాట్లాడుతూ ఉండాలి
  11. ప్రతీ రెండు గంటలకు ఒకసారి బ్రేక్ తీసుకుని అటు ఇటు నడవాలి

ఈ టిప్స్ పాటించడం వల్ల వాస్తు ప్రకారం ఆఫీసులో ఏ పని తలపెట్టినా విజయాలే వరిస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News