Surya Grahan 2025: 2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం హోలీ రోజు ఏర్పడింది. ఆ తర్వాత అందరి దృష్టి ఇప్పుడు సూర్యగ్రహణంపై ఉంది. ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం 2025 మార్చి 29న అంటే చైత్ర మాసం అమావాస్య రోజున ఏర్పడనుంది.
మార్చి 29న సూర్య గ్రహణం చైత్ర మాసం అమావాస్య రోజున జరగనుంది. మధ్యాహ్నం 2:20 నుండి సాయంత్రం 6:16 వరకు సూర్య గ్రహణం ఉంటుంది. చంద్రగ్రహణం లాగా, ఈ గ్రహణం కూడా భారతదేశంలో కనిపించదు. ఇది ప్రధానంగా ఆస్ట్రేలియా, ఆసియా , హిందూ మహాసముద్రంలో కనిపిస్తుంది. కానీ జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం.. ఈ సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంతకీ ఆ అదృష్ట రాశులేవి ? సూర్య గ్రహణ ప్రభావం వివిధ రాశులపై ఎలా ఉండబోతుందనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యగ్రహణం యొక్క ప్రాముఖ్యత:
మార్చి 29, 2025న సూర్యగ్రహణం మీన రాశి , ఉత్తర భాద్రపద నక్షత్రాలలో ఏర్పడుతుంది. ఈ సమయంలో, సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, మీన రాశిలో ఉంటారు. ఈ గ్రహణం యొక్క ప్రభావం 12 రాశులపై ఉంటుంది.
మేష రాశి:
సంవత్సరంలో వచ్చే మొదటి సూర్యగ్రహణం మేష రాశి వారికి ప్రత్యేకంగా ఉంటుంది. మీరు కెరీర్ , ఉద్యోగంలో మంచి ఫలితాలను పొందుతారు. అంతే కాకుండా మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగ్గా ఉంటుంది. అవివాహితులు వివాహం గురించిన చర్చలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. విద్యా రంగంలో మంచి విజయాన్ని పొందుతారు. అంతే కాకుండా కుటుంబ సమస్యలు కూడా తొలగిపోతాయి. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడుల పట్ల నిర్ణయాలు ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి.
కర్కాటక రాశి:
ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం కర్కాటక రాశి వారికి అధిక ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.అంతే కాకుండా మీ జీవితంలో ఆనందం, శాంతి పెరుగుతాయి. అసంపూర్ణమైన పనులలో విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఇంతకు ముందు ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే.. మాత్రం దాని నుండి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా మీరు నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది.
Also Read: సక్సెస్ అవ్వాలంటే.. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి !
మకర రాశి:
మకర రాశి వారికి ఆఫీసుల్లో సీనియర్ అధికారులతో సమన్వయం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో ఆనందం పెరుగుతుంది. మీ లాభ అవకాశాలు పెరుగుతాయి. ఇది మీ ఆర్థిక పరిస్థితిలో మార్పు తెస్తుంది. మీకు ఆశ్చర్యకరమైన బహుమతి లభించే అవకాశాలు ఉన్నాయి. కెరీర్‌లో అనేక ప్రయోజనాలు ఉంటాయి. అసంపూర్ణమైన పనులలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.