Bulli Raju : సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాల్లో విక్టరీ వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’ (sankranthiki vasthunam) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీతో వెంకీ – అనిల్ కాంబో హ్యాట్రిక్ హిట్ ను తమ ఖాతాలో వేసుకుంది. ఇందులో మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించగా, దాదాపు 300 కోట్లు కొల్లగొట్టి ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. అయితే ఇందులో హీరో హీరోయిన్లతో పాటు బుల్లి రాజు (Bulliraju) ఎంత పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ బుల్లిరాజు మరో బంపర్ ఆఫర్ కొట్టేసినట్టు సమాచారం.
బుల్లిరాజుకు మెగా ఆఫర్
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీలో విక్టరీ వెంకటేష్ కుమారుడిగా నటించిన బాల నటుడు రేవంత్. ఈ అబ్బాయి బుల్లి రాజు పాత్రలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ బుడ్డోడి నటనకి చిన్నా పెద్దా తేడా లేకుండా ఆడియన్స్ ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. సినిమాలో బుల్లి రాజు తన డైలాగ్స్ తో థియేటర్లలో అందరినీ మెస్మరైజ్ చేశాడు. దీంతో బుల్లి రాజు అలియాస్ రేవంత్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సెలబ్రిటీ అయిపోయాడు.
ఈ నేపథ్యంలోనే ఈ బుడ్డోడికి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా బుల్లి రాజుకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీలో బుల్లి రాజుకు అవకాశం ఇస్తున్నట్టు సమాచారం. అనిల్ రావిపూడి – చిరు (chiranjeevi) కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో బుల్లి రాజు ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు అని అంటున్నారు. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు. కానీ అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ లో కూడా బుల్లి రాజు భాగం కాబోతున్నాడు అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో… ఈ డైరెక్టర్ బుల్లి రాజుని ఇప్పట్లో వదిలేలా లేడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కంటే ముందే బుల్లి రాజు జనసేనకి ప్రమోషన్స్ చేస్తూ, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. తరువాత మూవీలో ఛాన్స్ పట్టి, సెలబ్రిటీ అయిపోయాడు. ఇక చిరు – అనిల్ రావిపూడి – బుల్లి రాజు కాంబినేషన్లో కామెడీ టైమింగ్ ఊహించుకుంటూ తెగ సంబర పడుతున్నారు మెగా అభిమానులు.
చిరు – అనిల్ రావిపూడి మూవీకి టైటిల్ ఇదే
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇక అనిల్ రావిపూడి చిరుతో తీయబోయే సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ గురించి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ సక్సెస్ మీట్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చిరు, అనిల్ మూవీకి ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్ పెడితే బాగుంటుందని తన మనసులోని మాటను బయట పెట్టారు. మరి ఈ మూవీకి అనిల్ రావిపూడి ఏం టైటిల్ పెడతారు అన్నది ఆసక్తికరంగా మారింది.