E-Paper
Advertisement

Saturn-Moon Conjunction: శని, చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఆశించిన విజయాలు

Saturn-Moon Conjunction: శని, చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఆశించిన విజయాలు
Advertisement

Saturn-Moon Conjunction: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక నిర్దిష్ట సమయం తర్వాత రాశిచక్ర గుర్తులను మార్చుకుంటూ ఉంటాయి. కర్మ, న్యాయానికి దేవుడైనా శని ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. రాశి మార్చకుండా ఈ ఏడాది మొత్తం అదే రాశిలో ఉంటాడు. కానీ తన కదలికలను మాత్రం మార్చుకుంటాడు. కుంభ రాశిలో శని, చంద్రుడి కలయిక మరికొద్ది రోజుల్లో జరగనుంది. దీని ఫలితంగా కొన్ని రాశుల వారికి రాజయోగం ప్రభావంతో ఆశించిన విజయాలు, గౌరవం లభిస్తాయి. అవి ఏ రాశిలో ఇప్పుడు తెలుసుకుందాం.

శని  జూన్ 29 నుంచి కుంభ రాశిలో తిరోగమన దశలో సంచరించబోతున్నాడు. అందుకు ముందుగానే చంద్రుడితో కలిసి రాజయోగం ఇవ్వనున్నాడు. జూన్ 26న చంద్రుడు కుంభ రాశిలో సంచరిస్తాడు. చంద్రుడు రెండున్నర రోజుల పాటు ఇదే రాశిలో ఉంటాడు.కుంభ రాశిలో శని, చంద్రుడి కలయిక వల్ల శశి యోగం ఏర్పడుతుంది. దీని ఫలితంగా కొన్ని రాశులవారు శుభ ఫలితాలను పొందనున్నారు. అంతే కాకుండా కొన్ని రాశుల వార ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధన లాభం కూడా పెరుగుతుంది. శని, చంద్రుల కలయిక వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మిథున రాశి:
శని, చంద్రుల కలయిక వల్ల మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కలలన్నీ నిజమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. కొత్త దంపతులు సంతోషంగా జీవిస్తారు.
ధనస్సు రాశి:
ధనస్సు రాశి వారికి శశి యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు. వృత్తి జీవితంలో అద్భుత ఫలితాలను పొందుతారు. వ్యాపారంలో కూడా లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తిలో ఆటంకాలు తొలగిపోతాయి. మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం అభిస్తుంది.
కుంభరాశి:
శశి యోగం వల్ల కుంభరాశి వారికి శుభాలు కలుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందుతారు. వైవాహిక జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. కొత్త ఆస్తిని కొనుగోలు చేయడం జరుగుతుంది.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×