Horoscope Today : గ్రహాల సంచారం ప్రకారం రాశిఫలాలను అంచనా వేస్తారు. జనవరి 9న ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి : ఈ రాశి వారికి ఈరోజు దైవదర్శనాలు చేసుకుంటారు. వృధా ఖర్చులు అదుపు చెయ్యడం మంచిది. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. మాతృ సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది
వృషభ రాశి : ఈ రాశి వారి సంతానం ఈరోజు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభ వార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
మిధున రాశి : ఈ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు కలిగిస్తాయి. ధన పరమైన సమస్యలు బాధిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు ఉంటాయి.
కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఇంట్లో ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి.
సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార పరంగా భాగస్థులతో వివాదాలు ఏర్పడతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తికావు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.
కన్యా రాశి : ఈ రాశి వారికి ఈరోజు ఆప్తుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహనిస్తుంది.
ALSO READ: గ్రహ బాధలు, సమస్యలు పట్టి పీడిస్తున్నాయా? ఈ సింపుల్ రెమెడీస్‌తో మీ బాధలన్నీ పరార్
తులా రాశి : ఈ రాశి విద్యార్థులకు ఈరోజు నూతన అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.
వృశ్చిక రాశి : ఈ రాశి వారికి ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప నష్టాలు తప్పవు. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి ఈరోజు సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ధన పరంగా మాట ఇవ్వడం మంచిది కాదు
మకర రాశి : ఈ రాశి వారికి ఈరోజు చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. ఆర్థికాభివృద్ధి కలుగుతుంది.
కుంభ రాశి : ఈ రాశి వారికి ఈరోజు కీలక సమయంలో సన్నిహితుల సాయం
అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీన రాశి : ఈ రాశి వారికి ఈరోజు అధికారులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. చేపట్టిన పనులలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడుతాయి.
ALSO READ: Donga Mallanna Temple: దేవుడినే దొంగను చేసిన భక్తులు – ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?