BigTV English

Vaisakha Masam: వైశాఖ మాసం వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే మీకు జీవితాంతం సుఖసౌఖ్యాలే!

Vaisakha Masam: వైశాఖ మాసం వచ్చేస్తోంది.. ఈ పని చేస్తే మీకు జీవితాంతం సుఖసౌఖ్యాలే!

హిందూ క్యాలెండర్ ప్రకారం రెండవ నెల వైశాఖమాసం. ఈ మాసంలో విష్ణువు, కృష్ణుడిని ఆరాధిస్తారు. చైత్ర మాసం కొన్ని రోజుల్లో ముగిసిపోతుంది. చైత్రమాసంలాగే వైశాఖ మాసం కూడా అత్యంత పవిత్రమైన నెల. ఎందుకంటే ఇది విష్ణువుకి ఇష్టమైనది. ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని కూడా పిలుస్తారు. మాధవుడు అంటే శ్రీకృష్ణుడే. వైశాఖ మాసం ఏప్రిల్ 14న ప్రారంభమై మే 13 వరకు ఉంటుంది. ఆ సమయంలో మీరు కొన్ని పనులు చేయడం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలను పొందవచ్చు.


వైశాఖ మాసం విశాఖ నక్షత్రానికి చెందినది. విశాఖ నక్షత్రానికి అధిపతి దేవ గురువైన బృహస్పతి, ఇంద్రుడు. విశాఖ నక్షత్రంతో సంబంధం ఉన్నందున ఈ మాసాన్ని వైశాఖంగా పిలుస్తారు. స్కంధ పురాణంలో వైశాఖమాసంలో పుణ్యం సంపాదించే నెలగా చెప్పుకుంటారు. ఈ నెలలో మీరు చేసే శుభకార్యాలు ఎన్నో పుణ్యాలను ఇస్తాయి. అలాగే ఈ మాసంలో చేసే దానాలు కూడా ఎంతో ఫలితాన్ని ఇస్తాయి. జీవితాంతం మీకు కలిసి వచ్చేలా చేస్తాయి.

వైశాఖమాసంలో కచ్చితంగా చేయాల్సిన పనులు
వైశాఖ మాసంలో పూజలతో పాటు దానధర్మాలు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. వైశాఖ మాసంలో ఎలాంటి వస్తువులు దానం చేయాలో తెలుసుకోండి.


వైశాఖ మాసం మంచి మండుటెండల్లో వస్తుంది. ఆ సమయంలో బాటసారులకు నీటిని అందించేందుకు ఉచిత తాగునీటి దుకాణాన్ని ఏర్పాటు చేయండి. ఇది ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. అలాగే జంతువులు, పక్షులకు… ఆహారం, నీరు వంటి వసతిని కల్పించండి. వైశాఖ మాసంలో నీటిని దానం చేయడం వల్ల జీవితంలోని ఎన్నో కష్టాలను తొలగిపోయేలా చేసుకోవచ్చు. అలాగే సమస్యలు, వ్యాధులు కూడా తొలగిపోతాయి. జీవితంలో ఆనందం శ్రేయస్సు కలుగుతాయి.

వైశాఖ మాసంలో రసాలతో నిండిన పండ్లను దానం చేస్తే మంచిది. అలాగే బూట్లు, చెప్పులు, గొడుగులు, నీటి కుండలు, షర్బతు వంటి శీతాల పానీయాలను కూడా పేదలకు దానం చేయాలి. ఇది కాకుండా సత్తు పిండిని దానం చేయడం వల్ల కూడా ఎంతో మేలు జరుగుతుంది.

వైశాఖ మాసంలో చేయకూడని పనులు
వైశాఖ మాసంలోని ఎండ వేడి గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. దీనివల్ల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. వైశాఖ మాసంలో మధ్యాహ్నం సూర్యుడు నడి నెత్తి మీదకి వచ్చే సమయంలో బయటకు వెళ్ళకూడదు. అలాగే వేయించిన, కారంగా ఉండే ఆహారాలను తినకూడదు. నేలపైన నిద్రపోవాలి. శరీరంపై నూనె రాయకూడదు. వేడి నీటితో స్నానం చేయకూడదు. రాత్రిపూట ఆలస్యంగా తినకూడదు. వీలైనంతవరకు ఏడు గంటల్లోపే తినేందుకు ప్రయత్నించాలి. లేకుంటే ఆరోగ్యం ఇస్తుంది. దీనితో పాటు దేవతలకు కూడా కోపం వచ్చే అవకాశం ఉందని చెప్పుకుంటారు.

వైశాఖ మాసంలో లక్ష్మీదేవి సమేత మహావిష్ణువును తులసి ఆకులతో పూజిస్తే ఎన్నో ఫలితాలు దక్కుతాయి. వైజాగ్ మాసంలో సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే ఉదయం రావి చెట్టుకు నీరు పోసి ప్రదక్షిణలో చేసి దీపం పెడితే శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలోనే అక్షయ తృతీయ పండుగ కూడా వస్తోంది.

విష్ణుమూర్తి పరశురాముని అవతారాన్ని ధరించిన రోజును పరశురామ జయంతిగా వైశాఖ మాసంలోనే నిర్వహిస్తారు. బంగారం కొనుగోలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం, సత్యం, దానధర్మాలు చేయడం వంటివన్నీ కూడా వైశాఖ మాసంలో మీకు విపరీతమైన ఫలితాలను అందిస్తాయి. వైశాఖ మాసంలోనే బద్రీనాథ్ లో ఉన్న ఆలయం తలుపులు కూడా తెరుస్తారు.

Also Read: పూజ గది ఏ దిక్కున ఉంటే అదృష్టమో తెలుసా?

పురాణాలు ప్రకారం ఈ వైశాఖ మాసం మహత్యాన్ని శ్రీ మహా విష్ణువే నేరుగా లక్ష్మీదేవికి వివరించినట్లు చెబుతారు. ఈ మాసంలో చేసే తలకు స్నానం పూజా జపాలు తపాలు దానాలు అన్నీ కూడా మంచి ఫలితాలను అందిస్తాయి. అయితే ఈ నెలలోనే సూర్యుడు మేషరాశిలో ఉంటాడు. దీనివల్ల ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే వేడి నుంచి ఉపశమనం కలిగించే వాటినే మాత్రమే దానం రూపంలో ఇవ్వాలని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అంటే నీరు, గొడుగు, పాదరక్షలు వంటివి ఇస్తే మీకు ఎంతో మేలు జరుగుతుంది. వైశాఖ శుద్ధ దశమినాడే పద్మావతి దేవికి వెంకటేశ్వర స్వామికి వివాహం జరిగినట్టు కూడా పురాణాలు వివరిస్తున్నాయి. అంటే వైశాఖమాసం నెలలో ప్రతి రోజు ఒక పర్వదినమే. కాబట్టి ఈ మాసం అంతా దీపం పెట్టి ఆ లక్ష్మీదేవిని వేడుకుంటే మీ కష్టాలన్నీ తీరడం ఖాయం.

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×