BigTV English

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌ను ఐస్ చేస్తున్న ‘ప్రేమలు’ హీరో.. దానికోసమేనా.?

Balakrishna: బాలయ్య ఫ్యాన్స్‌ను ఐస్ చేస్తున్న ‘ప్రేమలు’ హీరో.. దానికోసమేనా.?

Balakrishna: దేశవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌లో తెలుగు ప్రేక్షకులే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని చాలామంది స్టార్లు అంటుంటారు. వేరే భాషలో గుర్తింపు తెచ్చుకున్న స్టార్లు సైతం ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో తిరుగుతూ తమ సినిమాలను ప్రమోట్ చేస్తుంటారు. తెలుగు ఆడియన్స్ ఆదరించారంటే తమ సినిమా సూపర్ హిట్ అని నమ్ముతారు. సీనియర్ హీరోలకు మాత్రమే కాదు.. యంగ్ హీరోలకు కూడా ప్రస్తుతం అదే ఫీలింగ్ ఏర్పడింది. మంచి సినిమా తీస్తే చాలు.. భాషతో సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ హిట్ చేస్తారనే ఫీలింగ్ అందరిలో బలంగా ఉండిపోయింది. అందులో ‘ప్రేమలు’ హీరో నస్లీన్ కూడా యాడ్ అయ్యాడు.


‘ప్రేమలు’ హిట్

2024లో విడుదలయిన మలయాళం సినిమాలు చాలావరకు హిట్ టాక్‌ను అందుకున్నాయి. అంతే కాకుండా మలయాళ సినిమాలకు ఇది మర్చిపోలేని సంవత్సరంగా గుర్తుండిపోయింది. అన్నింటి కంటే ముందుగా ‘ప్రేమలు’ అనే లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ హైదరాబాద్‌లో తెరకెక్కించడంతో తెలుగు ఆడియన్స్‌కు కొంత అయినా కనెక్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో ముందుగా దీనిని హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో మలయాళంలో విడుదల చేశారు. భాష రాకపోయినా సబ్ టైటిల్స్‌తోనే ఈ సినిమాను చూడడానికి చాలామంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు. అలా ‘ప్రేమలు’ బ్లాక్‌బస్టర్ అయ్యింది. అందులో హీరో నస్లీన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.


తెలుగువాళ్ల కోసం

‘ప్రేమలు’ తర్వాత నస్లీన్‌కు తెలుగులో కూడా మంచి పాపులారిటీ లభించింది. ప్రస్తుతం హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయిపోయాడు నస్లీన్. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ అయిన ‘అలప్పురా జిమ్‌ఖానా’ను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నాడు. కేరళలో ప్రమోషన్స్ పూర్తయ్యయో ఏమో.. తాజాగా తమిళనాడు ఈ సినిమా కోసం ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. అందులో భాగంగానే తమిళనాడులోని ఒక కాలేజ్‌కు వెళ్లిన నస్లీన్.. అక్కడ తెలుగు స్టూడెంట్స్‌ను టార్గెట్ చేశాడు, ముఖ్యంగా బాలకృష్ణ (Balakrishna) ఫ్యాన్స్‌ను టార్గెట్ చేశాడు. ముందుగా ఆ కాలేజ్‌లో తెలుగువాళ్లు ఎవరైనా ఉన్నారా అని అడిగి, జై బాలయ్య అంటూ అరిచాడు.

Also Read: మంచు మనోజ్ చర్యలు.. మోహన్ బాబుపై కోర్టు సీరియస్

పల్స్ పట్టుకున్నాడు

నస్లీన్ (Nasleen) ‘జై బాలయ్య’ అని ఒక మలయాళ హీరో అనడంతో తెలుగు ఆడియన్స్‌కు మరింత ఉత్సాహం వచ్చింది. అంతే కాకుండా దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొత్తానికి చాలామంది హీరోలలాగానే నస్లీన్ కూడా తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టుకున్నాడని ఈ వీడియో చూసిన నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన అప్‌కమింగ్ మూవీ ‘అలప్పురా జిమ్‌ఖానా’ విషయానికొస్తే.. ఇది ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమయ్యింది. ఖలీద్ రెహమాన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్లాన్ బీ మోషన్ పిక్చర్స్, రియలిస్టిక్ స్టూడియోస్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో లుక్‌మన్ అవరన్, గణపతి, సందీప్ ప్రదీప్, కొట్టాయం నజీన్, ఫ్రాంకో ఫ్రాన్సిస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×