E-Paper
Advertisement

Disruptions : ఈ పనిచేస్తే ఏ విఘ్నాలు కలగవు….

Disruptions : ఈ పనిచేస్తే ఏ విఘ్నాలు కలగవు….
Advertisement
Disruptions :

Disruptions : కొందరు ఏపని ఎటువంటి పనులు మొదలుపెట్టినా నిర్వఘ్నంగా చేసుకుపోతుంటారు. మరికొందరు ఎన్ని పనులు చేసినా కూడా ఎటువంటి ఫలితాలు కనిపించక దిగులు చెందుతూ ఉంటారు. అయితే కొంతమంది వాస్తు పరిహారాలను పాటిస్తే మరి కొందరు దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. అనుకున్న పనులు పూర్తి కావడానికి పరిహార శాస్త్రంలో కొన్ని ఉపశమనాలు ప్రస్తావించారు.
దారిద్ర్యాన్ని తొలగించుకోవడానికి కొబ్బరికాయ, పచ్చ కర్పూరం పరిష్కార మార్గంగా చెబుతున్నారు. తలరాత మార్చుకోవడం కోసం కొబ్బరికాయ తలపై పచ్చకర్పూరం పెట్టి వెలిగించి,21 సార్లు దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ కొబ్బరి కాయను ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఒకవేళ ఇంట్లో మీలాంటి వాళ్లు ఎక్కువ మంది ఉంటే వారికి ఒక్కొక్కరికి ఒక్కో కొబ్బరికాయను వాడాలి. ఏడాదికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల మీకు అంతా మంచే జరిగి మంచి ఫలితాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు..

ఈ పరిహారాన్ని మంగళవారం, గురువారం శనివారాల్లో మాత్రమే పాటించాలి. అదేవిధంగా దురదృష్టం వెంటాడుతుంది అనుకునే వారు శనిదేవుడిని పూజించడం చాలా మంచిది.. శనిదేవుడికి నిత్యం పూజ చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాగే ఇంట్లో ఉండే పాడైపోయిన గడియారం లేదా పగిలిన గాజును వెంటనే తీసివేయాలి. అలాగే ఆవుకు ప్రతిరోజు గడ్డి తినిపిస్తే చాలా మంచిది. శని దేవుడి అనుగ్రహం కోసం ఈ పరిహారం అద్భుతంగా పని చేస్తుంది. . సంవత్సరానికి రెండుసార్లు ఇలాంటివి చేయడం ఫలితాలను ఇస్తుంది. మూగజీవులకు ఆహారాన్ని కూడా ఇవ్వడం మంచిది. అలాగే వికలాంగులకు అన్నదానం చెయ్యడం మంచిది

Advertisement

గృహానికి దిష్టి తగిలింది భావించే వారు కూడా ఈ పరిహారాన్ని పాటించవచ్చు. క్లాక్ వైజ్, యాంటి క్లాక్ వైజ్ గా దిష్టి తీసి కొట్టి కుడివైపు ఉన్న కొబ్బరి కాయను ఎడమవైపు, ఎడమై వైపు ఉన్నదానికి కుడి వైపు వేయాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా పూర్తి చేయలేని పనులు ఈ పరిహారం పాటిస్తే పూర్తవుతుందని చెబుతున్నారు. కొబ్బరికాయ, కర్పూరంతో కష్టాలు, మానసిక సమస్యలు తొలగిపోతాయి.

Tags

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×